Share News

అన్నీ ఏకపక్షమే..

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:36 AM

కార్పొరేషన్‌ (కాకినాడ), ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో జరుగుతోన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 15వ హాకీ ఇండియా జూనియర్‌ మహిళ జాతీయ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం నాల్గోరోజు మ్యాచ్‌లన్నీ ఏకపక్షంగా నే జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ వైడీ రామారా

అన్నీ ఏకపక్షమే..
మ్యాచ్‌ ఆడుతున్న ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌ జట్ల సభ్యులు

కాకినాడలో నాల్గో రోజు జాతీయ మహిళా జూనియర్‌ హాకీ పోటీలు

కార్పొరేషన్‌ (కాకినాడ), ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో జరుగుతోన్న ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ 15వ హాకీ ఇండియా జూనియర్‌ మహిళ జాతీయ చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం నాల్గోరోజు మ్యాచ్‌లన్నీ ఏకపక్షంగా నే జరిగాయి. ముఖ్య అతిథులుగా హాజరైన రెడ్‌క్రాస్‌ రాష్ట్ర చైర్మన్‌ వైడీ రామారావు, కాకినాడ అపోలో ఆసుపత్రి ప్రతినిధులు మ్యాచ్‌లను ప్రా రంభించారు. కాకినాడ క్రీడా మైదానంలోని ఆస్ట్రో టర్ఫ్‌ హాకీ ఫీల్డ్‌లో 6 మ్యాచ్‌లు జరిగాయి. దాద్రానగర్‌ హవేలి- జమ్మూ కాశ్మీర్‌ జట్ల మధ్య మ్యాచ్‌లో దాద్రానగర్‌ హవేలీ 6-0తో విజయం సాధించింది. గుజరాత్‌, రాజస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌లో గుజరాత్‌ 3-2తో విజయం సాఽదించింది. మిజోరాం, తెలంగాణ మధ్య మ్యాచ్‌లో మిజోరం 15-0 తో విజయం సాఽదించింది. మణిపూర్‌, పు దుచ్చేరి మధ్య మ్యాచ్‌లో మణిపూర్‌ 9-1తో.. అస్సాం, కేరళ మ్యాచ్‌లో అస్సాం 5-1తో.. ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌ మధ్య మ్యా చ్‌లో ఢిల్లీ 7-1 తేడాతో విజయం సాధించా యి. మ్యాచ్‌లను కాకినాడ జిల్లా క్రీడాభివృద్ధి అధికారి బి.శ్రీనివాసకుమార్‌, హాకీ ఆంధ్ర సంయుక్త కార్యదర్శి వి.రవిరాజు పర్యవేక్షించారు.

Updated Date - Aug 05 , 2025 | 12:36 AM