సుపరిపాలనే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - May 01 , 2025 | 01:04 AM
అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అం దించడమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బలభద్రపురం ఉన్నత పాఠశాలలో బుధవారం ఆయన బిక్కవోలు, రం గంపేట, అనపర్తి మండల్లాలోని భవిత కేంద్రాల్లోని 36 మంది ప్రత్యేకావసరాల పిల్లలకు ఎస్ ఎస్‌ఏ ఆధ్వర్యంలో రూ.20 లక్షల విలువైన ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
బిక్కవోలు, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): అభివృద్ధిని, సంక్షేమాన్ని మేళవించి సుపరిపాలన అం దించడమే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. బలభద్రపురం ఉన్నత పాఠశాలలో బుధవారం ఆయన బిక్కవోలు, రం గంపేట, అనపర్తి మండల్లాలోని భవిత కేంద్రాల్లోని 36 మంది ప్రత్యేకావసరాల పిల్లలకు ఎస్ ఎస్‌ఏ ఆధ్వర్యంలో రూ.20 లక్షల విలువైన ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ధికి, సంక్షేమానికి తేడా తెలియని పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశా రు. వారి హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్ ఎస్‌ఏ నిధులు మళ్లించి నవరత్నాల పేరుతో మాయ చేశారన్నారు. తాము సూపర్ సిక్స్ పథకాలతో పాటు మహిళలు, ది వ్యాంగులకు, పేదలకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.భవిత సెం టర్లకు ఫిజియోథెరపిస్టులను నియమిస్తున్నామని, బిక్కవోలు ఫిజియోథెరపిస్టు మధు తన గౌరవ వేతనాన్ని తిరిగి ఆ పిల్లలకే ఖర్చు చేయ డం పట్ల అతడిని సభలో అభినందించారు. అలాగే ఈప్రాంతంలో 18 మంది చిన్నారులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. అనంతరం ఆయన దివ్యాంగ చిన్నారులకు ట్రైసైకిళ్లు, వీల్‌చైర్స్, బ్రెయిలీ కిట్లు, వినికిడి యంత్రాలు, ఎంఆర్ టీఎల్‌ఎం కిట్లు, రోల్ లేటర్స్ అందజేసారు. ఇదిలా ఉండగా గ్రామంలో ఈస్ట్రర్న్ డెల్టా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మించనున్న వాటర్‌ట్యాంక్, సంపు నిర్మాణాల స్థలాలను ఎమ్మెల్యే నల్లమిల్లి పరిశీలించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ తేతలి సుమ, సర్పంచ్ బుంగా రామారావు, ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ సుభాషిణి, నాయకులు ఎన్‌వీ సుబ్బారెడ్డి, పల్లి వాసు, ఆళ్ల గోవిందు, చిట్టిబాబుచౌదరి, శివరామకృష్ణంరాజు,పడాల రా ము, ఇందల వీరబాబు, పలువురు అధికారులు దివ్యాంగ పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.