Share News

‘నై’వోదయం

ABN , Publish Date - Jul 21 , 2025 | 12:56 AM

గోకవరం మండలంలోని పలు గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బహి రంగంగానే అమ్మకాలు సాగుతున్నా పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు దృష్టి సారించడం లేదని మండల వాసులు విమర్శిస్తున్నారు. సారా త యారీదారుల్లో చైతన్యం నింపి తయారీ, విక్ర యాలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం నవోదయం 2.0 పేరిట కార్యక్రమాలను చేపట్టి నా ఇక్కడి అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఫలితం కానరావడం లేదు.

‘నై’వోదయం
గోకవరం మండలం ఇటికాయిలపల్లిలో సారా బట్టీ

  • గోకవరంలో ఆగని సారా తయారీ, విక్రయాలు

  • యథేచ్ఛగా సారా బట్టీల నిర్వహణ

  • వెదురుపాకలో యువకులే నిర్వాహకులు

  • రోజూ 4 వేల లీటర్ల పైబడి తయారీ

  • కన్నెత్తి చూడని ఎక్సైజ్‌, పోలీసులు

గోకవరం, జూలై 20(ఆంధ్రజ్యోతి): గోకవరం మండలంలోని పలు గ్రామాల్లో సారా తయారీ, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బహి రంగంగానే అమ్మకాలు సాగుతున్నా పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు దృష్టి సారించడం లేదని మండల వాసులు విమర్శిస్తున్నారు. సారా త యారీదారుల్లో చైతన్యం నింపి తయారీ, విక్ర యాలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం నవోదయం 2.0 పేరిట కార్యక్రమాలను చేపట్టి నా ఇక్కడి అధికారుల నిర్లక్ష్య ధోరణితో ఫలితం కానరావడం లేదు. మండలంలోని కొన్ని గ్రామాల్లో సారా తయారీ కుటీర పరిశ్రమగా తయారైంది. వ్యాపారం మూడు సీసాలు, ఆరు ప్యాకెట్లుగా సాగుతోంది.

  • ఆ గ్రామాల్లో జోరు

మండలంలోని వెదురుపాక, మల్లవరం, ఇటి కాయిలపల్లి, రంపయర్రంపాలెం, తిరుమలాయ పాలెం గ్రామాల్లో సారా బట్టీలు ఎక్కువుగా ఉన్నాయి. వెదురుపాకలో సారా విక్రయాలు రాత్రింబవళ్లు జరుగుతున్నా అధికారులు పట్టిం చుకోవడం లేదనే విమర్శలున్నాయి. నీటి నిల్వ లు పుష్కలంగా ఉండే మామిడి తోటల్లోను, కొం డ ప్రాంతాల వద్ద భారీ ఎత్తున బట్టీలు నిర్వ హిస్తున్నారని పలువురు అంటున్నారు. కొందరు యువకులే తయారీ, విక్రయాలు నిర్వహిస్తుండడం గమనార్హం. ఇక్కడ కొన్నేళ్లుగా తయారీతో పాటు, విక్రయాలు జోరుగా సాగుతున్నా అధి కారులు ఆ గ్రామం వైపు కన్నెత్తి చూడరనే ఆరోపణలు ఉన్నాయి. ప్రతి రోజూ ఈ ఒక్క గ్రామం నుంచే నాలుగైదు వేల లీటర్ల సారా తయారీ జరుగుతున్నట్టు సమాచారం. ఇక్కడ నుంచే గోకవరం, కోరుకొండ, గండేపల్లి మండ లాల్లోని పలు గ్రామాలకు రవాణా జరుగుతుం ది. ఇటీవల ఇటికాయిలపల్లి, రంపయర్రంపాలెం గ్రామాల్లో సారా బట్టీలపై స్థానిక పోలీసులు దాడి చేసి సుమారు 50లీటర్ల సారాను స్వాధీ నం చేసుకుని 1000 లీటర్లకు పైగా బెల్లపు ఊ టను ఽధ్వంసం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికా రులు స్పందించి మండలంలో సారా తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Updated Date - Jul 21 , 2025 | 12:56 AM