వాయు.. గండం
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:09 AM
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బలపడింది. దీంతో జిల్లాకు మంగళవారం కూడా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్ష హెచ్చరిక జారీ అయింది. అటు కాకినాడ పోర్టులోను మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యా యి. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సోమవారం సముద్రం అల్లకల్లోలంగా మారింది.
బంగాళాఖాతంలో వాయుగుండంగా ముదిరిన తీవ్ర అల్పపీడనం
దీని ప్రభావంతో నేడు జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాల ముప్పు
కాకినాడ పోర్టులో మూడో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సోమవారం ఎడతెరిపి లేకుండా వర్షం
వరదనీటితో జిల్లాలోని 16మండలాల్లో 7,250 ఎకరాల్లో వరి పంటల మునక
గొల్లప్రోలులో సుద్దగడ్డకు వరదపోటు.. వేలాది ఎకరాల మునక
ఏలేరు, తాండవ, సుబ్బారెడ్డిసాగర్‌కు పోటెత్తుతున్న వరద.. భారీగానే ఇనఫ్లో
సముద్రం అల్లకల్లోలంతో పోర్టులో నౌకల్లోకి బియ్యం ఎగుమతులు నిలిపివేత
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కాస్తా వాయుగుండంగా బలపడింది. దీంతో జిల్లాకు మంగళవారం కూడా పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్ష హెచ్చరిక జారీ అయింది. అటు కాకినాడ పోర్టులోను మూడో నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తూ ఆదేశాలు జారీ అయ్యా యి. తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సోమవారం సముద్రం అల్లకల్లోలంగా మారింది. ఉప్పాడ వద్ద అలల తీవ్రత అధికమై పలుచోట్ల కెరటాలు బీచరోడ్డును తాకాయి. అటు సముద్రం లోపల ఈదురుగాలులు గంటకు 40కిలోమీటర్ల వేగంతో వీచాయి. దీంతో ఆఫ్రికా దేశాలకు బియ్యం ఎగు మతి కోసం వచ్చిన రెండు నౌకల్లోకి బియ్యం లోడింగ్‌ను నిలిపివేశారు. మంగళ వారం కూడా లోడింగ్ ఆపేయనున్నారు. ఒక నౌకలో ఇంకా 3వేల మెట్రిక్ టన్నులు, మరో నౌకలో ఇంకా 30శాతం బియ్యం ఎగుమతి చేయాల్సి ఉంది. కాగా వాయుగుండం ప్రభా వంతో కాకినాడ కలె క్టరేట్, ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్‌రూంలను అధికారులు కొనసాగిస్తున్నారు. తీవ్ర అల్పపీడ నం ప్రభావంతో సోమవారం జిల్లావ్యాప్తంగా అ నేకచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశా యి. దీంతో వర్షంనీటి ఉధృతితో 16 మండలాల్లో ని 85గ్రామాల్లో పంట పొలాలు నీటమునిగా యి. సుద్దగడ్డ, సుబ్బారెడ్డిసాగర్‌కు వరద నీరు పోటెత్తుతుండడంతో వేలాది ఎకరాలు పంటలు చెరువుల్లా మారాయి.
రోజంతా ముసురు..వానే..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగు తున్న అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మా రింది. దీనిప్రభావంతో సోమవారం జిల్లావ్యాప్తం గా రోజంతా వర్షం కురిసింది. అటు ముసురు వాతావరణ నెలకొనడంతో బయట జనజీవనం కూడా స్తంభించింది. పలుచోట్ల మినహా మిగి లిన మండలాల్లో రోజంతా ఓమోస్తరు వర్షం కు రవడంతో అత్యధికంగా జగ్గంపేటలో 18మిల్లీమీ టర్లు, ఏలేశ్వరంలో 9.5మి.మి. చొప్పున వర్షపా తం నమోదవగా మిగిలిన మండలాల్లో 9 నుం చి 4 మిల్లీమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. తీవ్ర అల్పపీడనంగా వాయుగుండంగా మార డంతో దీని ప్రభావంతో జిల్లాలో మంగళవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంద ని హెచ్చరించింది. ఒకపక్క ఎడతెరిపి లేని వ ర్షాలు, మరోపక్క ఎగువ నుంచి వస్తోన్న నీటితో సుద్దగడ్డకు వరద పెరిగింది. దీంతో గొల్లప్రోలు మండలంలో కొత్తకాలనీకి వెళ్లే దారి మొత్తం మునిగిపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందు లు పడ్డారు. కాలనీకి వెళ్లే వారిని అధికారులు బోట్లలో తరలించారు. వర్షాలు కొనసాగుతుండ డం, వరద ఇంకా పెరిగే ప్రమాదం ఉండడంతో ప లు కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు నిర్ణయించారు. ప్రత్తిపాడు మండలం సు బ్బారెడ్డిసాగర్‌కు సైతం క్ర మేపీ వరద పెరుగుతోంది. ప్రస్తుతం 35క్యుసెక్కుల ఇ నఫ్లో కొనసాగుతోంది. ఏలే రు రిజర్వాయర్‌కు సైతం 7,260క్యుసెక్కుల ఇనఫ్లో న మోదైంది. క్యాచమెంట్ ఏరి యాలో భారీ వర్షాలు కురు స్తుండడంతో ఇనఫ్లో మరిం త పెరిగే అవకాశం ఉంద ని అధికారులు అంచనా వే శారు. తాండవలోకి 2,765 క్యూసెక్కుల ఇనఫ్లో కొనసా గుతోంది. ఎడతెరిపి లేని వ ర్షాలు, ఎగువనుంచి వస్తో న్న నీటితో జిల్లాలో పలు చోట్ల పంటలు నీటమును గుతున్నాయి. ప్రధానంగా కాలువలు, చెరువుల సమీ పంలో ఉన్న పంటపొలాల్లోకి నీరు అధికంగా చేరుతోంది. దీంతో పలుచోట్ల వరిచేలు నీటము నిగి చెరువులను తలపిస్తున్నాయి.దీంతో అన్నదా తలు లబోదిబోమంటున్నారు. ఖరీఫ్ సీజనలో ఇంతవరకు జిల్లాలో 61,405హెక్టార్లలో నాట్లు పూర్తయ్యాయి.తాజా వర్షాలతో జిల్లాలో 16 మం డలాల్లోని 85గ్రామాల్లో 2,906మంది రైతులకు చెందిన 2,917హెక్టార్లలో వరి పంట నీట ముని గింది. వర్షాల ముప్పు కొనసాగుతుండడంతో వరి పంట మరింత దెబ్బతినే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఏలేరుకు పెరిగిన ఇన్‌ఫ్లోస్
పిఠాపురం/గొల్లప్రోలు, ఆగస్టు 18(ఆంధ్ర జ్యోతి): ఏలేరు రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లోస్ భారీ గా పెరిగాయి. ఏజెన్సీతోపాటు ఎగువప్రాంతా ల నుంచి నీరు రావడంతో నీటి నిల్వలు పెరుగుతున్నాయి. సోమవారం సాయంత్రం 6గం టల సమయానికి రిజర్వాయర్‌లో నీటి నిల్వ లు 12.37 టీఎంసీలకు చేరుకున్నాయి. రిజర్వాయర్‌లో గరిష్ఠ నీటిమట్టం 86.56మీటర్ల వద్ద 24.11 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం నీటిమట్టం 79.05మీటర్లుగా ఉంది. పరివాహక ప్రాంతాలు నీరు వస్తుండడంతో ఉదయం నుంచి ఇన్‌ఫ్లోస్ పెరుగుతూ 6,735 క్యూసెక్కులకు చేరుకోగా పురుషోత్తపట్టణం ఎత్తిపోతల పథకం ద్వారా వస్తున్న నీరు 525 క్యూసెక్కులకు తగ్గింది. ప్రస్తుతం మొత్తం ఇన్‌ఫ్లోస్ 7,260 క్యూసెక్కులు ఉండ గా, విశాఖ స్టీల్‌ప్లాంటుకు 220 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఏలేరు పరిధిలో ఆయకట్టుకు నీటి విడుదలను నిలిపివేశారు. వర్షాల నీరు చేరడంతో పిఠాపురం, గొల్లప్రోలు వద్ద ఏలేరు కాలువలు వర్షపునీటితో ఉధృతం గా ప్రవహిస్తున్నాయి.
గర్భిణులు, బాలింతలు సురక్షిత ప్రాంతాలకు తరలింపు
గొల్లప్రోలు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): రహదారులను సుద్దగడ్డ వరద నీరు ముంచెత్తిన నేపథ్యంలో గొల్లప్రోలు కొత్తకాలనీ నుంచి గర్భిణులు, బాలింతలు, చిన్నారులు, ఆరోగ్య అవసరాలు కలిగిన వారిని సురక్షిత ప్రాం తాలకు తరలించారు. ఇందునిమిత్తం కలెక్టర్ ఆదేశాల మేరకు అగ్నిమాపకశాఖకు చెందిన ఫైబర్‌బోటును ఏర్పాటు చేశారు. దీనిద్వారా అధికారులు దగ్గరుండి బాలింతలు, ముగ్గురు గర్భిణులను ఎక్కించారు. వీరిని వారి బంధువుల ఇళ్లకు పంపించారు. తరలింపులో తహసీల్దారు పీవీ గోపాలకృష్ణ, ఐసీడీఎస్ సీడీపీవో దుర్గాదేవి, గొల్లప్రోలు అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి డాక్టర్ అమృతరావు, పిఠాపురం సీఐ శ్రీనివాస్, గొల్లప్రోలు ఎస్‌ఐ రామకృష్ణ, ఆర్‌ఐ బాలకృష్ణ పాలుపంచుకున్నారు.
జిల్లాలో వర్షపాతం వివరాలు
కలెక్టరేట్(కాకినాడ), ఆగస్టు 18(ఆంధ్రజ్యో తి): జిల్లావ్యాప్తంగా సోమవారం ఉదయం 8.30గంటలకు 844 మి.మీ వర్షపాతం నమో దైంది. తొండంగి మండలంలో అత్యధికంగా 55.2 మి.మీ నమోదు కాగా శంఖవరం మం డలంలో 54.2, గొల్లప్రోలు మండలంలో 52.2, పిఠాపురం మండలంలో 51.6, కోటనందూరు మండలంలో 50.2, యు.కొత్తపల్లి మండలం లో 50.2 వర్షపాతం నమోదైంది. జగ్గంపేట మండలంలో 32.6, గండేపల్లి 23.4, ఏలేశ్వరం 45.2, ప్రత్తిపాడు 42.4, రౌతులపూడి 48.2, కిర్లంపూడి 46.2, పెదపూడి 22.4, పెద్దాపురం 32.2, తుని 49.6, సామర్లకోట 34.0, కరప 29.2, కాకినాడఅర్బన 29.4, కాజులూరు 31.2, కాకినాడ రూరల్ 36.4, తాళ్లరేవులో 29.8 వర్ష పాతం నమోదైంది. సరాసరి వర్షపాతం 40.2 మి.మీ నమోదైంది. సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పరిశీలిస్తే జిల్లావ్యాప్తంగా 98.4మి.మీ వర్షపాతం నమోదైంది. దీనిలో జగ్గంపేట మండలంలో అత్యధికంగా 21.2 మి.మీ వర్షపాతం నమోదైంది.