అకాల కష్టం!
ABN , Publish Date - May 10 , 2025 | 01:15 AM
అకా లనష్టం.. అన్నదాతను నిండా ముంచేసింది. ఎప్పుడు ఎండ వస్తుందో..ఎప్పుడు వానొస్తుందో తెలియడం లేదు.. శుక్రవారమే ఉదయం నుంచి భానుడు సుర్రు మనిపించాడు..కాసేపటికే మబ్బువేసింది..అంతే నిమి షాల్లో వరుణుడు వచ్చేశాడు..

పెరవలి/ఉండ్రాజవరం,మే 9(ఆంధ్రజ్యోతి): అకా లనష్టం.. అన్నదాతను నిండా ముంచేసింది. ఎప్పుడు ఎండ వస్తుందో..ఎప్పుడు వానొస్తుందో తెలియడం లేదు.. శుక్రవారమే ఉదయం నుంచి భానుడు సుర్రు మనిపించాడు..కాసేపటికే మబ్బువేసింది..అంతే నిమి షాల్లో వరుణుడు వచ్చేశాడు.. పెరవలి, ఉండ్రా జ వరం మండలాల్లో సుమారు గంట న్నర సేపు దంచి కొట్టాడు.దీంతో మురుగు డ్రెయిన్‌లు పొంగి ప్రవహి ంచాయి.రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకే గంటలో సుమా రు మూడు నుంచి నాలుగు దుక్కు లు వర్షం కురి సిందని పలువురు పేర్కొంటు న్నారు. వర్షంతో పాటు ఈదురుగాలులు వీయడంతో చాలా చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. విద్యుత్ స్థంభాలు, ట్రాన్స్‌పార్మర్లు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామాల్లో విద్యు త్ స్థంభాలపై చెట్లు పడిపోవడంతో కొద్దిసేపు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఉండ్రాజవరం నుంచి చివటం వెళ్లే రోడ్డులో కొబ్బరిచెట్టు విద్యుత్ తీగలపై పడింది.ఉండ్రాజవరం, తాడిపర్రు, మోర్త, వెలగదుర్రు గ్రామాల్లో ఈదురు గాలలులకు అరటి చెట్లు పడిపోయాయి. పలు చోట్ల వరిచేలు నేలకొరి గాయి. అక్కడక్కడా అరటి చేలు నేలవాలాయి.