భారీ వర్షంతో మునిగిన లోతట్టు ప్రాంతాలు
ABN , Publish Date - May 20 , 2025 | 01:12 AM
మండలం లో సోమవారం ఉదయం భారీ వర్షం కురి సింది. దీంతో ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపుబారిన పడ్డాయి.
భారీ వర్షంతో మునిగిన లోతట్టు ప్రాంతాలు
కె.గంగవరం, మే 19(ఆంధ్రజ్యోతి): మండలం లో సోమవారం ఉదయం భారీ వర్షం కురి సింది. దీంతో ఆయా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు ముంపుబారిన పడ్డాయి. కోటిపల్లి లోని ఛాయాసోమేశ్వరస్వామి ఆలయం వద్దకు వెళ్లే రహదారి వర్షం నీటితో నిండిపోయింది. దీంతో ఆలయానికి వెళ్లే పలువురు భక్తులు ఇబ్బందిపడ్డారు. ముఖ్యంగా వరి పంటను మాసూళ్లు చేసుకున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. యంత్రాలతో కోసిన పంటలో తేమ శాతం తగ్గించి పుంత, కాలువగట్టు లతో పాటు, దిమ్మలపైన రాశులు చేసి ఉంచారు. ఇప్పుడు వాటిని మిల్లులకు తరలించే పనిలో నిమగ్న మవుతున్న సమయంలో ఉదయం వర్షం పడటంతో రైతులు హైరానా పడ్డారు. ధాన్యం రాశులపై బరకాలు, టార్పాలిన్లను కప్పి వాటిని రక్షించు కునే ప్రయత్నం చేశారు. రాశులచుట్టూ నీరు చేరితే ధాన్యం పాడైపోతుందని వాపోతున్నారు. అకాల వర్షం వల్ల మరింత నష్టాలబారిన పడతామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.