Share News

పాలన.. పండగ!

ABN , Publish Date - Jun 11 , 2025 | 12:42 AM

. సుపరి పాలనే లక్ష్యంగా.. ప్రజలకు సంక్షేమం అందించ డమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్‌ 12వ తేదీకి ఏడాది అవుతోంది. ఈ నేప థ్యంలో ఏడాది పాలన ఎలా సాగిందనే దానిపై ప్రత్యేక కథనం..

పాలన.. పండగ!

సాగుతున్న రాజానగరం- కాకినాడ ఏడీబీ రోడ్డు పనులు

సుపరిపాలన దిశగా అడుగులు

అద్దంలా మారిన రహదారులు

పింఛన్ల పెంపు..1నే అందజేత

ఉచిత సిలిండర్ల హామీ అమలు

తెరుచుకున్న అన్న క్యాంటీన్లు

గృహ నిర్మాణాలకు ఇసుక ఫ్రీ

(కాకినాడ/రాజమహేంద్రవరం,ఆంధ్రజ్యోతి)

దందాల్లేవు.. దౌర్జన్యాల్లేవు.. బెదిరింపుల్లేవు.. వేధింపుల్లేవు.. పథకాల్లో కోతల్లేవు.. మండు వేసవి లోనూ విద్యుత్‌ కోతల్లేవు.. పథకాలపై సొంత ప్రచార యావ లేదు.. ప్రతి దానికీ పార్టీల రంగు ల్లేవు.. ఒకటే లక్ష్యం.. ఒకటే గమ్యం.. ఐదేళ్ల విధ్వ ంసానికి గురైన జిల్లాను మళ్లీ నిలబెట్టాలని... అభివృద్ధిలో పరుగులు తీయించాలని.. సుపరి పాలనే లక్ష్యంగా.. ప్రజలకు సంక్షేమం అందించ డమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సాగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్‌ 12వ తేదీకి ఏడాది అవుతోంది. ఈ నేప థ్యంలో ఏడాది పాలన ఎలా సాగిందనే దానిపై ప్రత్యేక కథనం..

ప్రభుత్వం అంటే ఎలా ఉండాలి.. ప్రజలు మెచ్చేటట్టు ఉండాలి.. భయపడేటట్టు కాదు..గత ప్రభుత్వంలో నోరెత్తితే ఏం జరుగుతుందో అనే భయం సాధారణ ప్రజానీకం నుంచి ఉద్యోగుల వరకూ ఉండేది.. నాటి ఐదేళ్లు నియంత పాలన సాగిందని ప్రజలు తమ ఓటు ద్వారా చెప్పకనే చెప్పారు.. గోదావరి జిల్లాలో ఫ్యాన్‌కు రెక్కలు లేకుండా చేసేశారు. కూటమికి పట్టం కట్టారు.. ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వ పాలన ప్రజలు ఆశించినట్టుగానే ఉందనేది ఓటరు అభిప్రాయం.. ఎందుకంటే ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం గా ముందడగు వేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐదేళ్ల రహదారుల నరకానికి స్వస్తి చెప్పింది..అవ్వా తాతలకు ఆర్థిక భరోసా నిస్తూ పింఛన్ల పెంపు..రీసర్వే చిక్కులపై ప్రత్యేక దృష్టి.. మహిళామణులకు ఉచిత సిలిండర్లు.. రేషన్‌ బియ్యం మాఫియాపై ఉక్కుపాదం.. పేద లకు కడుపు నిండా భోజనం.. భవన నిర్మాణ దారు లకు ఉచిత ఇసుక.. మత్స్య కారులకు భరోసా.. విద్యార్థులకు కిట్లు.. ప్రసవా నంతరం బేబీ కిట్లు.. జీవనాడి పోలవరం ప్రాజెక్టు చకచక..ఇలా ఒకటేంటి ఒకపక్క అభివృద్ధి మరో పక్క సంక్షే మమే అజెండాగా సీఎం చంద్రబాబు ఏడాది పాలన సుపరిపాలన దిశగా అడుగులు వేసింది.

రేషన్‌ మాఫియాపై ఉక్కుపాదం..

వైసీపీ ఐదేళ్ల పాలనలో కాకినాడ కేంద్రంగా వందలకోట్ల రేషన్‌ బియ్యం మాఫియా నడి చింది.ప్రధానంగా వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో నాటి కాకినాడ సిటీ వైసీపీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి కుటుంబం, ఆయన అనుచరులు బియ్యాన్ని కనివినీ ఎరుగని రీతిలో బొక్కేశారు. నౌకల ద్వారా ఆఫ్రికా దేశాలకు అమ్మేసుకుని వేల కోట్లు గడించారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి, ఆయన ప్రధాన అనుచరుడు వినోద్‌ అగర్వాల్‌కు చెందిన రెండు కంపెనీలు వైసీపీ ఐదేళ్ల పాలనలో రూ.4,995 కోట్ల విలువైన 13.41లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం విదేశాలకు విక్రయించినట్టు సమాచా రం. కాకినాడ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశానికి స్టెల్లా నౌకలో రహస్యంగా ఎగుమతికి సిద్ధం చేసిన రేషన్‌ బియ్యం పట్టుబడ్డంతో ఈ స్మగ్లింగ్‌ వ్యవహారం అధికారికంగా బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో రేషన్‌ మాఫియాపై ప్రభుత్వం సిట్‌ను నియమించింది. మొత్తం రూ.84.87 కోట్ల విలువైన 22,947 మెట్రిక్‌ టన్నుల బియ్యం పట్టు బడిన 13 కేసులపై విచారణకు ఆదేశించడంతో రేషన్‌ మాఫియా వణికిపోయింది.

గ్యాస్‌ కాదని తేల్చేశారు!

మహిళలకు ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను అందిస్తామన్న హామీ మేరకు సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 13 లక్షల గ్యా స్‌ కనెక్షన్లు ఉన్నాయి.తొలి విడత ఉచిత సిలిం డర్‌ కింద ఉమ్మడి జిల్లాలో 11.52 లక్షల మంది ఈ సదుపాయం వినియోగించుకోగా వీరికి రూ.95 కోట్లు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. రెండో ఉచిత సిలిండర్‌ ఇప్పటికే 6.70 లక్షల మంది తీసుకున్నారు.డబ్బులు జమవుతున్నాయి.

డీఎస్సీ నిర్వహణ..

నిరుద్యోగులకు ప్రభుత్వం వరం ప్రకటిం చిం ది.జగన్‌ ప్రభుత్వంలో నోటిఫికేషన్‌కు నోచుకోని డీఎస్సీని కూటమి అమలు చేసింది. గతేడాది ఏప్రిల్‌ 22న చంద్రబాబు జగ్గంపేట ఎన్నికల ప్రచార సభకు వచ్చినప్పుడు డీఎస్సీపై తొలి సంతకం చేసే పెన్ను ఇదేనంటూ హెలీ ప్యాడ్‌ వద్ద ఓ యువతి ఇచ్చిన పెన్నును ప్రజ లకు చూపించారు.దానికి తగ్గట్టుగా ఉమ్మడి జి ల్లాలో 1,278 ఖాళీలను భర్తీ చేయడానికి నోటిఫి కేషన్‌ వేసి పరీక్ష కూడా నిర్వహించారు.

నేడు నాణ్యమైన సరుకు..

వైసీపీ ఐదేళ్లలో మందుబాబులు నరకం చూ శా రు.అప్పట్లో మందు బాబులకు ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో నాసిరకం మద్యం అంటగట్టి అప్పటి ప్రభుత్వ పెద్దలు వేలకోట్లు సంపాదిం చారు.కూటమి ప్రభుత్వం రాగానే మద్యం మాఫి యాకు చెక్‌ పెట్టింది.ప్రైవేటు దుకాణాలకు అను మతిచ్చి నాణ్యమైన మద్యాన్ని తెచ్చింది.

వచ్చిన వెంటనే.. దారి..చూపారు

వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలు రహదా రులపై ప్రత్యక్ష నరకం చూశారు. ప్రతిపక్ష హో దాలో సమస్యలపై పోరాడిన కూటమి అధికారంలోకి రాగానే రహదారులపై గుం తలు పూడ్చడాన్ని ప్రాధాన్య ప్రాజెక్టుగా చేప ట్టింది. ఈ ఏడాది సంక్రాంతి నాటికి ఎక్కడా రహదారులపై గుంతలు ఉండకూదన్న సీఎం చంద్రబాబు ఆదే శాలతో జిల్లాలో సుమారు 400 కిలోమీటర్ల మేర గుంతలన్నీ పూడ్చారు. ఒకప్పుడు రాజానగరం- కాకినాడ ఏడీబీ రోడ్డు, వేమగిరి-సామర్లకోట రహదారులపై ప్రయా ణించాలంటే నరకం. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వ చొరవతో ఈ రహదా రులన్నీ అద్దాలను తలపిస్తున్నాయి. కాకినాడ- రాజ మహేంద్రవరం కెనాల్‌ రోడ్డు అభివృద్ధికి రూ.160 కోట్ల వరకు వ్యయం కానుంది.

గృహ’యోగమే’

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గత వైసీపీ ప్రభుత్వం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 3.06 లక్షల మందిని పేదల ఇళ్లస్థలాలకు అర్హులుగా గుర్తించింది.పేదల ఇళ్లస్థలాలకు అనువు కాని ప్రాంతాలను ఎంపిక చేసి ఇబ్బందులకు గురిచేసింది.కూటమి వచ్చాక ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా 32 వేల మంది పేదల దరఖాస్తు చేసుకున్నారు. పేదలు ఇల్లు కట్టుకుంటే ఉచితంగా ఇసుక అందిస్తున్నారు.

పేదలకు పండగే...

సీఎం చంద్రబాబు గద్దెనె క్కిన తర్వాత పింఛన్‌ను రూ.4వేలు చేశారు. తొలి నెల జూలై మాత్రం పాత ఏరి యర్స్‌ రూ.3 వేలు కలిపి రూ.7 వేలు చొప్పున అందించారు. జిల్లాలో 2.35 లక్షల మంది పింఛన్‌ దారులు ఒకటో తేదీనే నెలకు రూ.102 కోట్లు అందుకుంటున్నారు. మరో పక్క గత వైసీపీ ప్రభుత్వంలో మూసేసిన అన్న క్యాంటీన్లు మళ్లీ తెరుచుకున్నాయి. జిల్లా కేంద్రం రాజమహేంద్ర వరంలో మూడు, కొవ్వూరు, నిడదవోలులో ఒక్కొక్కటి చొప్పున తెరుచు కున్నాయి. అనపర్తి నియోజక వర్గ కేంద్రంలోనూ ఏర్పాటు చేశారు.

Updated Date - Jun 11 , 2025 | 12:42 AM