మహిళాభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషి
ABN , Publish Date - Aug 01 , 2025 | 01:27 AM
ప్రతీనెల 1వ తేదీ మధ్యాహ్నానికే రాష్ట్రవ్యాప్తంగా 74 లక్షల మందికి 13 రకాల పెన్షన్‌లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. కడియంలో గురువారం ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. మంత్రి కె.శ్రీనివాస్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిని తెలుపుతూ, సమస్యలు తెలుసుకుంటూ సుపరిపాలన కార్యక్ర మం జరుగుతోందన్నారు.
రూ.90 వేల కోట్లు మహిళలకు రుణాలు ఇస్తున్నాం
ఏటా లక్ష మంది మహిళ లను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, సెర్ప్ శాఖల మంత్రి శ్రీనివాస్
74 లక్షల మందికి 13 రకాల పెన్షన్లు : ఎమ్మెల్యే గోరంట్ల
కడియం, జూలై31(ఆంధ్రజ్యోతి): ప్రతీనెల 1వ తేదీ మధ్యాహ్నానికే రాష్ట్రవ్యాప్తంగా 74 లక్షల మందికి 13 రకాల పెన్షన్‌లు అందజేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే అని రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తెలిపారు. కడియంలో గురువారం ఏడాది సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. మంత్రి కె.శ్రీనివాస్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ ఏడాది పాలనలో జరిగిన అభివృద్ధిని తెలుపుతూ, సమస్యలు తెలుసుకుంటూ సుపరిపాలన కార్యక్ర మం జరుగుతోందన్నారు. ఎంతమంది పిల్ల లు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథ కం అమలు చేసినట్టు తెలిపారు. త్వరలో 3 గ్యాస్ సిలెండర్లకు ఒకేసారి సొమ్ములు అందజేస్తారన్నారు. అలాగే 16 వేల మందికి ఉద్యో గాలు కల్పించారన్నారు. గత ప్రభుత్వ నిర్వా కం వల్ల జరిగిన తప్పులు సరిచేసుకుంటూ మరోవైపు సంక్షేమం, అభివృద్ధి దిశగా ప్రభుత్వపాలన సాగిస్తోందన్నారు. ఇంటింటికీ గోదావరి నీరు ఇచ్చేవిధంగా ప్రతిపాదనలు చేస్తున్నట్టు తెలిపారు. పేదరిక నిర్మూలన జరగాలనేది కూటమి ఉద్దేశం అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోసిగంటి సత్యవతి, డాక్టర్ గోరంట్ల రవిరామ్‌కిరణ్, ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, అన్నందేవుల చంటి, మా ర్గాని సత్య నారాయణ, వెలుగుబంటి నాని, ప్రత్తిపాటి రామారావుచౌదరి, ముద్రగడ జమీ, కాశి నవీన్‌కుమార్, ఏఎంసీ చైర్మెన్ మార్ని వాసు, ఉపాధ్యక్షులు బోడపాటి గోపి, ఆదిమూలం సాయిబాబా పాల్గొన్నారు.