Share News

శ్రీ దుర్గాయైు నమః

ABN , Publish Date - Sep 23 , 2025 | 01:10 AM

శరన్నవ రాత్రి మహోత్సవాలు పలు గ్రామాల్లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దివాన్‌చెరువులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయ సముదాయాల్లో కొలువై ఉన్న కాశీ అన్నపూర్ణాదేవి ఆలయంలో కలశస్థాపనతో నవరాత్రిఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజైన సోమవారం అమ్మవారు బాలా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చారు.

శ్రీ దుర్గాయైు నమః
దివాన్‌చెరువులో అమ్మవారిని దర్శించుకుంటున్న బత్తుల వెంకటలక్ష్మి

  • ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం

  • దుర్గాదేవి ఆలయాల్లో విశేష పూజలు

  • తొలి రోజు బాలాత్రిపుర సుందరిగా దర్శనమిచ్చిన అమ్మవారు

దివాన్‌చెరువు, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): శరన్నవ రాత్రి మహోత్సవాలు పలు గ్రామాల్లో సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దివాన్‌చెరువులోని శ్రీలక్ష్మీగణపతి ఆలయ సముదాయాల్లో కొలువై ఉన్న కాశీ అన్నపూర్ణాదేవి ఆలయంలో కలశస్థాపనతో నవరాత్రిఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజైన సోమవారం అమ్మవారు బాలా త్రిపుర సుందరిదేవిగా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి విశేషకుంకుమ పూజలు చేసి హారతులిచ్చారు. అలాగే గ్రామంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మందిరాల్లో అమ్మవారిని జనసేన పార్టీ నాసేన కోసం నావంతు రాష్ట్ర కోఆర్డినేటర్‌ బత్తుల వెంకటలక్ష్మి దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పాలచర్లలోని దుర్గాదేవి ఆలయం, లాలాచెరువు హౌసింగ్‌బోర్డులోని శ్రీ బాలా త్రిపుర సుందరీ ఆలయం, స్థానిక శ్రీవిశ్వేశ్వరీదేవి ఆలయంలో, కొత్తతుంగపాడు, శ్రీరాంపురం తదితర గ్రామాల్లో దేవీ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

Updated Date - Sep 23 , 2025 | 01:10 AM