Share News

చేతి వృత్తులను ప్రోత్సహిస్తాం : ఎంపీ హరీష్‌

ABN , Publish Date - May 08 , 2025 | 12:45 AM

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో చేతివృత్తులు చేసుకునే గ్రామీణ మహిళలను కూటమి ప్రభుత్వం తరపున ప్రోత్సహిస్తామని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌ తెలిపారు.

చేతి వృత్తులను ప్రోత్సహిస్తాం : ఎంపీ హరీష్‌

అంతర్వేది, మే 7(ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో చేతివృత్తులు చేసుకునే గ్రామీణ మహిళలను కూటమి ప్రభుత్వం తరపున ప్రోత్సహిస్తామని అమలాపురం ఎంపీ గంటి హరీష్‌మాధుర్‌ తెలిపారు. సఖినేటిపల్లిలో ఏర్పాటుచేసిన ఒక జూట్‌ బ్యాగ్‌ స్టాల్‌ను ఆయన బుధవారం సందర్శించారు. చేతివృత్తులతో తయారు చేస్తున్న ఉత్పత్తులను దేశవాళీ మార్కెట్‌లో డిమాండ్‌ ఏర్పడేలా కృషి చేస్తానని ఎంపీ అన్నారు. ప్రతీ మహిళ ఇంటి వద్దనే ఉండి ఆర్థిక పురోభివృద్ధి సాధించడంతో పాటు ఇతరులకు ఉపాధి కలిగించేలా ఆలోచించి చేతివత్తులు చేయడం అభినందనీయమన్నారు. తూర్పుపాలేనికి చెందిన తోట ఉమామహేశ్వరి వద్ద కొన్ని జూట్‌ బ్యాగులను కొనుగోలు చేశారు. ప్రతీ మహిళ మన కోనసీమ జిల్లా నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లి చేతివృత్తులతో ఉత్పత్తులను తయారుచేసి దేశవ్యాప్త మార్కెట్‌ను అందుకునేలా వారిని ప్రోత్సాహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ముప్పర్తి నాని, తాడి సత్యనారాయణ, చాగంటి స్వామి, కడలి వెంకటరత్నం, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.

Updated Date - May 08 , 2025 | 12:45 AM