Share News

మెడిసన తగ్గలే...

ABN , Publish Date - Sep 25 , 2025 | 01:28 AM

జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరాలన్నదే కేంద్ర ప్రభుత్వ అభిమతం. కానీ ఆ ప్రయోజనం ఇప్పటిదాకా లక్ష్యాన్ని చేరలేదు. మార్కెట్‌లో వేలాది రకాల వస్తువుల ధరలపై జీఎస్టీ తగ్గింపు వర్తించింది. సోమవారం నుంచి రెండు శ్లాబుల జీఎస్టీ అమలులోకి వచ్చింది. దాంతో ఈ విధానంలో ప్రకటించిన వస్తువుల ధరలన్నీ తగ్గిపోవాలి. కానీ ఆ పరిస్థితి ఏవో కొన్ని వస్తువులు మినహా పెద్దగా ఆ ప్రభావం కనిపించలేదు. అంతెందుకు రోజూ కొనుగోలు చేసే కొన్ని కంపెనీల పాల ప్యాకెట్‌ ధర కూడా ఇప్పటివరకు తగ్గలేదు. ఇక వైద్యానికి సంబంధించి అత్యవసర మందులు, వస్తువులపై కొత్త జీఎస్టీలో తగ్గింపులు ఉన్నాయి. కానీ ఆ తగ్గింపేమీ కనిపించడం లేదు. పాత ఎమ్మార్పీవి అంటూ మెడికల్‌ షాపుల వారు దోపీడీ చేసేస్తున్నారు.

మెడిసన తగ్గలే...

జీఎస్టీ తగ్గింపులో మందుల్లో మతలబు

పాత ఎంఆర్పీలంటూ దోపిడీ

అత్యవసర మందులపైనా మోసం

ఉమ్మడి తూర్పులో 3 వేల మెడికల్‌ షాపులు

అవగాహన లేమితో రూ.కోట్లలో ప్రజలకు నష్టం

మూమూళ్ల మత్తులో డ్రగ్స్‌.. పట్టించుకోని వాణిజ్యం

జీఎస్టీ తగ్గింపు ప్రయోజనం నేరుగా ప్రజలకు చేరాలన్నదే కేంద్ర ప్రభుత్వ అభిమతం. కానీ ఆ ప్రయోజనం ఇప్పటిదాకా లక్ష్యాన్ని చేరలేదు. మార్కెట్‌లో వేలాది రకాల వస్తువుల ధరలపై జీఎస్టీ తగ్గింపు వర్తించింది. సోమవారం నుంచి రెండు శ్లాబుల జీఎస్టీ అమలులోకి వచ్చింది. దాంతో ఈ విధానంలో ప్రకటించిన వస్తువుల ధరలన్నీ తగ్గిపోవాలి. కానీ ఆ పరిస్థితి ఏవో కొన్ని వస్తువులు మినహా పెద్దగా ఆ ప్రభావం కనిపించలేదు. అంతెందుకు రోజూ కొనుగోలు చేసే కొన్ని కంపెనీల పాల ప్యాకెట్‌ ధర కూడా ఇప్పటివరకు తగ్గలేదు. ఇక వైద్యానికి సంబంధించి అత్యవసర మందులు, వస్తువులపై కొత్త జీఎస్టీలో తగ్గింపులు ఉన్నాయి. కానీ ఆ తగ్గింపేమీ కనిపించడం లేదు. పాత ఎమ్మార్పీవి అంటూ మెడికల్‌ షాపుల వారు దోపీడీ చేసేస్తున్నారు.

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

మందుల ఖర్చు చూసి ఇవాళ రోగం మరింత ముదిరిపోతోంది. ఓవైపు అధిక శాతం డాక్టర్లు మందులతో చీటీలను పూర్తిగా నింపే స్తుంటే.. మరోవైపు మందుల దుకాణాల వాళ్లు ఎడాపెడా దోచేస్తు న్నారు. చాలా ఆస్పత్రుల్లో సొంత మెడికల్‌ షాపులు ఉండడంతో ఇదో అదనపు వ్యాపారంగా మారిపోయింది. బయట షాపుల్లో ఎం ఆర్పీపై ఏకంగా 20 శాతం వరకూ తగ్గింపు ఇస్తామంటూ వ్యాపా రస్తులు పోటీ పడుతూ ఉంటారు. ఆస్పత్రుల్లోని మెడికల్‌ షాపుల్లో ఆ రాయితీ వర్తించదు. పైగా మందుల ధర వాస్తవంగా ఎంతో వాటిపై ఉండదు. ఎంఆర్పీ మాత్రమే ఉంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మందులపై జీఎస్టీని గణనీయంగా తగ్గించింది. అత్య వసర మందులపై పన్ను ఎత్తేసింది. కానీ ప్రజలకు మాత్రం ఆ మేరకు జేబుకు ఆదా కనబడడం లేదు. అధిక శాతం దుకాణాల్లో బిల్లులు కూడా ఇవ్వకపోవడంతో జీఎస్టీ తగ్గింపు తెలియడం లేదు.

ఇలా దోపిడీ...

ఓ వ్యక్తి రాజమహేంద్రవరంలోని హైటెక్‌ బస్టాండు సమీపంలో ఓ పెద్ద మందుల షాపునకు వెళ్లి 10 ట్యాబ్లెట్ల సి్ట్రప్‌ కొన్నాడు. దానిపై రూ.335 ఎంఆర్పీ ధర ఉంది. తమ వద్ద ప్రత్యేక రాయితీ అంటూ రూ.284 తీసుకున్నారు. వినియోగదారుడు సంతోషించి.. బిల్లు అడిగాడు. దీంతో రూ.266కి బిల్లు ఇచ్చారు. అదేంటని ప్రశ్ని స్తే జీఎస్టీ తగ్గింపని సెలవిచ్చారు. ఒకవేళ బిల్లు తీసుకోకపోతే నష్టపోయేవాడే కదా. మరో వ్యక్తి హార్లిక్స్‌ కొన్నాడు. దాని ఎం ఆర్పీపై 7శాతం తగ్గించారు. అది తమ షాపులో మాత్రమే ఇచ్చే తగ్గింపని చెప్పాడు. జీఎస్టీ తగ్గింపుపై ప్రశ్నించగా.. ఆ స్టాకు పాత ఎంఆర్పీతో ఉందని జీఎస్టీ తగ్గింపు రాదని సెలవిచ్చాడు. ఇది కేవ లం ఆ ఇద్దరికి జరిగిన తంతు మాత్రమే కాదు. నూటికి 99శాతం మందికి మందులపై జీఎస్టీ ఆదా చేకూరడం లేదు. వందల రకా ల మందులు ఉండడంతో బోర్డులు పెట్టడం సాధ్యం కాదనుకు న్నా.. కనీసం బిల్లులు పక్కాగా ఇస్తూ, వాటిలో జీఎస్టీ తగ్గింపును స్పష్టంగా పేర్కొంటే వినియోగదారుడికి సొమ్ము ఆదా అవుతుంది.

అంతా అయోమయం

చాలా మందుల షాపుల్లో బిల్లులు ఇవ్వడం లేదు. దీంతో జీఎస్టీ తగ్గింపు వర్తింపు అయోమయంగా మారింది. బిల్లులు ఇవ్వకపోవ డంపై వాణిజ్య పన్నుల శాఖ పట్టించుకున్న దాఖలాలు లేవనే చెప్పవచ్చు. దీంతో తాము కొన్న మందులకు ఇటీవల తగ్గించిన జీఎస్టీ వర్తించిందో లేదో వినియోగదారుడికి తెలియడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 వేల వరకూ మందుల షాపు లుండగా.. 150 వరకూ పెద్ద దుకాణాలు ఉన్నాయి. ఈ పెద్ద దుకాణాల్లో బిల్లులు ఇస్తున్నా జీఎస్టీ తగ్గింపు చూపించడం లేదు. అత్యవసర, క్యాన్సర్‌ మందులపై జీఎస్టీ గతంలో 5ు నుంచి 12ు వరకూ ఉండేది. దానిని పూర్తిగా తీసేశారు. జనానికి అత్యవసర మందులపై అవగాహన ఉండదు. వైద్యుడు ఇచ్చిన చీటీ ప్రకారం మందులు తెచ్చుకుంటారు. అత్యవసర మందులతోపాటు సాధార ణ మందులను ఒకే చీటీలో రాస్తారు. దీంతో సందట్లో సడేమియా మాదిరిగా అత్యవసర మందులకు జీఎస్టీ తగ్గింపు ఇవ్వడం లేదు. ఉదాహరణకు అత్యవసర మందుల ధర రూ.5 వేలు అనుకొంటే గతంలో రూ.250-600 వరకూ జీఎస్టీ ఉండేది. ఇప్పుడు పూర్తిగా మినహాయించడంతో ఆ మేరకు తగ్గించాల్సి ఉంది. కానీ ఆ లాభం వినియోగదారుడికి అందడం లేదు. గ్లూకోమీటర్‌, టెస్ట్‌ సి్ట్రప్‌లు, థర్మా మీటర్లు, డయాగ్నస్టిక్‌ రసాయనాలు/కిట్లు, ఇతర మందులపై జీఎస్టీ ని 18/12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. కానీ వాటిపై ఆ తగ్గింపును వర్తింపజేయడం లేదు. ఉమ్మడి తూర్పుగోదావరిలోని రా జమహేంద్రవరం, కాకినాడ మెడికల్‌ హబ్‌లుగా కొనసాగుతున్నాయి. దీంతో రోజుకు కోట్లాది రూపాయల మెడిసిన ఇతర వైద్య పరికరాలు /వస్తువుల అమ్మకాలు జరుగుతాయి. ఇప్పుడు జీఎస్టీ తగ్గింపు విని యోగదారుడికి చేరకపోవడంతో కేంద్రం ఉద్దేశం నిర్వీర్యమవుతోంది. ఇప్పటికైనా డ్రగ్స్‌ శాఖ మత్తు వీడితే ప్రజలకు మేలు జరుగుతుంది. వాణిజ్య పన్నుల శాఖ దృష్టి సారిస్తే బిల్లులు మేల్కొంటాయి.

ఇదో మాయాజాలం

సొంతంగా ఆస్పత్రుల్లోనే మెడికల్‌ షాపులు ఉండడంతో చాలామంది ప్రిస్ర్కిప్షన నిండిపోయే వరకూ మందులు రాసేస్తున్నారు. బయట మెడికల్‌ షాపుల్లో ఇచ్చే రాయితీ కూడా వీళ్లు ఇవ్వడం లేదు. అంటే మందులపై ఎంత లాభం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దీని వెనుక మరో ఆశ్చర్యపోయే మాయ దాగి ఉంది. గతంలో మందుల తయారీ కంపెనీలు రిప్రజెంటెటీవ్స్‌ని నియమించుకొని వాళ్లను డాక్టరు వద్దకు పంపించి ప్రొడక్టును ప్రచారం చేసుకోవడం జరిగేది. దీని ని ఎథికల్‌ మార్కెటింగ్‌ అనేవాళ్లు. హరియాణా, గుజరాతలోని పలు మూరుమూల ప్రాంతాల్లో మందుల తయారీ కంపెనీలు కోకొల్లలుగా ఉంటాయి. మెడికల్‌ రిప్రజెంటెటీవ్‌లుగా అనుభవం వచ్చిన తర్వాత కొందరు డాక్టర్ల వద్ద ఆర్డర్లు తీసుకొని సొంతంగా ఆ ప్రాంతాలకు వెళ్లి పెద్ద మొత్తంలో మందులు కొనుగోలు చేసి తీసుకురావడం మొదలైంది. దీనిని ప్రొప గాండా కం డిసి్ట్రబ్యూషన(పీసీడీ) అంటా రు. ఇలా మొదలైన ఆ ఒరవడి డాక్టర్లు ఒక బాక్సు కొంటే పది బాక్సులు ఉచితంగా ఇచ్చే స్థాయికి వెళ్లింది. ఇది గమనించిన కొం దరు డాక్టర్లు కలిపి నేరుగా రంగంలోకి దిగారు. అలా వాళ్లే సొం తంగా వెళ్లి మందులు తెచ్చుకోవడం మొదలుపెట్టారు. ఉదాహర ణకు పెంటాప్రజోల్‌ షీటు ధర తయారీ కేంద్రం వద్ద రూ.5 ఉం టే మన చేతికి వచ్చేసరికి రూ.150 అవుతుందన్నమాట. వాస్తవా నికి కంపెనీ పెట్టిన పేరుకాకుండా ప్రిస్ర్కిప్షనలో ఔషధం పేరు రాయాలనే నిబంధనను ఎప్పుడో చంపేశారు. యాంటిబయోటిక్స్‌ తక్కువగా సూచించాలని నాటితరం వైద్యులు నెత్తీనోరు బాదు కుంటున్నా తమ వ్యాపారం కోసం వైరల్‌ ఫీవర్‌కి సెఫిక్జిమో ఒఫ లాక్సిన వంటి యాంటిబయోటిక్స్‌ చీటీల్లో నింపేస్తున్నారు.

Updated Date - Sep 25 , 2025 | 01:28 AM