Share News

బంగారం..వెండి.. బెధరహో!

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:35 AM

బంగారం కొనలేం.. రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది.. ఎక్కడా ఆగడంలేదు..

బంగారం..వెండి.. బెధరహో!

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

బంగారం కొనలేం.. రోజురోజుకు పెరిగి పోతూనే ఉంది.. ఎక్కడా ఆగడంలేదు.. రికా ర్డుల మీద రికార్డులు తిరగ రాసేస్తోంది.. బంగారం కొనాలంటేనే బాబోయ్‌ అనేలా ఉంది పరిస్థితి. రాజమండ్రి బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర 22 క్యారెట్‌ ఒక గ్రాము ధర రూ. 12వేల 700. 22 క్యారెట్‌ 10 గ్రాముల ధర 1 లక్షా 27 వేలు.ఇక 24 క్యారెట్‌ ఒక గ్రాము ధర ఏకంగా రూ.13,850. 10 గ్రాముల ధర రూ.1 లక్షా 38 వేల 855.. బంగారం ధర ఇం తలా పెరుగుతుంటే.. ఏం కొంటాం..ఏం పెట్టుకుంటాం అంటూ మహిళలు నిట్టూర్చు తున్నారు. ఈ ఏడాది జనవరి 1న 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం ధర కేవలం 71,150 మాత్రమే.సుమారు 12 నెలల లోపు లోనే మాయ జరిగింది? ఏకంగా రూ.56 వేలు పెరిగిపోయింది. ఇక 24 క్యారెట్‌ బం గారం ధర జనవరి 1న రూ.78 వేలు మాత్ర మే ఉంది.12 నెలల లోపే సుమారు రూ.61 వేలు పెరిగిపోయింది. 2025 సంవత్సరం బం..గారమే మరి..ఇక వెండిదీ అదే పరిస్థితి.. కొనేలా లేదు. జనవరిలో కేజీ వెండి ధర కేవలం రూ.88,400 మాత్రమే.ఇవాళ కేజీ వెం డి ధర రూ.2.15 లక్షలు.. అంటే కేవలం 12 నెలలు కూడా పూర్తి కాకుండానే అదనంగా ఒక లక్షా 26 వేల 600 పెరిగిపోయింది.

Updated Date - Dec 24 , 2025 | 12:35 AM