Share News

స్వల్పంగా పెరిగిన గోదావరి నీటి మట్టం

ABN , Publish Date - Jul 06 , 2025 | 12:38 AM

ధవళేశ్వరం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి స్వల్పంగా పెరిగి ప్రవహిస్తుంది. తూ ర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వ ద్ద కాటన్‌ బ్యారేజ్‌ ధవళేశ్వరం ఆర్మ్‌ లోని 66గేట్లు, ర్యాలీ ఆర్మ్‌లలోని 42గేట్లు, మద్దూరు

స్వల్పంగా పెరిగిన గోదావరి నీటి మట్టం
ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజ్‌ నుంచి దిగువకు ప్రవహిస్తున్న వరద

1,89,129 క్యూసెక్కులు సముద్రంలోకి

ధవళేశ్వరం, జూలై 5 (ఆంధ్రజ్యోతి): పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వాగులు, వంకలు నుంచి వచ్చి చేరుతున్న నీటితో గోదావరి స్వల్పంగా పెరిగి ప్రవహిస్తుంది. తూ ర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వ ద్ద కాటన్‌ బ్యారేజ్‌ ధవళేశ్వరం ఆర్మ్‌ లోని 66గేట్లు, ర్యాలీ ఆర్మ్‌లలోని 42గేట్లు, మద్దూరు ఆర్మ్‌ లో 20గేట్లు, విజ్జేశ్వరాలయంలో 29 గేట్లను 40 మీటర్ల మేర పైకి ఎత్తి 1,89,129 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 10.80అడుగులుగా నమోదైంది. వ్యవసా య అవసరాల కోసం తూర్పుడెల్టాకు 4200 క్యూ సెక్కులు, మధ్యడెల్టాకు 2450క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5800 క్యూసెక్కులు చొప్పున సాగు నీటిని విడుదల చేస్తున్నారు. ఎ గువున భద్రాచలం వద్ద స్వల్పంగా పెరిగిన నీటి మట్టం శనివారం సాయంత్రం 20.30 అడుగులుగా నమోదైంది.

Updated Date - Jul 06 , 2025 | 12:38 AM