Share News

అలా..కాణిచ్చేద్దాం!

ABN , Publish Date - Jul 27 , 2025 | 01:27 AM

శ్రావణమాసం వచ్చిందంటే బంగారానికి ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చి పడేది.. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక గ్రాము లక్ష్మీదేవి రూపు కొనుగోలు చేయాలనే తలంపు ఉండేది.

అలా..కాణిచ్చేద్దాం!

శ్రావణంలోనూ బంగారమే!

కాణి రూపులకు డిమాండ్‌

పెరిగిన బంగారం ధరలే కారణం

10 గ్రాములు రూ.99,930

గ్రాము రూపు రూ.10,250

కొనుగోలుదారుల వెనకడుగు

ఆచితూచి వ్యాపారుల అడుగులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

శ్రావణమాసం వచ్చిందంటే బంగారానికి ఎక్కడ లేని డిమాండ్‌ వచ్చి పడేది.. ఎందుకంటే ప్రతి కుటుంబంలో ఒక గ్రాము లక్ష్మీదేవి రూపు కొనుగోలు చేయాలనే తలంపు ఉండేది.. ప్రస్తుతం పెరిగిన ధరల నేపథ్యంలో గ్రాము బంగారం మోయలేక చాలా మంది కాణి రూపుల వైపు చూస్తున్నారు.. మరికొంత మంది అయితే బంగారానికి ప్రత్నామ్నాయం ఏమిటా అని ఆలోచిస్తున్నారు.. శ్రావణం అంటేనే సర్వ శుభకరం.. శుభ ఘడి యలే..పండుగలు, వివాహాలు, గృహ ప్రవేశా లు,పూజలు,నోములు, వ్రతాలు.. ఇలా ఈ మాస మంతా శుభకార్యాలు, ఆధ్యాత్మిక శోభతో అలరా రుతుంది.అమ్మవార్ల ఆలయాలు కిటకిటలాడు తుంటాయి. మహిళలు ఈ మాసమంతా ఇం టిని లక్ష్మీదేవి ఆలయంగా భావిస్తూ ధూప, దీప నైవేద్యాలతో కొలుస్తారు. ఇక ఇది ముహూర్తాల నెల కావడంతో బంగారానికి డిమాండ్‌ ఉన్నా.. మంగళ సూత్రాలు, తాడు, ఉంగరాలు వంటి ప్రధానమైన వాటితో సరిపెడుతున్నారు. పసిడి ధరలు పరిగణనలోకి తీసుకుని వరలక్ష్మి రూ పులు కాణితో సరిపెడుతున్నారు.

ఏడాదిలో రూ.29 వేలు పెరుగుదల

బంగారం ధరలు గత మూడేళ్ల నుంచీ పరు గులు పెడుతున్నాయి. గత ఏడాది ఇదే నెలలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.70 వేలు ఉంది. శనివారం చూస్తే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,930లు ఉంది. 22 క్యారెట్ల ధర రూ.91,600 ఉంది. దీంతో గ్రాము రూపునకు రూ.11 వేలు వెచ్చించాల్సి వస్తోంది. 700 మిల్లీ గ్రాములు అణా ఎత్తుకు రూ.8 వేలు, 350 మిల్లీల అర్ధనాకు రూ.4 వేలు చెల్లించాల్సి వస్తోంది. కనీసం 200 మిల్లీల కాణి ఎత్తు కొందామన్నా రూ.2500 వరకూ ఉంది. ఇది ఒకసారి కిందపడితే మళ్లీ కంటికి కనిపిం చనంత పరిమాణంలో ఉంటుంది.ప్రస్తుత ధర లు చూస్తే వెండి రూపు లకు డిమాండ్‌ పెరగొ చ్చని చెబుతున్నారు. వెండి కేజీ రూ.1,18,000లు ఉంది. ఇత్తడి, రాగి రూపుల ప్రసక్తి ఇప్పటి వర కూ లేదు. బంగా రం ధరలను బట్టి అవి కూడా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది.

రూ.200 కోట్ల వ్యాపారం?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 50 వర కూ పెద్ద మాల్స్‌ ఉండగా.. 2 వేల వరకూ మా మూలు దుకాణాలు ఉన్నాయి. ఓ మూడేళ్ల కిందట వరకూ శ్రావణం వచ్చిందంటే సుమారు రూ.200 కోట్ల వ్యాపారం జరిగేది. దీంట్లో రూ.50 కోట్ల వరకూ రూపుల వ్యాపారమే ఉండేది. కానీ ఇప్పుడు ఆ అంకె కాస్త అటూ ఇటుగా అలాగే ఉన్నా కొనుక్కొనే వారి సంఖ్య మాత్రం తగ్గినట్లు కనిపిస్తోంది.ఇప్పుడు గ్రాము రూ.10 వేల చొప్పు న ఓ వంద రూపులు అమ్మితే రూ.కోటి వ్యా పారం జరిగిపోతోంది. ప్రస్తుత ధరల వల్ల జనం వెనక్కి తగ్గుతుండడంతో వ్యాపారులు వెన కడు గు వేస్తున్నారు. రూపుల వ్యాపారాన్ని ఈసారి విరమిం చుకున్నా మని కొందరు వ్యాపారులు చెబుతున్నారు. అయితే శ్రావణం, ముహూర్తాల వల్ల ఓ 20 రోజుల నుంచీ వ్యాపారం బాగానే జరుగుతోం దని మరికొందరు అంటున్నారు. ఇక సెంటి మెంటుగా..ఎప్పుడూ గ్రాము రూపే అని భావించే వాళ్లు అప్పు చేసైనా కొంటున్నారు.

అపురూపుమే!

శ్రావణంలో వరలక్ష్మీ వ్రతానికి ఎంత విశిష్టత ఉందో.. పసిడికీ అంతే ప్రాధాన్యం ఇస్తారు. వ్రతంలో లక్ష్మీదేవి మెడలో రూపును అలం కరించి ఆ అమ్మవారు తన ఇంట కొలు వైనట్టు భావిస్తారు.కానీ ప్రస్తుతం బంగారం గారం పోతోంది. గతంలో గ్రాము రూపును అలంకరించిన వాళ్లు ఈసారి కాణి ఎత్తుకూ జంకే విధంగా ధరలున్నాయి. రూపు కొనా లంటే రుణం తప్పదనే నానుడికి జీవం పోస్తున్నాయి.కొన్ని బంగారు దుకాణాల వారు అసలు రూపు జోలికి వెళ్లడం లేదంటే పరిస్థితిని అర్ధం చేసుకో వచ్చు.

తాళికట్టు..శుభవేళ..

మూఢం కారణంగా 48 రోజుల పాటు శుభ ముహూర్తాలు లేవు. దీంతో పసిడి విక్రయాలు నెమ్మదించాయి. శ్రావణమాసం ఈ శుక్రవారం 25వ తేదీ నుంచి ప్రారంభం కావడంతో మళ్లీ పసిడి కొనుగోళు ఊపందుకుంటున్నాయని భావి స్తున్నారు.జూలై నెలలో 26, 30, 31 ఆగస్టులో 1, 3, 5, 7 నుంచి 14, 17 తేదీల్లో శుభ ముహూ ర్తాలు ఉన్నాయి.శ్రావణం తర్వాత ఆగస్టు 21 నుంచి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది. శూన్యమాసం కాబట్టి ముహూర్తాలు ఉండవు. మళ్లీ సెప్టెంబరు 23 నుంచి ఉంటాయి. 8న వర లక్ష్మీ వ్రతం,16 శ్రీ కృష్ణాష్టమి ఉన్నాయి.

రూపుల ధరలు ఇలా..

కాణిఎత్తు 200 మిల్లీలు రూ.2,280

అర్ధణా 350 మిల్లీలు రూ.3,800

అణా 700 మిల్లీలు రూ.7,300

అర గ్రాము రూ.5,300

గ్రాము రూ.10,250

Updated Date - Jul 27 , 2025 | 01:27 AM