Share News

రూ.లక్ష.. దాటేసి..

ABN , Publish Date - Sep 10 , 2025 | 01:17 AM

బంగారం ధరలు మిడిసి పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి బాగా పెరుగుదల మొదలైంది. ఇక తగ్గేదేలే అన్నట్టు ముందుకు పోతోంది. అపుడప్పుడు అటూఇటూ వెనకడు గు వేసినట్టు కనిపించినా, మళ్లీ పరుగుపెడు తోంది. జనవరి నుంచి ఇప్పటికి సుమారు ఎనిమిది నెలల కాలంలో 22 క్యారెట్‌ బంగా రం ధర ఏకంగా రూ.30 వేలు అదనంగా పెరిగింది.

రూ.లక్ష.. దాటేసి..

  • 10 గ్రా. బంగారం 22 క్యారెట్‌ రూ.1,01,100.. జనవరిలో రూ.71,500

  • కిలో వెండి ధర రూ.లక్షా 28 వేల 900.. జనవరి నాటి ధర రూ.88,400

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

బంగారం ధరలు మిడిసి పడుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి బాగా పెరుగుదల మొదలైంది. ఇక తగ్గేదేలే అన్నట్టు ముందుకు పోతోంది. అపుడప్పుడు అటూఇటూ వెనకడు గు వేసినట్టు కనిపించినా, మళ్లీ పరుగుపెడు తోంది. జనవరి నుంచి ఇప్పటికి సుమారు ఎనిమిది నెలల కాలంలో 22 క్యారెట్‌ బంగా రం ధర ఏకంగా రూ.30 వేలు అదనంగా పెరిగింది. 24 క్యారెట్‌ బంగారం 10 గ్రాముల ధర సుమారు 33 వేల వరకూ పెరుగుదల కనిపిస్తోంది. వెండి ధర కూడా విపరీతంగా పెరిగింది. వెండి ధర సుమారు 40 వేల వర కూ పెరిగిపోయింది. మంగళవారం రాజమం డ్రి మార్కెట్‌లో బంగా బంగారం 22 క్యారెట్‌ 10 గ్రాములు ధర రూ.లక్ష దాటేయడం గమ నార్హం. 24 క్యారెట్‌ బంగారం ధర ఎపుడో రూ.లక్ష దాటేసిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది 22 క్యారెట్‌ బంగారమే కొంటారు. వస్తువులు కూడా ఇవే ఉంటాయి. ఇవాళ 10 గ్రాముల 22 క్యారెట్‌ బంగారం రూ.1,01,100 కి చేరింది. అంటే కేవలం ఒక గ్రాము బంగా రం 10వేల110 కావడం గమనార్హం. సామా న్యుడు చిన్న బంగారం వస్తువును కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి లేనట్టే. 10 గ్రా ముల 24 క్యారెట్‌ ధర రూ.1,10,290 చేరింది. ఇదంతా రికార్డు స్థాయి ధరలు. ప్రజలకు అం దుబాటు కాని ధరలు. పేద, మధ్యతరగతి ప్ర జలు బంగారం అంటే కలలోనే చూసే వస్తు వుగా మారిపోయింది. ఇంతవరకూ బంగారం కొనుగోలు చేసిన వారి పంట బాగా పండిన ట్టే. జనవరికి ముందుకు కొనుగోలు చేసినవా రికే బాగా మిగిలినట్టే చెప్పవచ్చు. బ్యాంకుల్లో రుణాలు కూడా అధికంగా బాగా వస్తాయి.

వెండిదీ అదే బాట

ప్రస్తుతం రాజమహేంద్రవరం మార్కెట్‌ కిలో వెండి ధర రూ.1 లక్షా 28వేల 900గా ఉంది. ఇది ఇలా ఎంత ధరకు పెరిగిపోతుం దో చెప్పలేం. ఒకవేళ తగ్గితే వందో రెండొం దలో తగ్గుతోంది. పెరిగితే వేలల్లో పెరిగిపో తోందని వినియోగదారులు వాపోతున్నారు. జనవరి 1న వెండి ధర కిలో 88,400గా ఉండ గా ఆ తర్వాత ధర భారీగా పెరిగిపోయింది. జనవరి నుంచి ఇప్పటివరకూ వెండి ఏకంగా రూ.40,500 పెరిగింది. డబ్బున్నవారు బంగా రం, వెండి కొనడానికి వెనకాడకపోయినా, సామాన్యులు మాత్రం కళ్లు తేలేస్తున్నారు.

Updated Date - Sep 10 , 2025 | 01:17 AM