Share News

రూ.8 లక్షల ఆభరణాల బ్యాగ్‌ అప్పగింత

ABN , Publish Date - Nov 24 , 2025 | 12:37 AM

రాజమహేంద్రవరం, నవంబరు 23(ఆంధ్ర జ్యోతి): రైలు ఎక్కే హడావుడిలో ఇబ్బంది ఏర్పడి రైలులో వదిలేసిన బంగారు ఆభర ణాలున్న బ్యాగును ప్రయాణికులకు రాజ మండ్రి రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్‌) పోలీసు లు సురక్షితంగా అప్పగించారు. ఆర్పీఎఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ బి.రాజు వివరాల ప్రకారం.. కర్నా టకలోని బ

రూ.8 లక్షల ఆభరణాల బ్యాగ్‌ అప్పగింత
ఆభరణాలను అప్పగిస్తున్న ఆర్పీఎఫ్‌ సీఐ రాజు

రైలులో వదిలేసిన ప్రయాణికులు అప్పగించిన ఆర్పీఎఫ్‌ పోలీసులు

రాజమహేంద్రవరం, నవంబరు 23(ఆంధ్ర జ్యోతి): రైలు ఎక్కే హడావుడిలో ఇబ్బంది ఏర్పడి రైలులో వదిలేసిన బంగారు ఆభర ణాలున్న బ్యాగును ప్రయాణికులకు రాజ మండ్రి రైల్వే రక్షక దళం(ఆర్పీఎఫ్‌) పోలీసు లు సురక్షితంగా అప్పగించారు. ఆర్పీఎఫ్‌ ఇన్స్‌పెక్టర్‌ బి.రాజు వివరాల ప్రకారం.. కర్నా టకలోని బళ్లారికి చెందిన బి.విశ్వనాథరెడ్డి తన భార్యతో అన్నవరం వచ్చారు. తిరుగు ప్రయాణంలో రైలు ఎక్కడానికి స్టేషన్‌కు వెళ్లారు. బిలాస్‌పూర్‌-తిరుపతి రైలు అప్పటికే కదిలే స్థితిలో ఉంది. దీంతో విశ్వనాథరెడ్డి హడావుడిగా లగేజీ తీసుకొని బీ5 కోచ్‌ ఎక్కి వాటిని ఓ బెర్తులో పెట్టారు. కానీ అప్పటికే రైలు కదలడంతో భార్య ఎక్కలేకపోయారు. ఇది గమనించిన భర్త కూడా కిందకు దిగి పోయారు. లగేజీలు మాత్రం రైలులో ఉండి పోయాయి. దీంతో తర్వాత స్టాప్‌ అయిన రాజమండ్రి ఆర్పీఎఫ్‌కి సమాచారమిచ్చారు. ఇన్స్‌పెక్టర్‌ రాజు తమ సిబ్బందిని అప్రమ త్తం చేశారు. రైలు స్టేషనుకు వచ్చిన వెంటనే ఆర్పీఎఫ్‌ ఎస్‌ఐ ఎం.శ్రీనివాసులు, హెచ్‌సీ త్రి నాథరావు తదితర సిబ్బంది కోచ్‌లోని రెండు ట్రాలీ బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. విశ్వనాథరాజు దంపతులకు సమాచారం ఇవ్వగా వాళ్లు స్టేషనుకు వచ్చారు. వారి సమ క్షంలో బ్యాగులను తెరవగా రూ.8లక్షల విలు వ చేసే బంగారు ఆభరణాలు సురక్షితంగా ఉన్నాయి. వాటిని వారికి ఇన్స్‌పెక్టర్‌ రాజు అప్పగించారు. ఆభరణాలు అప్పగించిన వారికి భార్యాభర్తలు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Nov 24 , 2025 | 12:37 AM