Share News

మన్యంలో మళ్లీ తుపాకీల మోత!

ABN , Publish Date - Jun 19 , 2025 | 01:37 AM

కొన్నేళ్లుగా మావోయిస్టు రహిత ప్రాంతంగా ఉన్న రంపచోడవరం మన్యం తుపాకీల మోతతో మళ్లీ దద్దరిల్లుతోంది. పాపికొండల అభ యారణ్యంలోని మారేడుమిల్లి-దేవీపట్నం మం డలాల సరిహద్దుగా ఉన్న రంపచోడవరం మండలం కింటుకూరు అటవీ ప్రాంత కొండ లపై బుధవారం జరిగిన ఎనకౌంటర్‌తో మ న్యం ఉలిక్కిపడింది.

మన్యంలో మళ్లీ తుపాకీల మోత!

దశాబ్దకాలంగా ప్రశాంతం

వేటాడుతున్న బలగాలు

కూంబింగ్‌తో జల్లెడ

కొద్దిరోజుల్లోనే రెండు ఎన్‌కౌంటర్లు

గత నెల వై.రామవరంలో.. ఇప్పుడు కింటుకూరు

మన్యం గిరిజనుల్లో అలజడి

(రంపచోడవరం-ఆంధ్రజ్యోతి)

కొన్నేళ్లుగా మావోయిస్టు రహిత ప్రాంతంగా ఉన్న రంపచోడవరం మన్యం తుపాకీల మోతతో మళ్లీ దద్దరిల్లుతోంది. పాపికొండల అభ యారణ్యంలోని మారేడుమిల్లి-దేవీపట్నం మం డలాల సరిహద్దుగా ఉన్న రంపచోడవరం మండలం కింటుకూరు అటవీ ప్రాంత కొండ లపై బుధవారం జరిగిన ఎనకౌంటర్‌తో మ న్యం ఉలిక్కిపడింది. వరుస ఘటనలు, మావో యిస్టు నేతల కదలికల నేపథ్యంలో రంప మన్యాన్ని మళ్లీ మావోయిస్టుల ప్రభావిత ప్రాంతంగా ప్రభుత్వాలు భావిస్తున్నాయి. మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తెలుగు రాషా్ట్రలు, సరిహద్దు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాషా్ట్రలలో సాగిస్తున్న వేట ప్రభావంతో కీలక మావోయిస్టు నేతలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లే క్రమంలో ప్రత్యేక పోలీసు బలగాలకు చిక్కి హతమవుతున్నారు. సుమారు ఒక దశాబ్దకాలం గా రంపచోడవరం మన్యంలో మావోయిస్టుల ఎన్‌ కౌంటర్లకు సంబంధించి చెప్పుకోదగ్గ ఘటనలు లేవు. మావోయిస్టులు సైతం రంపచోడవరం మ న్యంలో కదలికలు లేనట్టుగానే వ్యవహరించారు. రంప మన్యంలో మావోయిస్టుల ప్రభావం పూర్తి గా లేదని కూడా భావించారు. రంప మన్యానికి సరిహద్దులో ఉన్న ఛత్తీస్‌ఘడ్‌, ఒడిశా ప్రాంతాల్లో అనేక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ వాటి ప్రభావం ఇంతవరకూ రంప మన్యంపై పడిన సందర్భాలు లేవు. ఇంచుమించుగా పాపికొండల అభయారణ్య ప్రాంతంలో మావోయిస్టుల ఉనికే లేదని భావిస్తున్న తరుణంలో ఎన్‌కౌంటర్‌ జరగడం మన్యంవాసులను ఆందోళనకు గురిచేసింది. సరిహద్దు రాషా్ట్రల్లో మావోయిస్టు ఏరివేత ఆపరేషన్‌ నేపథ్యంలో ముఖ్యమైన కీలక మావోయిస్టు నేతలను ఇక్కడికి తరలించి కాపాడుకునే క్రమంలో వారి కదలికలు తెలుస్తున్నాయని, తద్వారా వారి కదలికలపై అందుతున్న నిఘా సమాచారం పోలీసులకు చేరి ఈ ప్రాంతంలో కూంబింగ్‌ ము మ్మరం చేశారని కొద్దిరోజులుగా వినిపిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మారేడుమిల్లి మండలం గు డిసె పర్యాటక ప్రాంతంలో మావోయిస్టులు పెద్ద ఎత్తున సంచరించిన ఆధారాలు సేకరించిన పోలీ సులు సదరు సంచారంపై కేసు నమోదు చేసి వారికి ఆశ్రయం ఇచ్చిన వారిని సైతం జైలుకు పంపారు. అనంతరం పలు ప్రాంతాల్లో మావో యిస్టుల కదలికలను గుర్తించిన పోలీసులు వారి కోసం గాలింపును ముమ్మరం చేస్తూనే వారి కద లికలపై నిఘాను పెంచి ఖచ్చితమైన సమాచా రాన్ని తెలుసుకుని అక్కడికి చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే మే 8వ తేదీన వై.రామవరం మండలం శేషరాయి ప్రాంతంలో మావోయిస్టుల కదలికలను గుర్తించిన గ్రేహౌండ్స్‌ బలగాలు జరిపిన కూంబింగ్‌లో మావోయిస్టులు సాగించిన ఎదురు కాల్పులకు ప్రతిగా జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైన విషయం తెలిసిందే. వారిలో కీలక నేతలు కాకూరి పండన్న అలియాస్‌ జగన్‌, రమేష్‌ ఉండడంతో మావోయిస్టు పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఈ ఘటనలో మరికొందరు మా వోయిస్టు నేతలకూ గాయాలై ఉండవచ్చని భా వించారు. శేషరాయి ఘటన జరిగి నెల రోజు లకే రంపచోడవరం మండలం పాపికొండల అభయారణ్యం పరిధిలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం నాడు మావోయిస్టుల కదలికలను గుర్తించి ముగ్గురు మావోయిస్టులను గ్రేహౌండ్స్‌ బలగాలు మట్టుపెట్టాయి. ఈ ప్రాంతానికి మావోయిస్టులు చేరుకున్నారన్న పక్కా సమాచారంతోనే గ్రేహౌండ్స్‌ బలగాలు అడవిని మంగళవారం సాయంత్రం నుంచే చుట్టుముట్టాయి. మన్యంలో జరిగిన రెండు ఎన్‌కౌంటర్ల ద్వారా మావోయిస్టు పార్టీలోని కీలక నేతలు బలికావడం మావోయిస్టులకు పెద్ద దెబ్బగానే పోలీసులు అభివర్ణిస్తున్నారు.

ఎలా వచ్చారు? ఎలా చిక్కారు?

- శేషరాయిలోనూ, ఛత్తీస్‌గడ్‌లోనూ తప్పించుకున్న వారేనా?

- ఆధునిక టెక్నాలజీ, డ్రోన నిఘాలతో మావోయిస్టు కదలికలపై పోలీసులదే పైచేయి

రంప మన్యంలో మునుపెన్నడూ మావో యిస్టు కదలికలు లేని ప్రాంతంలో బుధవారం జరిగిన ఎనకౌంటర్లో మృతి చెందిన ఇద్దరు మావోయిస్టులు కీలక నేతలు, మరో రాష్ట్ర కమి టీ సభ్యురాలు ఇక్కడకు ఎలా వచ్చారు, గ్రేహౌండ్స్‌ ఆపరేషన్సకు ఎలా చిక్కారన్న ప్రశ్నలు పోలీసు అధికారుల సమాధానం కోసం ఎదురుచూస్తున్నాయి. గతంలో సైతం వై.రామ వరం, మారేడుమిల్లి, అడ్డతీగల, రాజఒమ్మంగి మండలాల్లో మావోయిస్టుల కదలికలు ఎక్కు వగా ఉండేవి. అయితే ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా ప్రాం తాల్లో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులు మావోయిస్టు కీలక నేతలను సురక్షితంగా రక్షిం చుకునే సురక్షిత ప్రాంతాలు మావోయిస్టులకు అవసరమయ్యాయి. అటు పోలీసులు సైతం ఆధునిక సాంకేతికపరిజ్ఞానం, సెల్‌ఫోన్ల తరంగా లను అనుసంధానించుకుంటూ మావో యిస్టుల కదలికలను గుర్తించడంలో డ్రోన్ల సాయాన్ని వాడుకుంటున్నారు. ఈక్రమంలో ఎదురుదెబ్బ లు తింటూ తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితుల్లో సురక్షితప్రాంతాల కోసం అన్వేషిస్తూ గతంలో ఎప్పుడూ కదలికలు లేని ప్రాం తాలను సైతం ఎంచుకుని కీలకనేతలను అక్కడకు పంపుతు న్నారన్న సమాచారాన్ని పోలీసులు తెలుసుకుం టున్నారు. బుధవారం నాటి ఎనకౌంటర్లో మృతి చెందినవారు..మేలో వై.రామవరం మండలంలో జరిగిన ఎనకౌంట ర్లోనూ, ఛత్తీస్‌గఢ్‌లో నంబళ్ల కేశవరావు ఎనకౌం టర్లోనూ తప్పించుకున్నవారే అయి ఉండవచ్చు నన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే పలుసురక్షిత ప్రాంతాలకు తరలించబడిన వారి సమాచారం ఆధారాలతో సహా బయటపడి ఇలా పోలీసు తూటాలకు చిక్కుకుంటున్నారా వంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రతి ఎనకౌం టర్‌ అనంతరం ఉత్పన్నమయ్యే ఇలాంటి ప్రశ్నలన్నిటికీ పోలీసువర్గాలే స్పష్టమైన వివరణ ఇస్తూ ఉంటారు. కానీ బుధవారం రాత్రి వరకూ పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటననూ ఇక్కడి మీడియాకు విడుదల చేయలేదు. మావోయిస్టుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి సురక్షితంగా తరలించడం మినహా ఎటువంటి సమాచారాన్ని మీడియాకు ఇవ్వలేని పరిస్థితి బుధవారం రాత్రివరకూ సాగింది. రంపచోడవ రం డీఎస్పీ సైతం విశాఖలో ప్రధాని పర్యటన బందోబస్తు బాధ్యతల్లో ఉండగా,ఈ ఎనకౌంటర్‌ అనంతరం జిల్లా ఎస్పీ చొరవతో రంపచోడవరం చేరుకోవడానికి రాత్రి పొద్దుపోయింది. దీంతో ఎటువంటి అధికారిక సమాచారాన్ని ఇక్కడి దిగువస్థాయి అధికారులు వెల్లడించలేదు. జిల్లా ఎస్పీ అమితబర్దన గురువారం స్వయంగా వెల్లడించనున్నారని మాత్రం ఇక్కడి పోలీసు అధికారులు మీడియాకు వెల్లడించారు.

Updated Date - Jun 19 , 2025 | 01:37 AM