Share News

కురిసింది కుండపోత!

ABN , Publish Date - Jun 21 , 2025 | 12:47 AM

పిఠాపురం/గొల్లప్రోలు/కొత్తపల్లి/రాజమహేం ద్రవరం (ఆంధ్రజ్యోతి), జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడడంతో రహదారులన్ని జలమయమయ్యాయి. గొల్లప్రోలు పట్టణంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది.

కురిసింది కుండపోత!
కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో కురుస్తున్న భారీ వర్షం

పిఠాపురం, గొల్లప్రోలు, రాజమహేంద్రవరంలో భారీ వర్షం

పిఠాపురం/గొల్లప్రోలు/కొత్తపల్లి/రాజమహేం ద్రవరం (ఆంధ్రజ్యోతి), జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. పరిసర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడడంతో రహదారులన్ని జలమయమయ్యాయి. గొల్లప్రోలు పట్టణంలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల చెట్లు కొమ్మలు విరిగిపడ్డాయి. అలాగే కొత్తపల్లి మం డలంలో శుక్రవారం సాయంత్రం ఈదురుగాలు లతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులకు విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమహే ంద్రవరంలో రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు వానలో ఇబ్బందులు పడ్డారు.

Updated Date - Jun 21 , 2025 | 12:47 AM