Share News

జూన్‌ 1 నుంచి గుడ్‌ మార్నింగ్‌ నిడదవోలు

ABN , Publish Date - May 18 , 2025 | 01:01 AM

నియో జకవర్గంలో సమస్యల పరిష్కారానికి జూన్‌ ఒకటో తేదీ నుంచి వారంలో ఒక రోజు గుడ్‌ మార్నింగ్‌ నిడదవోలు కార్యక్రమం చేపడ తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫి శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ తెలి పారు.

జూన్‌ 1 నుంచి గుడ్‌ మార్నింగ్‌ నిడదవోలు
విలేకరులతో మాట్లాడుతున్న మంత్రి కందుల దుర్గేష్‌

సమస్యల పరిష్కారానికే

వారంలో ఒక రోజు అమలు

నిడదవోలు, మే 17 (ఆంధ్రజ్యోతి) : నియో జకవర్గంలో సమస్యల పరిష్కారానికి జూన్‌ ఒకటో తేదీ నుంచి వారంలో ఒక రోజు గుడ్‌ మార్నింగ్‌ నిడదవోలు కార్యక్రమం చేపడ తానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా టోగ్రఫి శాఖా మంత్రి కందుల దుర్గేష్‌ తెలి పారు. నిడదవోలు మునిసిపల్‌ కార్యాలయం లో శనివారం విలేకరులతో మాట్లాడారు. నిడదవోలు పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు కృషి చేస్తానన్నారు.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 11 నెలల కాలంలోనే పట్టణంలో రూ.105.80 కోట్ల తో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ముని సిపాలిటి సాధారణ నిధులు రూ.15.75 కోట్లు 240 అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నామ న్నారు.రూ.8.12 కోట్లతో 187 పనులు పూర్త య్యాయన్నారు. మిగిలిన పనులు వివిధ దశ ల్లో ఉన్నాయని తెలిపారు. నిడదవోలులో గోదావరి జలాలు, ఆర్వోబీ పనులు, ప్రభుత్వ ఆసుపత్రి అధునికీకరణ పనులతో పాటు 15వ ఆర్థిక సంఘం నుంచి రూ.4.50 కోట్లు తీసు కువచ్చామన్నారు. రుడా నుంచి మంజూరైన రూ. కోటితో పట్టణంలో పక్కా రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు.గత ప్రభుత్వం అమృత్‌, జలజీవన్‌ మిషన్‌ నిధులు దారిమళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపాలిటీకి వచ్చిన బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులు రూ.33 లక్షలతో మురుగునీటికి చెక్‌ పెడతామన్నారు. త్వరలోనే ప్రభుత్వం నుంచి మరో రూ.3 కోట్లు నిధులు తెచ్చి మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తామన్నారు. గ్రీన్‌ కార్పొరేషన్‌ సహ కారంతో పట్టణంలో సుందరీకరణ కార్యక్రమం చేపడతామని తెలిపారు. పట్టణంలో సుమా రు 250 సీపీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తా మన్నారు. పట్టణంలో జరుగుతున్న ఆర్వోబీ నిర్మాణం వేగవంతం చేశామన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్‌లో భాగంగా రాజమండ్రి పరి సర ప్రాంతాలతో పాటు నిడదవోలును రూ.3 కోట్లతో ప్రత్యేక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కోట సత్తెమ్మ దేవాలయంతో పాటు కాలువలో బోటింగ్‌, కెనాల్‌ సమీపంలో కేపిటేరియా ఏర్పాటు చేయ నున్నామన్నారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ భూపతి ఆదినారాయణ,టీడీపీ పట్టణాధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, జనసేన అధ్యక్షుడు రంగా రమేష్‌, కమిషనర్‌ టి.కృష్ణవేణి పాల్గొన్నారు.

Updated Date - May 18 , 2025 | 01:01 AM