జీఎస్టీ తగ్గేదేలే!
ABN , Publish Date - Sep 29 , 2025 | 01:41 AM
జీఎస్టీ 2.0 విధానం అమల్లోకి వచ్చి వారం దాటింది. ఈ నెల 22 నుంచి సుమారు 83 కేట గిరీలకు సంబంధించిన వస్తువులు,సేవలు, మం దులపై కేంద్రం జీఎస్టీ శ్లాబ్ తగ్గించిన సంగతి తెలిసిందే.
ఆగని వ్యాపారుల దోపిడీ
పాత ధరలే కొనసాగింపు
దసరా ఆఫర్లుగా ప్రకటనలు
ఎమ్మార్పీపై పాత జీఎస్టీ అమలు
వారమైనా మారని పరిస్థితి
తగ్గని పాల ప్యాకెట్ ధర
తనిఖీలు చేపట్టని అధికారులు
అవగాహన సదస్సులతో సరి
మోసపోతున్న కొనుగోలుదారులు
(రాజమహేంద్రవరం -ఆంధ్రజ్యోతి)
జీఎస్టీ 2.0 విధానం అమల్లోకి వచ్చి వారం దాటింది. ఈ నెల 22 నుంచి సుమారు 83 కేట గిరీలకు సంబంధించిన వస్తువులు,సేవలు, మం దులపై కేంద్రం జీఎస్టీ శ్లాబ్ తగ్గించిన సంగతి తెలిసిందే. గతంలో నాలుగు శ్లాబ్‌లు ఉంటే.. ప్రస్తుతం రెండు శ్లాబ్‌లకే పరిమితం చేశారు. కానీ ఎక్కడా ఇవి పూర్తి స్థాయిలో అమల్లోకి రావడంలేదు. వ్యాపారులు అసలు ధరలు చెప్ప డం లేదు. పాత సరుకు ఉందనే కారణంతో పాత ధరలే వసూలు చేస్తున్నట్టు చెబుతున్నా రు. ఈ పరి స్థితుల్లో పాత సరుకు ఎంత ఉందో చెప్పే వారెవరూ కనిపించడంలేదు. తగ్గిన జీఎ స్టీ శ్లాబ్ వల్ల ప్రజలకు ఎప్పటికి ప్రయోజనం లభిస్తుం దనేదానిపై స్పష్టత లేదు.
దసరా ఆఫర్ల పేరు..
టీవీలు, ఏసీలు వంటి ఎలక్ర్టానిక్ వస్తువులు, కార్లు, మోట్లారు సైకిళ్లపై కొంత వరకూ తగ్గి నట్టు చెబుతున్నారు. కార్లపై రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకూ తగ్గగా మోటారు సైకిళ్లపై రూ.15 వేల వరకూ తగ్గింది. టీవీలపై రూ.3 వేల నుంచి రూ. 4 వేల వరకూ తగ్గిస్తున్నారు. కానీ ఇవన్నీ దసరా ఆఫర్లతో కలిపి అమ్ము తున్నట్టు వ్యాపారులే చెబుతున్నారు. అంటే దసరా ఉత్సవాల తర్వాత టీవీలు, ఏసీల వంటి ధరలు కొద్దిగా పెరిగే అవకాశం ఉన్నట్టు చెబు తున్నారు. సిమెంట్ ధరలు తగ్గించడం లేదు. పాల ఉత్పత్తుల వద్ద ధరల పట్టీలు పెట్టారు. కానీ పాత సరుకు ఉందని చెప్పడం గమనార్హం.
కొత్త పథకం.. పాత ధర..
ప్రభుత్వం జీఎస్టీ శ్లాబ్‌ను తగ్గించిన 83 కేటగిరీల వస్తువులు, సేవలు వంటి వాటి వివరాలు ప్రకటిం చింది.వీటి ధరలు కచ్చితంగా తగ్గించాల్సిందే. పన్నీరు, టెట్రాప్యాక్ పాలు, చపాతీలు, రోటీలపై ఐదు శాతం జీఎస్టీ ఉం డేది. దానిని పూర్తిగా ఎత్తేశారు. దీంతో ఆయా వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టాయి. అయి తే వ్యాపారులు మాత్రం పాత ధరకే విక్ర యి స్తున్నారు.వెన్న, నెయ్యి, తృణధాన్యాలు, చక్కెర, కాఫీ, సూప్‌లు, బేకింగ్ ఫౌడర్, నిల్వ ఉంచిన చేప, మాంసం రేటపై జీఎస్టీ గతంలో 12 శాతం ఉండేది. ప్రస్తుతం కేవలం 5 శాతం వసూలు చేయాలి. 20 లీటర్ల తాగునీటి డబ్బా లు, కొబ్బరిపాలు, బాదం, జీడి పప్పు పాలు, అవిసెపాలు, బియ్యంపాలు , ఓట్ పాలు పండ్ల గుజ్జు, రసాలు, పాలు ఆధారిత పానీయా లపై గతంలో 18 శాతం జీఎస్టీ వసూలు చేసేవారు. ఈ శ్లాబ్‌ను 5కి పరిమితం చేశారు.
అసలు ఎంత తగ్గాయంటే!
విద్యార్థులు ఉపయోగించే వ్యాయా మం, ఎరేజర్లు, పుస్తకాలు, పెన్సిళ్లపై జీఎస్టీని ఎత్తేశారు.జామెట్రీ, రంగు పెట్టె లు,పేపరు కార్టూన్లు తదితర వస్తువు లపై 12 శాతం ఉండే జీఎస్టీని 5 శాతా నికి పరిమితం చేశారు.
అరుదైన వ్యాధులకు సంబంధించిన మందు లపై పూర్తిగా జీఎస్టీఎత్తేశారు. యునాని, సిద్ధ, హోమియోపతి సహా అన్ని మందులు, ఆక్సిజన్ కిట్లు, రసాయ నాలు,గ్లూకోమీటరు,సర్టికల్ వస్తువులపై 12 శాతం ఉంటే 5 శాతానికి పరిమితం చేశారు.ధర్మామీటరుపై 18 శాతం ఉంటే 5 శాతానికి పరిమితం చేశారు.
వ్యవసాయ పరికరాలు,యంత్రాలపై గతంలో 12, 18 శాతం జీఎస్టీ ఉండేది.. మొత్తం 5 శాతానికి తగ్గించారు. వ్యవ సాయ సంబంధిత పరికరా లు ఏం కొన్నా 5 శాతమే వసూలు చేయాలి.
వాహనాలపై గతంలో 28 శాతం జీఎస్టీ ఉంటే 18 శాతానికి పరిమితం చేశారు. సైకిళ్లు,వాటి భాగాలపై 12 శాతం ఉంటే 5శాతానికి పరిమితం చేశారు.
సిమెంట్‌పై జీఎస్టీ 28 శాతం ఉంటే 18 శాతానికి పరిమితం చేశారు. మిగిలిన గృహ నిర్మాణ వస్తువులపై 12 శాతం ఉంటే 5 శాతానికి పరిమితం చేశారు.
టీవీలు, ప్రొజెక్టర్లు, ఏసీలు, డిష్ వాషర్లపై గతంలో 28 శాతం జీఎస్టీ ఉంటే దానిని 18 శాతానికి పరిమితం చేశారు.సోలార్ వాటర్ హీటర్, సిస్టమ్స్ ,సోలార్ కుక్కర్లపై 12 శాతం ఉంటే 5శాతానికి పరిమితం చేశారు.
బొమ్మలు, క్రీడాపరికరాలు, చేతిపనుల వస్తువులపై 5 శాతమే.
ఫీడింగ్ బాటిళ్లు,స్టీల్, అల్యూమినియం, రాగి వంటి పాత్రలు, ఫీడింగ్ బాటి ళ్లు, బేబీ న్యాప్ కిన్‌లు,డ్రైపర్లు, కొవ్వొ త్తులు, స్టీలు, అల్యూ మినియం,రాగి ఇత్తడి,వంటగది పాత్రలు,కుట్టు యంత్రా లు, రబ్బరు బ్యాండ్లపై 12 శాతం జీఎస్టీని 5శాతానికి పరిమితం చేశారు.
కాఫీ, చాకెట్లు, పేస్ర్టీ, కేక్‌లు, బిస్కెట్లు, జామ్‌లుపై గతంలో 18శాతం జీఎస్టీ ఉండేది.దానిని 5 శాతానికి పరిమితం చేశారు.బాదం, పిస్తా, హాజెల్ నట్స్, ఖ ర్జూరం, అంజీర్ మొదలైన డ్రైప్రూట్లు, పాస్తా,మాకరోనీ, నూడుల్స్, ఊరగా యలు, పండ్లు, కూరగాయల రసాలపై గతంలో 12 శాతంగా ఉండే జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేశారు.
సబ్బులు,హెయిర్ ఆయిల్, షాంపూలు, దువ్వెనలు, ఫౌడర్లపై జీఎస్టీ 12 నుంచి 5 శాతానికి తగ్గింది. టాల్కర్, ఫేస్ పౌడర్, షేవింగ్ క్రీమ్, ఆఫ్టర్ షేవ్ లోషన్లపై 18 శాతం ఉంటే జీఎస్టీని 5 శాతానికి పరిమితం చేశారు. పన్ను తగ్గించినా వ్యాపారులు ఇంకా పాత పన్ను విధానమే అనుసరిస్తున్నారు.
18 వరకూ అవగాహన సదస్సులు
వస్తువుపై ఎంత జీఎస్టీ అనేది ప్రభుత్వం ప్రకటించింది. వినియోగదారులు వాటి పట్ల అవగాహన చేసుకుంటే మార్కెట్‌లో ఏ వస్తు వుకు ఎంత తగ్గిందో అడిగి కొనుక్కోవచ్చు. 22వ తేదీకి ముందు ఎమ్మార్పీని ఇవాళ ఉన్న ఎమ్మా ర్పీతో అవగాహన చేసుకుంటే వ్యాపా రులు దిగొస్తారు.లేకపోతే దోపిడీ తప్పదు. ఈ మేరకు అధికార యంత్రాంగం అవగాహన సదస్సులు చేపడుతోంది. వచ్చే నెల 18వ తేదీ వరకూ ప్రచారం ఉంటుంది.19న సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ పేరిట దీపావళిని ఒకరోజు ముందుగానే నిర్వహించనున్నారు.