Share News

‘వానా’వరణం..

ABN , Publish Date - Apr 06 , 2025 | 12:36 AM

పగలంతా ఎండవేడిమితో అల్లాడిన కాకినాడ జిల్లా వాసులు శనివారం సాయంత్రం భారీగా కురిసిన వర్షంతో సేదదీరారు. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఉష్ణో గ్రతలు పెరుగుతూ 35 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఎండదెబ్బకు జనం బయటకు వచ్చేందుకు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం పదిగంటల్లోపే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇక ఆఫీసులకు, వివిధ పనుల కోసం బయటకు వెళ్లే వాళ్లు ఎండ దె బ్బ తగల

‘వానా’వరణం..
కాకినాడలోని ఓ రోడ్డులో నిలిచిపోయిన వర్షం నీరు

కాకినాడ జిల్లాలో భారీ వర్షం

ఉదయం హాట్‌.. హాట్‌..

సాయంత్రం కూల్‌ కూల్‌..

నేలకొరిగిన చెట్లు, నీట మునిగిన వీధులు

తడిసి ముద్దయిన ధాన్యపు రాశులు

(కాకినాడ - ఆంధ్రజ్యోతి)

పగలంతా ఎండవేడిమితో అల్లాడిన కాకినాడ జిల్లా వాసులు శనివారం సాయంత్రం భారీగా కురిసిన వర్షంతో సేదదీరారు. వారం రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకీ ఉష్ణో గ్రతలు పెరుగుతూ 35 డిగ్రీలకు పైబడి నమోదవుతున్నాయి. ఎండదెబ్బకు జనం బయటకు వచ్చేందుకు బెంబేలెత్తిపోతున్నారు. ఉదయం పదిగంటల్లోపే అన్ని పనులు చక్కబెట్టుకుంటున్నారు. ఇక ఆఫీసులకు, వివిధ పనుల కోసం బయటకు వెళ్లే వాళ్లు ఎండ దె బ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాకినాడలో శనివారం ఉదయం 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. జనం ఆపసోపాలు పడ్డా రు. అయితే సాయంత్రం నాలుగు గంటల నుం చి జిల్లా వ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మే ఘావృతమైంది. భారీ ఈదురుగాలులు, ఉరుము లు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. దీం తో పలు చోట్ల వృక్షాలు నేలకొరిగాయి. మరోవైపు అకాల వర్షం అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. కిర్లంపూడి, గండేపల్లి, జగ్గంపేట, పిఠాపురం, గొల్లప్రోలు, ఉప్పాడ, కాకినాడ రూరల్‌ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పిఠాపురంలో వర్షానికి ధాన్యపురాశులు తడిసి ముద్దయ్యాయి. కాకినాడలోని పలు రహదారులు నీటమునిగాయి. పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. కచేరీపేటలో వృక్షం కూలింది. కొత్తపేట మార్కెట్‌ ఏరియా, సినిమారోడ్డు, రాగంపేట, బ్యాంకు పేట, మెయిన్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో భారీగా వర్షపు నీరు నిలిచింది. ఇదిలా ఉంటే కాకినాడలో సాయంత్రం 5 గంట ల నుంచి అంధకారం అలుముకుంది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.

పిఠాపురం, గొల్లప్రోలులో భారీ వర్షం

పిఠాపురం/గొల్లప్రోలు, ఏప్రిల్‌ 5(ఆంధ్ర జ్యోతి): పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాల్లో శనివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. వాతావరణం మేఘావృతమై భారీ గాలులతో సుమారు గంట పాటు కురిసిన వర్షంతో 2 పట్టణాల్లో రహదారులు జలమయమయ్యా యి. ఎక్కడిక్కడ డ్రైన్లు పొంగిపొర్లాయి. పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. చెట్లు కొమ్మలు విరిగి పడటంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. పలుచోట్ల మామిడితోటల్లో మామిడికాయలు రాలిపోయాయి. వా తావరణం చల్లబడటంతో ప్రజలు కాస్తా సేదతీరారు.

రాష్ట్రంలోనే అధికశాతం నమోదు

కిర్లంపూడిలో 46.8 మిల్లీమీటర్ల వర్షపాతం

కిర్లంపూడి, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా కిర్లంపూడిలో శనివారం సాయం త్రం భారీ వర్షం కురిసింది. 46.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోనే అధిక వర్షపాతం కిర్లంపూడిలో నమోదైందన్నారు. గంటపాటు ఎడతెరిపి లేకుండా ఏకధాటిగా వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయ్యాయి. డ్రైనేజీలన్నీ ఉప్పొంగాయి. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మామిడిరైతులు ఆం దోళన చెందుతున్నారు.

Updated Date - Apr 06 , 2025 | 12:36 AM