సామర్లకోటలో కుంభవృష్టి
ABN , Publish Date - Oct 20 , 2025 | 12:11 AM
సామర్లకోట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా సామర్లకోటలో వర్షం కుంభవృష్టిగా కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్ల వారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి లోత ట్టు, మెరక ప్రాంతాలు పూర్తిగా జలమయమ య్యాయి. పలు కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. భారీ వర్షానికి ఏడీబీ రోడ్డు మీదుగా వరద నీరు పెద్ద ప్రవాహంలా వీర్రాజునగర్, ఎఫ్‌సీఐ గోదాములు, సత్యనారాయణపురం మీదు గా ఆదివారం తెల్లవారుజాము
భారీ వర్షంతో పట్టాలపైకి నీరు
స్తంభించిన రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ
పలు రైళ్లు ఆలస్యం
పనుల్లో అధికారులు నిమగ్నం
సామర్లకోట, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): కాకి నాడ జిల్లా సామర్లకోటలో వర్షం కుంభవృష్టిగా కురిసింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్ల వారుజాము వరకు కురిసిన భారీ వర్షానికి లోత ట్టు, మెరక ప్రాంతాలు పూర్తిగా జలమయమ య్యాయి. పలు కాలనీల్లో ఇళ్లల్లోకి నీరు చేరింది. భారీ వర్షానికి ఏడీబీ రోడ్డు మీదుగా వరద నీరు పెద్ద ప్రవాహంలా వీర్రాజునగర్, ఎఫ్‌సీఐ గోదాములు, సత్యనారాయణపురం మీదు గా ఆదివారం తెల్లవారుజాము నుంచి రైలు పట్టాలపైకి చేరింది. రైల్వే స్టేషన్‌లోని ఐదు ట్రాక్‌లపై అడుగు ఎత్తున నీరు నిలిచి పోయింది. దీంతో రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థ స్తంభిం చింది. రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడడంతో ఔటర్ సిగ్నల్ వద్ద రైళ్లను నిలుపుదల చేసి రైల్వే సిబ్బంది సహాయం తో స్టేషన్‌కు తీసుకువచ్చి తిరిగి పంపే ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. దీంతో ఆదివారం తెల్లవారుజాము నుంచి రాత్రి వరకు సుమారు 14 గంటల పాటు విజయవాడ, విశాఖ వైపు రైళ్లు 10-20 నిమిషాల ఆలస్యంతో రాకపోకలు సాగిం చాయి. ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గుర యా ్యరు. మరోపక్క రైల్వే ట్రాక్‌పైకి వరద నీరు చేరకుండా నియంత్రించేందుకు రెండు ఎక్స్‌కవేట ర్ల సహాయంతో అధికారులు సహాయ చర్యలు చే పట్టారు. పెద్దపులి చెరువు, మట్టపల్లివారి చెరువు, సంపంగ తోట చెరువులు పూర్తిగా నీటితో నిండా యి. ఆ నీరు ఎగువ ప్రాంతాల నుంచి చేరడంతో ఎఫ్‌సీఐ తూముల నుంచి డీఎస్‌ఏ క్వార్టర్స్ తూ ముల మీదుగా గోదావరి కాలువలోకి మళ్లించేం దుకు రైల్వే అధికారులు ఎంతో శ్రమించాల్సి వచ్చి ంది. ఆదివారం రాత్రికి కూడా రైల్వే స్టేషన్‌లోని ఐదు ట్రాక్‌లపై వరద నీరు పూర్తిస్థాయిలో తొలగి పోలేదు. వర్షాలు తగ్గుముఖం పడితే సోమవారం తెల్లవారుజాము నాటికి నీటిని తొలగించే చర్య లు పూర్తవుతాయని సామర్లకోట రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ ఎం.రమేష్ ‘ఆంధ్ర జ్యో తి’కి తెలిపారు. ఇటీవల ఆరేళ్లలో కురిసిన వర్షాలకు ట్రాక్‌పైకి ఇంతలా నీరు చేరిన దాఖలాలు లేవని అధికారులు చెప్తు న్నారు. జిల్లాలోనే అత్యధికంగా సామర్లకోట మండ లంలో 132.4 మి.మీ. వర్షపాతం నమో దైం దని మండల గణాంకఅధికారి ప్రసాద్ చెప్పారు.