ఎన్నాళ్లకో...
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:41 AM
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం వర్షాలు దంచికొట్టా యి. ఉన్నట్టుండి ఆకాశం బద్ధలైందా అన్నట్లు కుండపోతకు మిం చిన వానలు కురిశాయి. అప్పటివరకు తీవ్ర వేడితో అల్లాడిన జ నాలకు ఉపశమనం కలిగించాయి. సరిగ్గా మధ్యాహ్నం మూడు న్నర దాటిన తర్వాత జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మా
ఉమ్మడి జిల్లాలో ఉన్నట్టుండి
ఒక్కసారిగా భారీగా దంచికొట్టిన వాన
రాష్ట్రంలోనే కోటనందూరు,
సామర్లకోటలో అత్యధిక వర్షపాతం నమోదు
రాబోయే రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరిక
(కాకినాడ, ఆంధ్రజ్యోతి)
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మంగళవారం వర్షాలు దంచికొట్టా యి. ఉన్నట్టుండి ఆకాశం బద్ధలైందా అన్నట్లు కుండపోతకు మిం చిన వానలు కురిశాయి. అప్పటివరకు తీవ్ర వేడితో అల్లాడిన జ నాలకు ఉపశమనం కలిగించాయి. సరిగ్గా మధ్యాహ్నం మూడు న్నర దాటిన తర్వాత జిల్లాలో ఒక్కసారిగా వాతావరణం మారి పోయింది. అరగంట వ్యవధిలో ఏకంగా ఏడు సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. దీంతో స్వల్ప వ్యవధిలో కురిసిన భారీ వానకు ఎక్కడికక్కడ రహదారులు, లోతట్టు ప్రాంతాలు ముని గిపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కురిసిన భారీవర్షంతో రహదారులు ఏరులయ్యాయి. ముఖ్యంగా అతి తక్కువ వ్యవధిలో కురిసిన భారీ వర్షంతో కాకినాడ జిల్లా కోట నందూరు, సామర్లకోటలో రాష్ట్రంలోనే అత్యధిక వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కోటనందూరులో అతి స్వల్ప సమయంలో ఏకంగా 7.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సామ ర్లకోటలోను అదేస్థాయి లో 7.2సెం.మీ. వర్షపాతం నమోదైంది. జగ్గంపేటలో 5సెం.మీ, గొల్లప్రోలు మం డలం చేబ్రోలులో 4.8, కిర్లం పూడి 4.5, పెద్దాపురం 4.2, యు.కొత్తపల్లి 4, అల్లూరి జిల్లా లోని రాజవొమ్మంగి మండ లంలో 3.9, రౌతులపూడి 3.7, కరప 3.6, పెదపూడి 3.5, కాకినాడ అర్బన్ 2.6, పిఠాపురం 2.4, తాళ్లరేవు 2.2, తుని 1.5చొప్పున నమోదైంది. కోనసీమ జిల్లా ఉప్పలగుప్తంలో 1.4, ముమ్మిడివరం 8.5, ఐ.పోలవరం, అమలాపురం 3.5, అంబాజీపేట, రామచంద్రపురం, అల్లవరం, రాజోలు, మా మిడికుదురులో 1.25 మి.మి., తూ.గో.జిల్లా రంగంపేటలో 4.24మి.మి చొప్పున వర్ష పాతం నమోదైంది. కాగా బంగాళా ఖాతం మధ్య ప్రాంతాల్లో సముద్రమట్టానికి సగటున 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభా వంతో బుధవారం పశ్చిమ మధ్య, దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. దీంతో రాబోయే రెండు రోజులు పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. గంటకు 40నుంచి 50కిలోమీటర్ల వేగంతో ఈదు రుగాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు శనివారం వరకు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ సూచించింది.