Share News

యానాం.. జలమయం!

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:21 AM

యానాం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): యానాంలో మంగళవారం తెల్లవారుజామున ఉ రుములు, మెరుపులతో 3 గంటలు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది

యానాం.. జలమయం!
జలమయమైన ఓ రోడ్డు

ఎడతెరిపిలేని భారీ వర్షం

నీట మునిగిన రోడ్లు

పిడుగుపాటుకు సిమెంట్‌ పిల్లర్‌ ధ్వంసం

యానాం, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): యానాంలో మంగళవారం తెల్లవారుజామున ఉ రుములు, మెరుపులతో 3 గంటలు ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులు విపరీతంగా వీయడంతో పలుచోట్ల వృక్షాలు నేల కొరిగాయి. యానాంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు క్రీడా ప్రాంగణాలు చెరువులను తలపించాయి. డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణా ప్రభుత్వ ఆర్ట్స్‌ కళాశాల సమీపంలో వర్షంనీరు నిలిచిపోవడంతో పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పిళ్లారాయస్వామి ఆల యం, పోలీస్‌స్టేషన్‌ సముదాయాలు నీటమునిగాయి. ప్రధానంగా అన్ని రహదారులు వర్షం నీటితో నిండిపోయాయి. కురసాంపేట గ్రామంలో కొబ్బరి చెట్టుపై, అలాగే గుండాబత్తుల సూర్యనారాయణ ఇంటిపై పిడు గు పడడంతో మూడు అడుగులున్న కాంక్రీట్‌ పిల్లర్‌ పగిలిపోయి చెల్లాచెదురైంది. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ సంఘటనతో నాలుగు టీవీలు, ఎనిమిది సీలింగ్‌ ఫ్యాన్లు కాలిపోయినట్టు బాధితులు తెలిపారు.

Updated Date - Oct 15 , 2025 | 12:21 AM