నిలకడగా గోదావరి వరద
ABN , Publish Date - Aug 24 , 2025 | 01:38 AM
అమలాపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గత కొన్ని రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి శాంతిస్తుంది. శనివారం తూర్పుగోదావరి జి ల్లా ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఉదయం రెండో ప్రమాద హెచ్చరికను, రాత్రి 7 గంటలకు మొద టి ప్రమాద హెచ్చరికను ఉపసహరించుకుంటున్నట్టు ఇరిగేషన్ అధి
తేరుకుంటున్న గ్రామాలు
కోనసీమ జిల్లాలో 4527 మంది నిరాశ్రయులు
కలెక్టర్ మహేష్‌కుమార్ ప్రకటన
అమలాపురం, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): గత కొన్ని రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి శాంతిస్తుంది. శనివారం తూర్పుగోదావరి జి ల్లా ధవళేశ్వరం బ్యారేజీ దగ్గర ఉదయం రెండో ప్రమాద హెచ్చరికను, రాత్రి 7 గంటలకు మొద టి ప్రమాద హెచ్చరికను ఉపసహరించుకుంటున్నట్టు ఇరిగేషన్ అధికారి ప్రకటించారు. దాంతో 9.85 లక్షల క్యూసెక్యుల నీటిని సముద్రంలోకి వదలడంతో కోనసీమలోని గౌతమి, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమి నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఫలితంగా జిల్లాలో పలు కాజ్‌వేలు ఇంకా జల దిగ్భందంలోనే ఉన్నాయి. పలు లంక గ్రామాలకు వరద ఉధృతి వల్ల రవాణా సౌకర్యాలు స్తంభించి ప్రయాణికులు, ప్రజలు ఇబ్బం దులు పడుతున్నారు. చాకలిపాలెం, మూలస్ధానం, అప్పనపల్లి, ఎదురుబిడియం కాజ్‌వేలలో శనివారం రాత్రికి వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రానికి జిల్లాలో కాజ్‌వేలతో పాటు లంక గ్రామాలు వర ద నీటి నుంచి బయట పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో జిల్లాలో జరిగిన పంటలు, ఇతర నష్టాలపై అధికారులు ప్రత్యేక బృందాలతో అం చనాలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు.
7 పునరావస కేంద్రాల ఏర్పాటు
గోదావరి వరదల కారణంగా కోనసీమ జిల్లాలో 1291 కుటుంబాల వారు ముంపు బారిన పడి 4527 మంది నిరాశ్రయులయ్యారని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టినట్టు వెల్లడించారు. ఇప్పటివరకూ 3 కుటుంబాల్లో 10 మం దిని సురక్షిత కేంద్రాలకు తరలించామని, బాధితుల కోసం 7 పునరావస కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 1098 గృహాలు ముంపు బారిన పడా ్డయి. బాధితుల తరలింపునకు 23 బోట్లు సిద్ధం చేసి 283 మందికి సహాయక చర్యలు చేపట్టాం. 400 ఆహార పొట్లాలు 810 టిన్నెలు వాటర్ సప్లై చేసినట్టు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో బోడసుకుర్రు పల్లిపాలెం, లంక ఆఫ్ ఠాణేలంక, పాశర్లపూడి లంక, చింతపల్లిలంక, కూనలంక, గుర్రుజాపులంక, లక్ష్మీదేవిలంక, గోడిలంక, కొండుకుదురు గ్రామాలు ముంపు బారిన పడినట్టు చెప్పారు.