విజన్-2047తో బంగారు భవిష్యత్
ABN , Publish Date - Jun 14 , 2025 | 01:12 AM
భావి తరాలకు చక్కని మార్గాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు విజన్ 2047 రూ పొందించారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం అనపర్తిలోని ఎస్‌ఎన్ ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ని యోజకవర్గ స్థాయి వర్క్‌షాపునకు ఆయన వి చ్చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై మేధావి వర్గాలు సూచనలు సలహాలు అందజేయాలన్నారు.
ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
అనపర్తి నియోజకవర్గ వర్క్‌షాపు
అనపర్తి, జూన్ 13 (ఆంధ్రజ్యోతి): భావి తరాలకు చక్కని మార్గాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు విజన్ 2047 రూ పొందించారని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం అనపర్తిలోని ఎస్‌ఎన్ ఆర్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ని యోజకవర్గ స్థాయి వర్క్‌షాపునకు ఆయన వి చ్చేసి మాట్లాడారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అధిగమించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై మేధావి వర్గాలు సూచనలు సలహాలు అందజేయాలన్నారు. టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డి మాట్లాడుతూ అనపర్తి-పె డపర్తి, గొల్లలమామిడాడ-కాకినాడ రోడ్లు ట్రాఫిక్ సమస్యతో సతమతమౌతున్నాయని, వీటికి ప్రత్యామ్నాయ రోడ్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.అలాగే పౌలీ్ట్ర రైతులను ఆదుకునేందుకు, అనపర్తిని రైస్‌మిల్లుల హబ్‌గా చేసేం దుకు చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారి ప్రేమ్‌కుమార్, జిల్లా సీపీవో అప్పలకొండ, ఆర్‌డబ్ల్యుఎస్ డీఈ శ్రీనివాస్, పీఆర్ అచ్యుతరామారెడ్డి, స్మాల్ ఇండస్ట్రీస్ పీవో శ్రీనివాసరావు, పారిశ్రామికవేత్తలు సబ్బెళ్ళ అమ్మి రెడ్డి, కర్రి వెంకటరెడ్డి, రామలింగారెడ్డి, నేత్ర వైద్యులు తేతలి సత్యనారాయణరెడ్డి, ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ తాడి రామగుర్రెడ్డి పాల్గొన్నారు.
ఉపాధి అవకాశాలే లక్ష్యం
అనపర్తిలోని సాయి మాధవి డిగ్రీ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాబ్ మేళాను టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి మనోజ్‌రెడ్డితో కలిసి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత యువతలో ఉపాధి అవకాశాలు ఏర్పా టు చేసేందుకు నిర్వహిస్తున్న జాబ్ మేళాలు సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. ఈ మేళాకు సు మారు 400 మంది హాజరు కాగా 19 కంపెనీల నుంచి వచ్చిన ప్రతినిధులు 170మంది అభ్యర్థు లను ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎంఎన్‌ఆర్ విద్యా సంస్థల చైర్మన్ మల్లిడి అనంతరెడ్డి, నాయకులు దత్తుడు శ్రీను, ఒంటిమి సూర్యప్రకాష్, మామిడిశెట్టి శ్రీను, ఎన్‌ఆర్‌కె ప్రసాదరెడ్డి, కర్రి వెంకటరెడ్డి పాల్గొన్నారు.