Share News

ఏలేరుకు గోదావరి జలాలు

ABN , Publish Date - Jul 30 , 2025 | 12:45 AM

ఏలేశ్వరం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టుకు మంగవారం గోదావరి జలాలు ప్రవేశించాయి. ప్రాజెక్టులోకి 175 క్యూసెక్కుల

ఏలేరుకు గోదావరి జలాలు
ఏలేరులోకి చేరిన గోదావరి జలాలు

ఏలేశ్వరం, జూలై 29 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఏలేశ్వరంలోని ఏలేరు ప్రాజెక్టుకు మంగవారం గోదావరి జలాలు ప్రవేశించాయి. ప్రాజెక్టులోకి 175 క్యూసెక్కుల నీరు చేరుతోంది. జగ్గంపేట మండలం రామవరం వద్ద స్టేజ్‌2 నుంచి పంపుల ద్వారా నీటిని ఏలేరుకు తరలిస్తున్నారు. గోదావరి జలాలు ఏలేరుకు చేరడంతో ప్రాజెక్టుపై ఆధారపడిన సుమారు 56వేల ఎకరాలకు సాగు సరఫరా చేసేందుకు వీలుంటుంది. ఇన్నాళ్లు ప్రా జెక్టులో కేవలం 10.46 టీఎంసీల నీరు మాత్రమే ఉండేది. ఈ నీటినే పంపుల ద్వారా విశాఖకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో రైతులకు సాగుపై ఆందోళన ఏర్పడింది. ఇప్పుడు గోదావరి నీరు వ స్తుండడంతో రైతుల ఆనందం వ్యక్తంచేస్తున్నారు.

ప్రాజెక్టు స్థితిగతులు

ప్రస్తుతం ప్రాజెక్టులో 86.56 మీటర్ల ఎత్తున 24.11 టీఎంసీలను నిల్వచేయవచ్చు. వర్షాలు కురవకపోవడంతో నీరు చేరలేదు. దీని వల్ల వారంక్రితం వరకు ప్రాజెక్టులో కేవలం 10.31 టీఎంసీల నీరు మాత్రమే ఉండేది. ప్ర స్తుతం ఏలేరులో 77.25 మీటర్ల స్థాయిలో 10.46 టీఎం సీల నీరు నిల్వ ఉంటుంది. ఖరీప్‌ సాగుకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా నీరు విడుదల చేస్తామని ఏలేరు అధికారులు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సాగుకు 1300 క్యూసెక్కుల వంతున, ఎ డమ కాలువ నుంచి విశాఖకు 200 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నామని చెప్పారు.

Updated Date - Jul 30 , 2025 | 12:46 AM