Share News

కరెంటు బిల్లు.. గుండె ఝల్లు...

ABN , Publish Date - Jul 07 , 2025 | 12:35 AM

మలికిపురం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కోన సీమ జిల్లా మలికిపురంలో ఒక షాపింగ్‌ కాంప్లెక్సులో ఉన్న రెడీమేడ్‌ దుస్తుల షాపున కు జూలై నెల కరెంటు బిల్లు రూ.3,38,49

కరెంటు బిల్లు.. గుండె ఝల్లు...
రూ.3,38,496 వచ్చిన బిల్లు

మలికిపురం, జూలై 6 (ఆంధ్రజ్యోతి): కోన సీమ జిల్లా మలికిపురంలో ఒక షాపింగ్‌ కాంప్లెక్సులో ఉన్న రెడీమేడ్‌ దుస్తుల షాపున కు జూలై నెల కరెంటు బిల్లు రూ.3,38,496 వచ్చింది. బిల్లును చూసి షాపులో అద్దెకు ఉంటున్న కె.యువకుమార్‌ ఆశ్చర్యానికి లోనయ్యాడు. వెంటనే విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై తగు చర్యలు తీసుకుంటామని విద్యుత్‌శాఖ అధికారులు తెలిపినట్టు తెలిసింది. గతంలో రూ.1500 నుంచి రూ.2వేల వరకు బిల్లు వచ్చేదని యువకుమార్‌ తెలిపాడు.

Updated Date - Jul 07 , 2025 | 12:35 AM