Share News

‘వానా’వరణం

ABN , Publish Date - May 21 , 2025 | 01:13 AM

ఒక పక్క తీవ్ర ఎండలు.. భరించలేని వేడి.. ఉక్కబోతతో అల్లాడుతున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు మంగళవారం కురి సిన భారీ వర్షాలు ఉపశమనం కలిగించాయి. తెల్లవారుజాము నుంచీ రోజంతా అనేకచోట్ల ఓ మోస్తరు నుంచి కుండపోతగా వానపడడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు.

‘వానా’వరణం
కాకినాడ నగరంలో కురుస్తున్న వాన

  • ఎండా పోయి.. వాన వచ్చే ఢాం ఢాం

  • ఉదయం నుంచి వదలని వాన

  • వరుణుడి దెబ్బకు భానుడు పరార్‌

  • కాకినాడ జలమయం

  • కరపలో అత్యధిక వర్షపాతం

  • నేడు, రేపు కూడా వానలు

  • ఊపిరిపీల్చుకున్న జనం

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ఒక పక్క తీవ్ర ఎండలు.. భరించలేని వేడి.. ఉక్కబోతతో అల్లాడుతున్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజలకు మంగళవారం కురి సిన భారీ వర్షాలు ఉపశమనం కలిగించాయి. తెల్లవారుజాము నుంచీ రోజంతా అనేకచోట్ల ఓ మోస్తరు నుంచి కుండపోతగా వానపడడంతో జనం ఊపిరిపీల్చుకున్నారు. గడచిన కొన్ని వారాలుగా ఉమ్మడితూర్పుగోదావరి జిల్లాలో అడపాదడపా వర్షాలు కురుస్తున్నాయు. కాక పోతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొట్టి సాయంత్రానికి చినుకులు పడుతున్నాయి. దీంతో రోజులో సగం ప్రజలు వేడి, ఉక్కబోతతో నరకం చూస్తున్నారు. అయి తే సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా వాతా వరణం మారింది.అర్ధరాత్రి నుంచి మంగళవా రం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వాన కురి సింది. కొన్నిచోట్ల అయితే మంగళవారం ఉద యం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వానలు పడ్డాయి. దీంతో రోజంతా ఎండమా యమై చల్లని వాతావరణం కొనసాగడంతో జనం ఉపశమనం పొందారు. కాకినాడ నగరంలో భారీ వర్షం పడడంతో మెయిన్‌ రోడ్డు, మసీదుసెంటర్‌, లోతట్టు ప్రాంతాలన్నీ మోకా ల్లోతు నీటిలో మునిగాయి.అనేక ఇళ్లల్లోకి సైతం నీరు వచ్చేసింది. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు కాకి నాడ నగరంలో ఏకంగా 7.2 సెంటీమీటర్ల వర్ష పాతం నమోదైంది. కరప మండలంలో ఏక ధాటిగా వానపడడంతో రాష్ట్రంలోనే అత్యధి కంగా 6.5 సె.మీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షం ధాటికి అనేక రహదారులు మునిగా యి. పంటచేలల్లోకి నీరు వచ్చి చేరింది. కాకి నాడ రూరల్‌లో 5.5 సెం.మీ. నమోదైంది. కోన సీమ జిల్లాలోని మండపేటలో అతి తక్కువ వ్యవధిలో 4.8 సెంటీమీటర్ల వర్షపాతం నమో దైంది. కాకినాడ జిల్లా పెదపూడిలో 5, కాజు లూరు మండలం ఆర్యవటంలో 4.8, పిఠాపు రం, తాళ్లరేవు, రౌతులపూడిలో 2, కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 4.4, కపిలేశ్వరపు రంలో 3.6, ఆలమూరు 2.1, ఆత్రేయపురం 1.2, తూర్పుగోదావరి జిల్లా కడియంలో 2, బిక్క వోలు 1.8, అనపర్తి 1.7 సెం.మీ. చొప్పున వర్ష పాతం నమోదైంది. మరోపక్క రుతు పవనాల ప్రభావంతో బంగాళాఖాతంలో ఉపరితల ఆవ ర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో నేడు, రేపు కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించింది.

Updated Date - May 21 , 2025 | 01:13 AM