Share News

గోధుమ పిండి... రెడీ!

ABN , Publish Date - Dec 24 , 2025 | 12:45 AM

కలెక్టరేట్‌ (కాకినాడ), డిసెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): రేషన్‌ దుకాణాల్లో లబ్ధిదారులకు గోధుమ పిండి పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ చర్యలు తీసుకుంది. తొలుత పట్టణాల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో వచ్చే నెల ఒకటోతేదీ నుంచి గోధుమపిండి ఇచ్చే ందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లాలో జనవరి 1 నుంచి రేషన్‌ షాపు ల్లో గోధుమపిండి పంపిణీ చేయనున్నారు. ఇప్ప టికే 146 మెట్రిక్‌ టన్నుల పిం

గోధుమ పిండి... రెడీ!

రేషన్‌ దుకాణాల్లో పంపిణీ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పట్టణాల్లో

వచ్చే నెల 1 నుంచి ఇచ్చేందుకు సన్నాహాలు

146 మెట్రిక్‌ టన్నులు సిద్ధం

కలెక్టరేట్‌ (కాకినాడ), డిసెంబరు 23 (ఆంధ్ర జ్యోతి): రేషన్‌ దుకాణాల్లో లబ్ధిదారులకు గోధుమ పిండి పంపిణీ చేసేందుకు పౌరసరఫరాలశాఖ చర్యలు తీసుకుంది. తొలుత పట్టణాల్లో పంపిణీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దీంతో వచ్చే నెల ఒకటోతేదీ నుంచి గోధుమపిండి ఇచ్చే ందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి తూర్పు గోదావరిజిల్లాలో జనవరి 1 నుంచి రేషన్‌ షాపు ల్లో గోధుమపిండి పంపిణీ చేయనున్నారు. ఇప్ప టికే 146 మెట్రిక్‌ టన్నుల పిండిని సిద్ధం చేశారు. దీనిలో కాకినాడ జిల్లాకు 55 మెట్రిక్‌ టన్నులు, తూర్పుగోదావరిజిల్లాకు 62 మెట్రిక్‌ టన్నులు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు 29 మెట్రిక్‌ టన్నులు గోధుమపిండి కేటాయించారు. వీటిని తొలివిడతలో పట్టణాలైన కాకినాడ, అమ లాపురం, రాజమహేంద్రవరం, నిడదవోలులో రేషన్‌ డిపోల్లో పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్క కుటుంబానికి కిలో గోధుమపిండి చొప్పున ఇవ్వనున్నారు. కిలో రూ.20కి పంపిణీ చేయ నున్నారు. గోధుమ పిండి కిలో బహిరంగ మార్కెట్‌లో రూ.40 నుంచి 70 వరకు ధర ఉంది. ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరలకే కూటమి ప్రభుత్వం గోధుమపిండి సరఫరా చేయనుంది. తొలివిడతలో పట్టణాల్లో లబ్ధిదారులకు అందజేసి తర్వాత రెండో విడతలో గ్రామీణవాసులకు కేటా యించనున్నారు.

సమూలమైన మార్పులు..

గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్‌ డిపోల వ్య వస్థను భ్రష్టుపట్టించారు. ఎండీయూ వాహనాల ద్వారా రేషన్‌ సరుకులు పంపిణీ చేసి లబ్ధిదా రులకు అనేక ఇబ్బందులను గురి చేశారు. పైగా గోధుమపిండి వంటి నిత్యావసర వస్తువులు పం పిణీ చేయకుండా లబ్ధిదారులను నిర్లక్ష్యం చేశారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికార ంలోకి వచ్చిన తర్వాత ప్రజా పంపిణీ వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చింది. ప్రతినెల 1 నుంచి 15 వరకు రేషన్‌ దుకాణాల్లో బియ్యం, పంచదార పంపిణీ చేస్తోంది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి గోధుమపిండి పంపిణీ చేయనుంది. ప్రధానంగా పట్టణాల్లో లబ్ధిదారులు గోధుమపిండిని ఉదయం, సాయంత్రం అ ల్పాహారంగా, పిండి వంటలకు వినియోగిస్తారు.

త్వరలో రాగులు, జొన్నలు

త్వరలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రేషన్‌ డిపోల్లో రాగులు, జొన్నలు పంపిణీ చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు పోషకాహారం అందించే లక్ష్యంతో వీటిని ప్రభుత్వం సరఫరా చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఇది అమలవుతుంది.

ప్రభుత్వ ఆదేశాలతో గోధుమ పిండి పంపిణీ

ప్రభుత్వ ఆదేశాల మేరకు వచ్చే నెల నుంచి ప్రధాన నగరాల్లో రేషన్‌ డిపోల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తారు. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. లబ్ధిదారుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది.

- పౌరసరఫరాల సంస్థ కాకినాడ జిల్లా మేనేజర్‌ దేవులనాయక్‌

Updated Date - Dec 24 , 2025 | 12:45 AM