Share News

మతసామరస్యానికి ప్రతీక నిర్మలగిరి పుణ్యక్షేత్రం

ABN , Publish Date - Mar 22 , 2025 | 12:35 AM

దేవరపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మతసామరస్యానికి ప్రతీకగా నిర్మలగిరి మేరీమేత పుణ్యక్షేత్రం ఎంతో పేరుగాంచింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఈ మేరీ మేత పుణ్యక్షేత్రం ఉత్సవాలకు ఏటా భారీసంఖ్యలో భక్తులు వస్తుంటారు. గత 40ఏళ్లుగా నిర్మలగిరి ఉత్సవాలు ప్రతీ

మతసామరస్యానికి ప్రతీక నిర్మలగిరి పుణ్యక్షేత్రం
నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో మేరీమాత ఆలయం

నేటి నుంచి 25 వరకు ఘనంగా ఉత్సవాలు

క్రైస్తవులతో పాటు తరలిరానున్న హిందువులు

దేవరపల్లి, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): మతసామరస్యానికి ప్రతీకగా నిర్మలగిరి మేరీమేత పుణ్యక్షేత్రం ఎంతో పేరుగాంచింది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం గౌరీపట్నంలోని ఈ మేరీ మేత పుణ్యక్షేత్రం ఉత్సవాలకు ఏటా భారీసంఖ్యలో భక్తులు వస్తుంటారు. గత 40ఏళ్లుగా నిర్మలగిరి ఉత్సవాలు ప్రతీ ఏడాది మార్చి 22 నుంచి 25వరకు ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ నేపథ్యంలో పుణ్యక్షేత్రంలో శనివారం జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను ఏలూరు పీఠాధిపతి పొలిమేర జయరావు, పుణ్యక్షేత్ర డైరక్టర్‌ జాన్‌పీటర్‌ చేశారు.

ఇదీ ఆలయ చరిత్ర...

ఏలూరు పీఠాధిపతి జాన్‌ములగాడ ఏలూరు నుంచి విశాఖపట్నం వెళ్తూ మార్గమధ్యలో గౌరీపట్నం సమీపంలో కారుకు అంతరాయం ఏర్పడటంతో ఆ ప్రాంతంలో పీఠాధి పతికి మేరీమాత సాక్షాత్కరించి తనకు ఆలయం నిర్మించాల ని ములగాడకు ఆలోచింపచేశారు. దీంతో గౌరీపట్నం హైవే పక్కన గల కొండ వద్ద ఆలయ నిర్మాణానికి సమయాత్తం మ య్యారు. గౌరీపట్నం ప్రముఖులు గ్రామపెద్దలతో సంప్రదించి భూసేకరణ చేసి ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి కొండపైన ఆలయాన్ని, రోడ్డు పక్కన గేటు సమీపంలో మేరీమాత మందిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ పుణ్యక్షేత్రాన్ని క్రైస్తవులతో పాటు హిందువులు కూడా దర్శించుకోవడం విశేషం. కేత్ర డైరెక్టర్‌గా ఫాదర్‌ ఆరోన్‌ దిరిసన బాధ్యతలు చేపట్టి ప్రధాన ఆలయాన్ని నిర్మించారు. 2000 సంవ త్సరంలో నిర్మలగిరి పుణ్యక్షేత్రంలో అన్ని హంగులతో ప్రధాన దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో ఏలూరు పీఠాధి పతిగా బాధ్యతలు చేపట్టిన పొలిమేర జయరావు ఆధ్వర్యంలో పుణ్యక్షేత్ర డైరె క్టర్‌గా ఫాదర్‌ రాయప్ప బాధ్యతలు చేప ట్టారు. క్షేత్రంలో పలు అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టారు. ప్రధానరగా రోడ్లు, కళావేదిక, భక్తులు వెళ్లే మార్గంలో చెట్లు నాటించారు. ఈ ఆలయంలో ముఖ్య ంగా తలనీలాలు సమర్పించడం, కొబ్బరి కాయ లు కొట్టడం, లడ్డూలు భక్తులు అందజే యడం, కొవ్వొత్తులు వెలిగించడం చేస్తుం టారు. ఇక్కడ నిత్యాన్నదానం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేశారు. అన్నదాన కాంట్రాక్టర్‌ కళ్లే నాగేశ్వరరావు భక్తులు సౌకర్యార్థం కూలింగ్‌వాటర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ పుణ్యక్షేత్రం ఆధ్వర్యంలో నిర్మల హృదయ జూనియర్‌ కాలేజీ, డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశారు. ఈ నెల 22 నుంచి 25 వరకు నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలను భారీ ఎత్తున నిర్వహించడానికి పుణ్యక్షేత్ర డైరెక్టర్‌ జాన్‌పీటర్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ పుణ్యక్షేత్రంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాలు, 200మంది వలంటీ ర్లను ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. ఈ ఉత్సవాలకు పలు రాష్ర్టాల నుంచి పీఠాధిపతులు హాజరవుతారని చెప్పారు.

Updated Date - Mar 22 , 2025 | 12:35 AM