760 టన్నుల ఇసుక నిల్వలు స్వాధీనం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:40 AM
దివాన్‌చెరువు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువులోని బీజాపురి టౌన్‌షిప్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లోని భారీ ఇసుక నిల్వలను టాస్క్‌ఫోర్స్ అధికారుల బృందం శనివారం స్వాధీనం చేసుకుంది. అలాగే 6 టన్నుల ఇసుకలోడ్‌తో పాటు లారీని స్వాధీనప రచుకున్నారు. వివరాల ప్రకారం.. దివాన్‌చెరువులోని బీజాపురి టూన్‌షిప్‌లో టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం దాడులు చేసింది. ఆ సమయంలో ఒకప్రాంతంలో నిల్వ చేసిన 260 టన్నుల ఇసు

టన్నుల ఇసుకతో లారీ బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌కు అప్పగింత
దివాన్‌చెరువు, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తూర్పుగోదావరి జిల్లా దివాన్‌చెరువులోని బీజాపురి టౌన్‌షిప్‌లో రెండు వేర్వేరు ప్రాంతాల్లోని భారీ ఇసుక నిల్వలను టాస్క్‌ఫోర్స్ అధికారుల బృందం శనివారం స్వాధీనం చేసుకుంది. అలాగే 6 టన్నుల ఇసుకలోడ్‌తో పాటు లారీని స్వాధీనప రచుకున్నారు. వివరాల ప్రకారం.. దివాన్‌చెరువులోని బీజాపురి టూన్‌షిప్‌లో టాస్క్‌ఫోర్స్ బృందం శనివారం దాడులు చేసింది. ఆ సమయంలో ఒకప్రాంతంలో నిల్వ చేసిన 260 టన్నుల ఇసుక, మరోచోట నిల్వ చేసిన 500 టన్నుల ఇసుక మొత్తం 760 టన్నుల నిల్వలను అధికారుల ను స్వాధీనం పర్చుకున్నారు. దీంతో పాటు 6 టన్నుల లోడ్‌తో అక్కడికి వచ్చిన ఇసుక లారీ బిల్లులను పరిశీలించారు. అయితే ఆ బిల్లులో శనివారం ఉదయం సమయంతో ఉందని, మధ్యాహ్నం 12 గంటల వరకే ఈ బిల్లు పనిచేస్తుందని టాస్క్‌ఫోర్స్ ఎస్‌ఐ కె.ఆంజనేయులు తెలిపారు. సమయం మించి సాయంత్రం కావడం వల్ల 6 టన్నుల ఇసుకతో పాటు లారీని స్వాధీనపర్చుకుని బొమ్మూరు పోలీస్‌స్టేషన్‌కు అప్పగించామన్నారు. అలాగే దివాన్‌చెరువులోని 2 వేర్వేరు ప్రాంతాల్లో నిల్వ చేసిన 760 టన్నుల ఇసుకను స్వాధీనపర్చుకుని వీఆర్వోకు అప్పగించినట్టు మైనింగ్ శాఖ సాంకేతిక సిబ్బంది శైలజ తెలిపారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు ఇసుక నిల్వలు స్వాధీనపర్చుకున్నామన్నారు. తాను గృహనిర్మాణాలు చేసే కాంట్రాక్టర్‌నని, ఇక్కడ ఖాళీస్థలాలు ఉండడంతో గృహనిర్మాణ పనుల నిమిత్తం ఇసుకను ఇక్కడ నిల్వచేసుకున్నానని పి.వెంకటేశ్వరరావు అధికారులను కలసి వివరించాడు. వీటికి సంబంధించిన బిల్లులను తీసుకుని సోమవారం తమ కార్యాలయంలో హాజరుకావాలని శైలజ తెలిపారు. దాడుల్లో రవాణాశాఖ నుంచి గిరి, మైనింగ్ శాఖ సాంకేతిక సిబ్బంది మనీషా, దివాన్‌చెరువు వీఆర్వో డి.రామజోగి కుడా పాల్గొన్నారు.