కొందామంటే..బంగారమాయె!
ABN , Publish Date - Jun 16 , 2025 | 01:03 AM
పసిడి ధర మిడిసిపడుతోంది. బంగారం అందని ద్రాక్షగా మారేలా ఉంది..ఎందుకంటే ఎక్కడా తగ్గుముఖం లేదు.. పెరుగుతూనే ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందని సరుకుగా మారిపోతోంది.

24 క్యారెట్ ధర రూ.1,01,670
22 క్యారెట్ రూ.93,200
(రాజమహేంద్రవరం/అమలాపురం- ఆంధ్రజ్యోతి)
పసిడి ధర మిడిసిపడుతోంది. బంగారం అందని ద్రాక్షగా మారేలా ఉంది..ఎందుకంటే ఎక్కడా తగ్గుముఖం లేదు.. పెరుగుతూనే ఉంది. సామాన్య మధ్యతరగతి ప్రజలకు అందని సరుకుగా మారిపోతోంది. ఇక బంగా రం కొనలేం అన్నట్టు ధర పెరుగుతూ పోతోంది.తులం బంగారం లక్ష దాటేసింది. ధర రికార్డుస్థాయిలో పెరిగి పోతోంది. ఇంత ధరకు చేరడం ఇదే మొదటిసారని వ్యాపారులు,వినియోగదారులు చెబుతున్నారు. ప్రస్తుతం రాజమహేంద్రవరం మార్కెట్‌లో 22 క్యారెట్ 10 గ్రా ముల బంగారం ధర రూ.93,200లకు చేరింది.24 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ.లక్ష దాటేసింది. రూ.1,01,670గా ఉంది. వెండి ధర లక్షకు పైగా ఉంది.ప్రస్తుతం కిలో వెండి రూ.1,09,400గా ఉంది. శనివారం నుంచి ఈ ధరలు కొనసాగుతున్నాయి. సోమ వారం తగ్గుతుందా.. పెరుగుతుందా అనేది అంచనా వేయలేని పరిస్థితి. ఇజ్రా యిల్, ఇరాన్ యుద్ధం, రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల మధ్య బంగారం ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.ఈ నెల 26వ తేదీ తర్వాత ఆషాఽఢమాసం వస్తుంది. బంగారం కొను గోళ్లు ఉంటాయి. తర్వాత శ్రావణ మాసం జోరందు కుంటుంది.కానీ పెరుగుతున్న ధరలతో తమ అవసరాలు ఎలా తీర్చుకోవాలని పాలుపోని పరిస్థి తిలో మధ్య తరగతి సామాన్య ప్రజలు ఉన్నారు.
5 నెలలు..రూ.22 వేలు పెరుగుదల
ఇక జనవరి 1 నుంచి ఆదివారం అంటే జూన్ 15వ తేదీకి అంటే సుమారు 5 నెలల 15 రోజులకు 10 గ్రాముల బంగా రం ధర రూ.22 వేలు వరకూ పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం ధర రూ.93,200కు చేరింది.ఇదే బంగారం ధర జనవరి 1న కేవలం 71,150గా ఉంది.ఇక 24 క్యారెట్ బంగారం ధర ప్రస్తుతం రూ.1,01, 670 ఉండగా జనవరి 1న రూ.78 వేలు మాత్రమే. అంటే సుమారు 23 వేలు తేడా ఉంది. ప్రస్తు తం కేజీ వెండిధర రూ.లక్షా 9వేల 400గా ఉంది. జనవరి ఒకటన కేజీ వెండిధర రూ.88,400 మాత్రమే. జనవరి నుంచి ఇప్పటికి సుమారు రూ.21 వేలు పెరిగింది.