Share News

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కృషి

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:29 AM

కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో.. భాగంగా ఆటోడ్రైవర్‌లకు ప్రభుత్వం ఇటీవల రూ.15 వేలు ఆర్థికసాయం చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ దివాన్‌చెరువులోని శ్రీలక్ష్మీగణపతి ఆటోవర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ చిత్రపటాలకు సోమవారం ఆటోడ్రైవర్లు పాలాభిషేకం చేశారు.

ప్రజా సంక్షేమం, అభివృద్ధికి కృషి
ప్రధాని, సీఎం, డీసీఎం చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించిన దృశ్యం

  • రుడా చైర్మన్‌ బీవీఆర్‌ చౌదరి

  • దివాన్‌చెరువులో ‘ఆటో డ్రైవర్ల సేవలో..’పై ఆటో డ్రైవర్ల కృతజ్ఞతలు

దివాన్‌చెరువు, అక్టోబరు 13(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ఉందని రుడా ఛైర్మన్‌ బొడ్డు వెంకటరమణ చౌదరి అన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో.. భాగంగా ఆటోడ్రైవర్‌లకు ప్రభుత్వం ఇటీవల రూ.15 వేలు ఆర్థికసాయం చేసిన కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ దివాన్‌చెరువులోని శ్రీలక్ష్మీగణపతి ఆటోవర్కర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ చిత్రపటాలకు సోమవారం ఆటోడ్రైవర్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రుడా చైర్మన్‌ మాట్లాడుతూ మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించిన నేపథ్యంలో ఆటోడ్రైవర్ల జీవనోపాఽధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సీఎం చంద్రబాబు ఈ ఆర్థిక సాయం ప్రకటించారని చెప్పారు.యూనియన్‌ గౌరవాధ్యక్షుడు వంక మమల్లికార్జునస్వామి, అధ్యక్షుడు మెట్టపంట నాగరాజు మాట్లాడుతూ తమ యూనియన్‌లో ఇళ్లు లేని పేదలందరికీ స్థలాలతోబాటు ఆటోస్టాండ్‌ ఏర్పాటుకు, కార్యాలయానికి స్థలం కేటాయించాలని కోరారు.

ఇదిలా ఉండగా నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉంటున్న దివాన్‌చెరువు జంక్షన్‌లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు నలుగురు కానిస్టేబుళ్లను నియమించేలా చూడాలని పలువురు స్థానికులు బీవీఆర్‌ చౌదరి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో రద్దీ మరీ ఎక్కువగా ఉంటోందని, ఆ సమయంలో రోడ్డు దాటేందుకు చాలా సమయం వేచి ఉండాల్సి వస్తోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చిలకసాని రాంబాబు, పలివెల లోవరాజు, కొప్పర్తి సూరిబాబు, గంగిశెట్టి చంటిబాబు, కందుల బాబూరాయుడు, ఖండవిల్లి లక్ష్మి, మల్లవరపు సత్యానందం, యర్రంశెట్టి శ్రీను, అక్కిరెడ్డివేణు, దేశాల శ్రీను, అడబాల మునసబు, సొసైటీ చైర్మన్‌ ముత్యం రాజబాబు పాల్గొన్నారు.

Updated Date - Oct 14 , 2025 | 01:29 AM