Share News

జీఎస్టీ 2.0తో నిర్మాణ రంగానికి ఊతం

ABN , Publish Date - Oct 15 , 2025 | 12:58 AM

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ ఎస్టీ 2.0తో నిర్మాణ రంగానికి ఊతం లభించిందని కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌ అన్నారు. సూపర్‌ జీఎస్టీ -సూపర్‌ సేవింగ్స్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సామాన్యుల సొంతింటి కల సాకారానికి జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయని అన్నారు.

జీఎస్టీ 2.0తో నిర్మాణ రంగానికి ఊతం
సమావేశంలో మాట్లాడుతున్న అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌

  • అవగాహన సదస్సులో అడిషనల్‌ కమిషనర్‌ రామలింగేశ్వర్‌

  • పలుచోట్ల సూపర్‌ జీఎస్టీ -సూపర్‌ సేవింగ్స్‌ ప్రచార కార్యక్రమాలు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 14(ఆం ధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీ ఎస్టీ 2.0తో నిర్మాణ రంగానికి ఊతం లభించిందని కార్పొరేషన్‌ అడిషనల్‌ కమిషనర్‌ పీవీ రామలింగేశ్వర్‌ అన్నారు. సూపర్‌ జీఎస్టీ -సూపర్‌ సేవింగ్స్‌ ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ సామాన్యుల సొంతింటి కల సాకారానికి జీఎస్టీ సంస్కరణలు దోహదపడతాయని అన్నారు. సిమెంట్‌పై గతం లో 28 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి, ఇసుక, టైల్స్‌పై ఉన్న 12శాతం జీఎస్టీని 5శాతానికి తగ్గించారన్నారు. వీటితో పాటు గ్రానైట్‌, మార్బుల్‌, రంగులు వంటి వాటిపై జీఎస్టీ తగ్గిందన్నారు. సాదరణం ఇంటి నిర్మాణంలో సామాగ్రిలో అయ్యే ఖర్చులో 10-15శాతం ఆదా అవు తుందన్నారు. అనంతరం భవన నిర్మాణదారుల అభిప్రాయాలను సేకరించారు.కార్యక్రమంలో కా ర్పొరేషన్‌ సెక్రటరీ శైలజావల్లి, డీసీ ఎస్‌.వెంకటరమణ, ఇన్‌చార్జి ఎస్‌ఈ రీటా, డిప్యూటీ సీపీలు నాయుడు, శ్రీనివాస్‌, ఈఈ మదార్సాఆలీ, పలువురు భవన నిర్మాణదారులు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.

  • ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం

స్థానిక సీతంపేటలో మంగళవారం రాత్రి జరిగిన సూపర్‌ జీ ఎస్టీ-సూపర్‌ సేవింగ్స్‌ ప్రచార కా ర్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వా సు ఇంటింటికీ, చిరు దుకాణాలకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ వివరాలతో కూడిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు,మం త్రి నారా లోకేశ్‌ అహర్నిశలు శ్రమించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీలను రాష్ట్రానికి తీసుకొస్తున్నారన్నారు. 12 నెలలు శ్రమించి నేషనల్‌ పాలసీల్లో కూడా మార్పులు చేయించి 2లక్షల మందికి ఉపాఽధి కల్పించి రూ1.33 పెట్టుబడులను పెట్టే గూగుల్‌ క్లౌడ్‌ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడంలో మంత్రి లోకేశ్‌ కృషి అభినందనీయమన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణను మాటలకే పరిమితం చేయకుండా శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి ప్రాంతాన్ని అభివృధ్ది చేస్తు న్న ఘనత కూటమి ప్రభుత్వానిదేనని అన్నారు. దేశం మొత్తం గర్వి చదగ్గ కార్యక్రమం జరుగుతుంటే వైసీపీ వాళ్లు గూగుల్‌ క్లౌడ్‌ సంస్థకు భూ ములివ్వకుండా అడ్డు పడి ఈ సంస్థపై కూడా తప్పుడు ప్రచారం చేసేందుకు కుట్ర చేయడం దుర్మార్గమని ఎమ్మెల్యే వాసు మండిపడ్డారు.

Updated Date - Oct 15 , 2025 | 12:58 AM