కాకినాడలో మూడో రోజు జాతీయ మహిళా జూనియర్ హాకీ పోటీలు
ABN , Publish Date - Aug 04 , 2025 | 12:15 AM
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో జరుగుతున్న ఇండియన్ ఆయిల్ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళ జాతీయ చాంపియ
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): కాకినాడలో జరుగుతున్న ఇండియన్ ఆయిల్ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళ జాతీయ చాంపియన్ షిప్-2025లో భాగంగా ఆదివారం మూడోరోజు రెండు మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. మ్యాచ్‌ల ఫలితం తేలక డ్రాగానే ముగిశాయి. ఇరు జట్లు గోల్స్ చేయడానికి పోటీపడ్డాయి. దీంతో ఉత్కంఠగా మ్యాచ్‌లు సాగాయి.
మ్యాచ్‌ల వివరాలు...
కాకినాడ క్రీడా మైదానంలోని ఆస్ట్రోటర్స్ హాకీ ఫీల్డ్ లోని రెండు మ్యాచ్‌లు జరిగాయి. ఉత్తరాఖండ్ వర్సెస్ అస్సాం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 2-2 స్కోరు నమోదు చేయడంతో డ్రాగా ముగిసింది. బీహార్ వర్సెస్ తమిళనాడు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో 2-2 స్కోరు నమోదు చేయడంతో డ్రాగా ముగిసింది. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సీఈవో హెడ్ ఆఫ్ ఫైనాన్స్ డి.రమణమూర్తి, కేంద్ర మంత్రిత్వ హైవే ఇండస్ట్రీస్ డైరెక్టర్ జీ.సత్తిబాబు ముఖ్య అతిథులుగా హాజరై మ్యాచ్‌లను వీక్షించారు. డీఎస్డీవో బి.శ్రీనివాస్ తదితరులు మ్యాచ్‌లను పర్యవేక్షించారు.