ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్యను పెంచాలి
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:15 AM
ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంపుచేయడంలో ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి పిలుపునిచ్చారు. యూటీ ఎఫ్ ఏపీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా శాఖ రూ పొందించిన స్కూల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ పోస్టర్‌ను రాజానగరం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎంపీడీవో జేఏ ఝాన్సీతో కలిసి గురువారం ఆవిష్కరించారు.

యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి అరుణ
రాజానగరం, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ప్రభు త్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంపుచేయడంలో ఉపాధ్యాయులు నిరంతరం శ్రమించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి అరుణకుమారి పిలుపునిచ్చారు. యూటీ ఎఫ్ ఏపీ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లా శాఖ రూ పొందించిన స్కూల్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ పోస్టర్‌ను రాజానగరం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ఎంపీడీవో జేఏ ఝాన్సీతో కలిసి గురువారం ఆవిష్కరించారు. దీనిలో భాగంగా తొలి ప్రచార కరపత్రాలను ఎంఈవోలు రామన్నదొర, జ్యోతి ప్రసాద్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా అరుణకుమారి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలను అమలు చేయడంలో ఉపాధ్యాయులంతా సమష్టిగా కృషి చేయాలన్నా రు. రాష్ట్ర సంఘం నిర్దేశించిన ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ఆవశ్యకతను వివరించారు. జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శి దయానిధి శ్రీజయకర్, ఎ.షరీఫ్ మాట్లాడుతూ ఉపా ధ్యాయులంతా కరపత్రాలను ఉపయోగించుకు ని ఆయా గ్రామాల పరిధిలో విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌కు కృషి చేయాలని పి లుపునిచ్చారు. కార్యక్రమంలో యూటీఎఫ్ మం డల అధ్యక్ష, కార్యదర్శులు ఐడీకేడీ రాజేశ్వరిదేవి, ఏవీ శ్రీనివాసరావు, ఫణికుమార్, ఎం.శ్రీను బాబు, ఎల్.సు బ్బారావు, హరీష్ నాగేశ్వరరావు, త్రినాథ్‌కుమార్, రమేష్, మండల శాఖల బాధ్యులు పాల్గొన్నారు.
విద్యారంగ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని వినతి
రాజమహేంద్రవరం అర్బన్, ఏప్రిల్ 10(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం పాఠశాలల మెర్జింగ్ జీవో 117 ప్రత్యామ్నాయాలపై సానుకూలంగా చర్యలు తీసుకోవాలని జిల్లా యూటీఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు గురువారం యూటీఎఫ్ జిల్లా కోశాధికారి ఈవీవీఎస్‌ఆర్ ప్రసాద్ ఆధ్వర్యంలో నేతలు రాజమహేంద్రవరంలోని ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ఎమ్మెల్యే బత్తులను కలసి వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ కోసం కృషి చేయాల్సి ఉందని, ప్రభుత్వ విద్యను అభివృద్ధి చేసేందుకు వ్యూహాత్మక ప్రణాళికలను చేపడుతున్నామని తెలియజేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులను కలసి వినతిపత్రాలు అందజేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు కె.రమేష్, చిలుకూరి శ్రీనివాసరావు, కేవీఎస్ ప్రకాష్ పాల్గొన్నారు.