మహాలక్ష్మీదేవిగా దర్శనమిచ్చిన బాలాత్రిపుర సుందరి
ABN , Publish Date - Sep 26 , 2025 | 11:48 PM
శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఐదో రోజైన శుక్రవారం లాలాచెరువు హౌసింగ్ బోర్డుకాలనీలోని శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి.. మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రూ.15 వేలు విలువైన రూ.10, 20,50, 100 కరెన్సీ నోట్లు, చిల్లర నాణెలతో అమ్మవారిని అలంకరించినట్టు ఆలయార్చకుడు పొక్కులూరి రవిశర్మ తెలిపారు.
ఐదో రోజు శరన్నవరాత్రి ఉత్సవాలు
అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
పలుచోట్ల కరెన్సీ నోట్లతో అలంకరణ
సామూహిక కుంకుమార్చనలు
దివాన్‌చెరువు, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా ఐదో రోజైన శుక్రవారం లాలాచెరువు హౌసింగ్ బోర్డుకాలనీలోని శ్రీ బాలాత్రిపుర సుందరిదేవి.. మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా రూ.15 వేలు విలువైన రూ.10, 20,50, 100 కరెన్సీ నోట్లు, చిల్లర నాణెలతో అమ్మవారిని అలంకరించినట్టు ఆలయార్చకుడు పొక్కులూరి రవిశర్మ తెలిపారు. అలాగే అమ్మవారిని 108 బంగారు రూపులు, 1000 పంచలోహ నాణెలతోనూ పూజించామని చెప్పారు. అలాగే స్థానిక శ్రీలక్ష్మీగణపతి ఆలయం సముదాయంలోని శ్రీకాశీ అన్నపూర్ణాదేవి ఆలయంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. స్థానిక రాంబాబు డాక్టరు గృహ ఆవరణలోని శ్రీ విశ్వేశ్వరీదేవి ఆలయంలో ప్రముఖులు టీవీ నారాయణరావు ఆధ్యాత్మిక ప్రసంగం చేశారు. కార్యక్రమంలో నన్నయ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ సహాయాచార్యులు తలారి వాసు, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ రాంబాబు, సుబ్బలక్ష్మి, ముక్కవిల్లి వాసు తదితరులు పాల్గొన్నారు. అలాగే వివిధ గ్రామాల్లోని అమ్మవారి ఆలయాలు శుక్రవారం కావడంతో భక్తులతో సందడిగా మారాయి.