Share News

ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి

ABN , Publish Date - Aug 11 , 2025 | 12:00 AM

భారతీయ సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రా చీన ఆలయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బిక్కవోలులోని ప్రాచీ న లక్ష్మీగణపతి ఆలయంలో ఈనెల 27న నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు ఆదివా రం సతీమణి మహాలక్ష్మితో కలిసి ఆయన పం దిరిరాట వేసి ఉత్సవ పనులకు శ్రీకారం చుట్టా రు.

ప్రాచీన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వాలు కృషి
పందిరి రాట వేస్తున్న ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

  • ఎమ్మెల్యే నల్లమిల్లి

  • బిక్కవోలు లక్ష్మీగణపతి ఆలయంలో చవితి ఉత్సవాలకు రాట ముహూర్తం

బిక్కవోలు, ఆగస్టు 10(ఆంధ్రజ్యోతి): భారతీయ సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశ్యంతో ప్రా చీన ఆలయాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బిక్కవోలులోని ప్రాచీ న లక్ష్మీగణపతి ఆలయంలో ఈనెల 27న నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలకు ఆదివా రం సతీమణి మహాలక్ష్మితో కలిసి ఆయన పం దిరిరాట వేసి ఉత్సవ పనులకు శ్రీకారం చుట్టా రు. ముందుగా వారిద్దరు స్వామికి ప్రత్యేక పూ జలు జరిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామస్తులు స్థల సేకరణ చేస్తున్నారని ఆపై ఆలయాభివృ ద్ధి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఇక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రసాద్‌ పథకంలో కేంద్రం నుంచి నిధులు తీసుకువచ్చి లక్ష్మీగణపతి ఆలయంతో పాటు గ్రామంలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయం, గొల్లల మామిడాడలోని సూర్యనారాయణమూర్తి, రా మాలయాలను అభివృద్ధి చేయనున్నట్టు చెప్పా రు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షు డు చాగంటి సాయిబాబారెడ్డి, కూటమి నాయకులు పల్లి వాసు, పాలచర్ల శివప్రసాద్‌చౌదరి, రావాడ నాగు, వైదాడి వెంకటేశ్వరరావు, సింగారపు రా మారావు, బేరా వేణమ్మ, ఆలయ ఈవో ఆకెళ్ల భాస్కర్‌ పాల్గొన్నారు. అలాగే కొంకుదురులోని మార్కెట్‌ సెంటర్‌లోని గణపతి నవరాత్రి ఉత్స వాలకు గ్రామానికి చెందిన సత్తి లక్ష్మీనారాయణరెడ్డి సత్యప్రియ దంపతులు రాట ముహూర్తం చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చిన్నం వీరభద్రారెడ్డి మాట్లాడుతూ 63 ఏళ్లుగా ఉత్సవాలు జరుపుతున్నామన్నారు. కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, రామారెడ్డి, బాబ్జి పాల్గొన్నారు.

Updated Date - Aug 11 , 2025 | 12:01 AM