Share News

బాణసంచా పేలుడులో మృతుల కుటుంబాలకు రూ.15 లక్షల చొప్పున పరిహారం

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:45 AM

అనపర్తి/మండపేట/రాయవరం, అక్టో బరు 21 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మం డలం వి.సావరం, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం సరిహద్దుల్లోని లక్ష్మీ గణపతి ఫైర్‌ వర్క్స్‌లో ఈ నెల 8న జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం చంద్రబాబు మంగళవా రం ప్రకటించా

బాణసంచా పేలుడులో మృతుల కుటుంబాలకు  రూ.15 లక్షల చొప్పున పరిహారం
అనపర్తిలో వివరాలను వెల్లడిస్తున్న ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి

అనపర్తి, మండపేట ఎమ్మెల్యేలు రామకృష్ణారెడ్డి, జోగేశ్వరరావు వెల్లడి

అనపర్తి/మండపేట/రాయవరం, అక్టో బరు 21 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అం బేడ్కర్‌ కోనసీమ జిల్లా రాయవరం మం డలం వి.సావరం, తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం కొమరిపాలెం సరిహద్దుల్లోని లక్ష్మీ గణపతి ఫైర్‌ వర్క్స్‌లో ఈ నెల 8న జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ.15 లక్షల ఎక్స్‌గ్రేషియాను సీఎం చంద్రబాబు మంగళవా రం ప్రకటించారని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అనపర్తిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే తాను మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనడంతో పాటు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ద్విసభ్య కమిటీ ఏర్పాటు చేసిందన్నారు. అయితే కర్నూలులో ప్రధాని పర్యటన నేపథ్యంలో కమిటీ విచారణ కొంత ఆలస్యం అయినప్పటికీ మంగళవారం నివేదిక అందిన వెంటనే ముఖ్యమంత్రి పరిహారం ప్రకటించారన్నారు. ఈ ప్రమాదంలో యజమాని సహా పదిమంది మృతిచెందారని, బాధిత కుటుంబాలకు సరైన పరిహారం అందించేందుకు ముఖ్యమంత్రిని ఒప్పించడంలో మంత్రులు సుభాష్‌, అనిత, ఎమ్మెల్యే జోగేశ్వరరావు తనతో పాటు కృషి చేశారని పేర్కొన్నారు. కార్మిక శాఖ నుంచి ఈ పరిహారం త్వరలోనే బాధిత కుటుంబాలకు అందజేస్తామని, అలాగే యజమాని తరపున కూడా పరిహారం అందే విధంగా కృషి చేస్తామన్నారు. పది మంది మృ తుల్లో అనపర్తి నియోజకవర్గానికి చెందిన వారు ఏడుగురు ఉన్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. మం డపేటలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్‌, వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ రెండురోజుల్లో మం త్రి వాసంశెట్టి సుభాష్‌ చేతులమీదుగా బాధి తు లకు ఆర్థికసాయం అందజేస్తామని తెలిపారు.

Updated Date - Oct 22 , 2025 | 12:45 AM