జార్ఖండ్ జయకేతనం
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:36 AM
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కాకినాడలో 12రోజులపాటు జరిగిన జాతీ య హాకీ జూనియర్ మహిళల చాంపియన్‌షిప్ ముగిసింది. జార్ఖండ్- హర్యానా జట్ల మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా జరగ్గా జార్ఖండ్ విజేతగా నిలిచింది. విజేత జట్టుకు ట్రోఫీ బహూకరించారు. కాకినాడ జిల్లా క్రీడాప్రాధికార సం
కాకినాడలో ముగిసిన జాతీయ హాకీ
జూనియర్ మహిళల చాంపియన్‌షిప్
హోరాహోరీగా ఫైనల్ పోరు
విన్నర్‌గా జార్ఖండ్, రన్నర్‌గా హర్యానా జట్లు
కార్పొరేషన్ (కాకినాడ), ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): కాకినాడలో 12రోజులపాటు జరిగిన జాతీ య హాకీ జూనియర్ మహిళల చాంపియన్‌షిప్ ముగిసింది. జార్ఖండ్- హర్యానా జట్ల మధ్య ఫైనల్ పోరు హోరాహోరీగా జరగ్గా జార్ఖండ్ విజేతగా నిలిచింది. విజేత జట్టుకు ట్రోఫీ బహూకరించారు. కాకినాడ జిల్లా క్రీడాప్రాధికార సంస్థ మైదానం వేదికగా ఆస్ట్రో హాకీ ఫీల్డ్‌లో ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన ఇండియన్ ఆయిల్ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ చాంపియన్‌షిప్-2025 మంగళవారంతో ముగిసింది. దేశావ్యాప్తంగా 30 జట్లు పాల్గొన్న ఈ హాకీ టోర్నీ ఆది నుంచి హోరాహోరాగా సాగింది. మంగళవా రం సాయంత్రం జరిగిన ఫైనల్ మ్యా చ్‌లో జార్ఖండ్, హర్యానా జట్లు తలపడ్డా యి. ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముఖ్య అతిథు లుగా జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్, ఎస్పీ బిందుమాధవ్, జోనల్ ఆర్మీ రిక్రూట్‌మెంట్ అధికారి బ్రిగేడియర్ రాకేష్‌శర్మ ఆవాస్తి, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ట్రైనీ కలెక్టర్ మానిషా హాజరై వీక్షించారు. మ్యాచ్‌లో జార్ఖండ్ 2-1 తేడాతో హర్యానాపై విజయం సాధించింది. అంతకుముందు మూడోస్థానం కోసం ఉత్తరప్రదేశ్ వర్సెస్ చత్తీస్‌గఢ్ జట్లు తలపడ్డాయి. 2-0తో ఉత్తరప్రదేశ్ మూడోస్థానంలో నిలిచింది.
విజేతలకు బహుమతుల ప్రదానం
పోటీల అనంతరం విజేతలకు బహుమతుల ప్రదానోత్సవం జరిగింది. చాంపియన్‌షిప్-2025 టోర్నమెంట్‌లో భాగంగా విజేతగా నిలిచిన జార్ఖండ్, రెండోస్థానంలో నిలిచిన హర్యానా, మూడోస్థానంలో నిలిచిన ఉత్తరప్రదేశ్ జట్లకు మెడల్స్, ట్రోఫీలను ము ఖ్యఅతిథులు ప్రదానం చేశారు. హాకీ టోర్నీ ముగింపు వేడుకలను పురస్కరించుకుని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ మాట్లాడుతూ 15వ హాకీ ఇండియా జూనియర్ మహిళల జాతీయ ఛాంపియన్‌షిప్-2025 టోర్నీ కాకినాడలో ఘనంగా నిర్వహించుకున్నామన్నారు. 2వారాలుగా హాకీ మ్యాచ్‌లు సక్రమంగా జరగడానికి సహకరించిన స్పా న్సర్స్‌కు.. ప్రాముఖ్యం గా క్రీడాకారులకు భోజనం, వసతి, భద్రత, రవా ణా వంటి ఏర్పాట్లను పర్యవేక్షించిన అధికారులకు అభినందనలు తెలిపారు. జిల్లా క్రీడా అభివృద్ధి అధికారి బి.శ్రీనివాస్‌కుమార్, హాకీ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీ, కోచ్ వి.రవిరాజును ప్రత్యేకంగా అభినందించారు. జార్ఖండ్ జట్టు సభ్యులందరికీ కాకినాడ జిల్లా ప్రత్యేకతను తెలిపి చేనేత కార్మికులు, చేనేత వస్త్రాలను ప్రో త్సహించే ఉద్దేశంతో పెద్దాపురం సిల్క్ శారీలను బహుమతులుగా అందజేశారు. ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల నుంచి ఉత్సాహంగా టోర్నమెంట్‌ల్లో పాల్గొని ఉత్తమ నైపుణ్యాలను ప్రదర్శించారన్నారు. ఎస్పీ జి.బిందుమాధవ్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు, ఓటములు సాధారణమని, పోరాట స్ఫూర్తితో పాల్గొనడమే ముఖ్యమన్నారు. జేసీ రాహుల్ మీనా మాట్లాడుతూ క్రీడాకారులు అంతర్జాతీయ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలని కో రారు. కార్యక్రమంలో పిఠాపురం జనసేన ఇన్‌చార్జి మర్రెడ్డి శ్రీనివాసు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సీసీఎం జుబ్బ్స్ గార్గ్, కేఎస్పీఎల్ సీఈవో మురళీధర్, కోరమండల్ కాకినాడ యూనిట్ హెడ్ కె.జగన్నాథం, ఏఎం గ్రీన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏఎస్ నాయుడు, అరబిందో జీఎం సీఎస్‌ఆర్ డి.సుధాకర్ హకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఎం.నిరంజన్‌రెడ్డి, అధ్యక్షుడు బి.చాణిక్యరాజు పాల్గొన్నారు.