Share News

గోల్డ్‌ ‘రేస్‌..’

ABN , Publish Date - Apr 23 , 2025 | 02:02 AM

అడ్డుఅదుపూ లేదు.. ఎంతవరకు వెళ్తుందో తెలీదు.. కొందామంటే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయి.. అసలు భవిష్య త్తులోనైనా ధర దిగివస్తుందా అంటే.. ఆ ఆశలు వదిలే సుకోమంటున్నాయి పరిస్థితులు.. ఇంట్లో వివాహం ఉన్నా సరే అటువైపు కన్నెత్తి చూడ్డానికే బెంబేలెత్తే పరిస్థితి.. అమెరికా-చైనా వాణిజ్య సుంకాల భయంతో కొన్ని వారా లుగా రేసు గుర్రంలా బంగారం ధరలు పట్టు విడుపులు లేకుండా పరుగులు తీస్తున్నాయి.

గోల్డ్‌ ‘రేస్‌..’

  • అడ్డుఅదుపు లేకుండా పరుగులు తీస్తున్న బంగారం ధరలు

  • అమెరికా-చైనా వాణిజ్య సుంకాల భయంతో ప్రకంపనలు

  • లక్షకు చేరువైన 22 క్యారెట్లు.. లక్ష దాటేసిన 24 క్యారెట్లు

  • కళ్లు బైర్లు కమ్మే స్థాయి ధరలతో దుకాణాలన్నీ వెలవెల

  • వివాహాలు భారీగా ఉన్నా ఆభరణాల కొనుగోళ్లు అంతంతే

  • చిన్నాచితకా దుకాణాలు, స్వర్ణకారుల పరిస్థితి దయనీయం

  • భారీగా పెరిగిన బంగారం ధరలతో జీఎస్టీ వసూళ్లు డౌన్‌

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

అడ్డుఅదుపూ లేదు.. ఎంతవరకు వెళ్తుందో తెలీదు.. కొందామంటే కళ్లు బైర్లు కమ్మేస్తున్నాయి.. అసలు భవిష్య త్తులోనైనా ధర దిగివస్తుందా అంటే.. ఆ ఆశలు వదిలే సుకోమంటున్నాయి పరిస్థితులు.. ఇంట్లో వివాహం ఉన్నా సరే అటువైపు కన్నెత్తి చూడ్డానికే బెంబేలెత్తే పరిస్థితి.. అమెరికా-చైనా వాణిజ్య సుంకాల భయంతో కొన్ని వారా లుగా రేసు గుర్రంలా బంగారం ధరలు పట్టు విడుపులు లేకుండా పరుగులు తీస్తున్నాయి. తాజాగా బంగారం ధర మంగళవారం లక్ష దాటేసింది. 22 క్యారెట్ల బంగారం ధర లక్ష వైపునకు ఎగబాతుండగా 24 క్యారెట్లు అయితే లక్ష దాటేసి రూ.1,01,350కి చేరింది. దీంతో బంగారం చరిత్రలో తొలిసారి ఇంత ధరకు చేరడంతో జనం నోరెళ్లబెడుతున్నారు. ఈ ధరలు మున్ముందు ఇంకా భారీ గా పెరుగుతాయన్న అంచనాలతో పసిడి ప్రియులు కల వరపడుతున్నారు. వాస్తవానికి ప్రజలు ధనిక, పేదరికం తేడా లేకుండా బంగారం కొనుగోలుకు మొగ్గుచూపుతా రు. వివాహాలు, ఇతర శుభకార్యాల కోసం ముందుగానే పసిడి తమ స్థాయికి తగ్గట్టు కొంటారు. కానీ ఇప్పుడు పుత్తడి కొనే పరిస్థితి లేకపోవడంతో ఉమ్మడి తూర్పుగోదా వరి జిల్లాలో జనం అసలు బంగారం దుకాణాల వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. ప్రస్తుతం వివాహాల సీజన్‌ నడుస్తుండడంతో పెళ్లి కుటుంబాలు, బంధువులు కాస్త ధర ఎక్కువ అయినా తప్పనిసరిగా ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కానీ ప్రస్తుత ధరలతో బెంబేలెత్తి సగానికిపైగా కొనుగోళ్లు తగ్గించేస్తున్నారు. బంధువులైతే ఆభరణాలు చదివించడం మానేసి డబ్బులు చదివిస్తున్నా రు. అటు ఉమ్మడి జిల్లాలో చిన్నాపెద్దా కలిపి 750వరకు ఆభరణాల దుకాణాలు ఉండగా, వీటికి యాభై శాతం వ్యాపారం పడిపోయింది. కొనుగోళ్లు లేక ఇవన్నీ ఈసురో మంటున్నాయి. చిన్నచిన్న దుకాణాలైతే ఆర్డర్లు తీసుకోవ డం మానేశాయి. తీరా తీసుకున్న తర్వాత ధరలు మరిం త పెరిగితే నష్టపోతామనే భయంతో షాపులు మూసి వేయాల్సిన పరిస్థితి. ఒక్క కాకినాడ నగరంలోనే రోజుకు రూ.5 కోట్ల వరకు ఆభరణాల వ్యాపారం జరగ్గా, ఇప్పుడు రూ.2 కోట్లు కూడా దాటడం లేదని వ్యాపారులు చెబు తున్నారు. కాగా గోల్డ్‌ వ్యాపారం పూర్తిగా పడిపోవడంతో కోట్లలో వచ్చే జీఎస్టీ వసూళ్లు సైతం పడిపోయాయి.

Updated Date - Apr 23 , 2025 | 02:03 AM