Share News

ప్రభుత్వ పాఠశాలల్లోనే సృజనాత్మక విద్యాబోధన

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:44 AM

ప్రభుత్వ పాఠశాలల్లోనే సృజనాత్మక విద్యాబోధన జరుగుతుందని రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నాగమణి పేర్కొన్నారు.

  ప్రభుత్వ పాఠశాలల్లోనే సృజనాత్మక విద్యాబోధన

అమలాపురం టౌన్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోనే సృజనాత్మక విద్యాబోధన జరుగుతుందని రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ నాగమణి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించి స్వేచ్ఛాయుతంగా గుణాత్మక విద్యను అభ్యసించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆమె కోరారు. అమలాపురం మహాత్మాగాంధీ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల వద్ద నుంచి సోమవారం బడిబాట కార్యక్రమాన్ని ఆర్జేడీ జెండా ఊపి ప్రారంభించారు. ఏపీటీఎఫ్‌ జిల్లాశాఖ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్‌ షేక్‌ సలీంబాషా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన, నీతివంతమైన విద్యాబోధన జరుగుతుందన్నారు. గ్రామాల్లోఉన్న ప్రభుత్వ పాఠశాలలను తక్కువగా చూడవద్దని క్వాలిటీ ఎడ్యుకేషన్‌ అందించేందుకు నిరంతరం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా శాఖ అధ్యక్షుడు ఎస్‌ఎన్‌ మునేశ్వరరావు మాట్లాడుతూ అల్లవరం, ముమ్మిడివరం, ఐ.పోలవరం మండలాల్లో వరుసగా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీసీఈబీ కార్యదర్శి బీర హనుమంతరావు, అల్లవరం మండల విద్యాశాఖాధికారి కె.కిరణ్‌బాబు, ఎస్‌.ఏడుకొండలు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిలర్‌ జీవీవీ సత్యనారాయణ, జి.వెంకటేశ్వరరావు, ఎం.నాగభూషణం, ఎన్‌.శ్రీనివాస్‌, వి.రాజశేఖర్‌, ఎం.సత్యనారాయణ, గుత్తాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:44 AM