గోదారయ్..రయ్!
ABN , Publish Date - Sep 07 , 2025 | 12:58 AM
ఒకనాడు రోడ్డు మార్గాలు.. ఆకాశ మార్గాలు ఉండేవి కావు.. కేవలం జల రవాణా లేదంటే నడక.. అందుకే నేటికీ చెబుతుంటారు.. మా తాతలు కాలవల ద్వారా ప్రయాణించే వారని.. అదంతా బ్రిటిష్ వారి కాలంలో మాట..
పది రూట్లలో సరుకు సరఫరా
వాటర్‌వేస్ అథారిటీ ప్రతిపాదన
రవాణాకు సానుకూలత
పర్యాటక బోట్లకు సౌకర్యం
కాలువల అభివృద్ధికి టెండర్లు
పీపీపీ విధానంలో పనులు
మారనున్న గోదారి
(కాకినాడ,ఆంధ్రజ్యోతి)
ఒకనాడు రోడ్డు మార్గాలు.. ఆకాశ మార్గాలు ఉండేవి కావు.. కేవలం జల రవాణా లేదంటే నడక.. అందుకే నేటికీ చెబుతుంటారు.. మా తాతలు కాలవల ద్వారా ప్రయాణించే వారని.. అదంతా బ్రిటిష్ వారి కాలంలో మాట.. నేటికీ ఆయా గురుతులు నిడదవోలు, వేమగిరి తదితర ప్రాంతాల్లో ఉన్నాయి.. మళ్లీ ఆ రోజులు రాబోతున్నాయి.. జల రవాణాను మళ్లీ అందుబాటులోకి తేనున్నారు..ఈ మేరకు గోదావరిలో పది మార్గాలను గుర్తించారు.. ఆయా మార్గాల అభివృద్ధికి టెండర్లు పిలిచారు.. అన్నీ అనుకున్నట్టే జరిగితే గోదారిలో రయ్ రయ్ మంటూ వెళ్లిపోవచ్చు. గోదావరి అంటే అందాలు.. సరదా షికార్లు.. కానీ ఒకప్పుడు రవాణా రంగం అంతగా అభి వృద్ధి చెందని రోజుల్లో గోదావరిపై అనేక ప్రాం తాలకు బోట్లలో సరుకు రవాణా చేసేవారు. పరిశ్రమలకు అవసరమయ్యే ముడిసరుకులను తరలించేవారు.అనేక పోర్టులకు విదేశాల నుంచి వచ్చే కార్గోను సైతం గోదావరి మీదుగా రవాణా చేసేవారు. బోట్లలో ప్రయాణికులు తమ గమ్య స్థానాలకు చేరేవారు.అయితే మళ్లీ ఇప్పుడు ము నుపటి తరహాలో కారు చౌక అయిన జల రవా ణా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయిం చిం ది.గతంలోలా గోదావరి నదిపై బోట్లలో రవా ణా జరిగేలా ప్రతిపాదనలు తయారు చేసింది. కాకినాడ నుంచి రాజమహేంద్రవరం, రాజమ హేంద్రవరం నుంచి విజయవాడ, రాజ మహేం ద్రవరం నుంచి భద్రాచలం, అంతర్వేది నుంచి నర్సాపురం,నర్సాపురం నుంచి సఖినేటిపల్లి, కోటి పల్లి-ముక్తేశ్వరం, నిడదవోలు నుంచి ఏలూరు వరకూ ప్రయాణించేలా మొత్తం పది మార్గా ల ను ఎంపిక చేసింది.ఈ రూట్లలో కాలువల అభివృద్ధి,కార్గో తరలింపు, పర్యాటకుల రవాణా పీపీపీ విధానంలో అభివృద్ధి చేయబోతోంది.
ఎలా ఉపయోగిస్తారంటే..
కాకినాడ పోర్టుకు తెలంగాణ, తమిళనాడు నుంచి వేలాది లారీల్లో భారీ ఎత్తున బియ్యం విదేశాలకు ఎగుమతి కోసం వస్తోంది. భవి ష్యత్తులో గోదావరిపై బియ్యాన్ని కాకినాడ పోర్టు కు తరలించేందుకు అడుగులు పడుతున్నా యి. తెలంగాణ నుంచి పోర్టుకు చైనాకు ఎగుమతి చేయడం కోసం భారీ బండరాళ్లను విజయవాడ -విశాఖ హైవే ద్వారా తరలిస్తు న్నారు. భవిష్య త్తులో ఈ రాళ్లను గోదావరి ద్వారా రవాణా చేయడానికి అనువుగా ఉంటుందని, ఖర్చు కలి సి వస్తుందని అంచనా వేస్తున్నారు. వివిధ దేశా ల నుంచి కాకినాడ పోర్టుకు బొగ్గు, ఎరువులు దిగుమతవుతున్నాయి. వీటిని తెలంగాణతో పాటు విజయవాడ సమీపంలోని అనేక థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు గోదావరిపై బొగ్గు రవాణా చేయనున్నారు. భద్రాచలం, రాజమ హేంద్రవ రంలో కాగితం పరిశ్రమలకు పల్ప్‌ను రవాణా చేయడానికి డిమాండ్ ఉందని గుర్తించారు. రాజమహేంద్రవరం నుంచి ఏలూరు కాలువ ద్వారా విజయవాడకు అనేక రకాల సరుకుల కారుచౌక ధరకు రవాణా చేసేందుకు అవకా శాలు చాలా ఉన్నట్టు గుర్తించారు. కాకినాడ పోర్టుకు క్లింకర్, రాక్‌పాస్ఫేట్ వంటి అనేక రకాల కార్గో వివిధ పరిశ్రమలు విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. వీటన్నింటినీ గోదావరిపై కార్గో రవాణా ద్వారా భారీ ఎత్తున చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి భద్రాచలం వరకు కేవలం పర్యాటకుల కోసం ప్రస్తుతం బోట్లు నడుపుతున్నారు.ఈ రూట్‌లో భవిష్యత్తులో తెలంగాణకు వెళ్లే ప్రయాణికులు, పర్యాటకు లను పెద్దఎత్తున తరలించేలా జలరవాణాను ప్రోత్సహించనున్నారు. నర్సాపురం-అంతర్వేది, ముక్తేశ్వరం -కోటిపల్లి రూట్లలో ప్రస్తుతం పం ట్లలో రాకపోకలు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ రూట్లను ఆధునికీకరించి పెద్ద ఎత్తున వస్తు రవాణా,పర్యాటకులు, ప్రయాణికులు రాకపోకలు సాగించేలా జల రవాణా ప్రోత్సహించనున్నారు. దీంతో మళ్లీ పూర్వపు రోజులు రానున్నాయి.
ఎన్నిదారులో..
గోదావరిని పర్యాటకంగా,పారిశ్రామికంగా ఉప యోగించేందుకు అడుగులు పడుతున్నాయి. పరిశ్రమలకు ముడిసరుకుల రవాణా నుంచి ఆయా పరిశ్రమల్లో తయారైన ఉత్పత్తుల రవా ణా వరకు గోదావరి నది ద్వారా చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకు నేషనల్ వాటర్ వే-4ను అభివృద్ధి చేసి పూర్వ వైభవం తెచ్చేలా సన్నాహాలు చేస్తోంది. కాకి నాడ నుంచి పుదుచ్చేరి వరకు ఉన్న ఈ జల రహదారి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమళి నాడు, పుదుచ్చేరి ప్రాంతాలను కలుపుతూ 1,095 కిలోమీటర్లు పయనిస్తోంది. ఈ జల రహదారిలో అత్యంత కీలకమైన కాకినాడ, రాజ మహేంద్రవరం,విజయవాడ, భద్రాచలం రూట్ల ను కొత్తగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ఇన్ లాండ్ వాటర్ వేస్ అథారిటీ తాజాగా నిర్ణ యుంచింది. ప్రధానంగా గోదావరి నది ద్వారా కాకినాడ, రాజమహేంద్రవరం, విజ యవాడ, భద్రాచలం,అంతర్వేది రూట్లలో కార్గో, పర్యాటక రవాణాకు ఎంతో డిమాండ్ ఉందని భావి స్తోంది.ఈ నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిపై మొత్తం పది రూట్లను ఎంపిక చేసింది. ఈ మార్గాల్లో కాలువలను అభివృద్ధి చేసి సరుకు రవాణా, పర్యాటక రవా ణా అభివృద్ధి చేయాలని ప్రతి పాదించింది.ఈ రూట్లలో ఒకప్పుడు సరుకు రవాణా ఎక్కువగా జరిగేది. కాకినాడ నుంచి బకింగ్‌హం కాలువ వరకు ఎన్నో ఏళ్ల కిందట అనేక పరిశ్రమలకు ఈ కాలువ ద్వారా కార్గో రవాణా అయ్యేది.ఈ నేపథ్యంలో మళ్లీ గోదావరిపై రవాణాకు ద్వారా లు తెరవబోతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
గోదారి వయా..
కాకినాడ నుంచి రాజమహేంద్రవరం కాలువ, రాజ మహేంద్రవరం నుంచి విజయవాడకు ఏలూరు కెనాల్, రాజమ హేంద్రవరం నుంచి గండి పోచమ్మ, గండిపోచమ్మ నుంచి భద్రాచలం, పురుషోత్తపట్నం నుంచి భద్రాచలం, పురు షోత్తపట్నం నుంచి పోలవ రం, పట్టిసీమ హిల్‌లాక్ టెంపుల్ నుంచి ప ట్టిసీమ మెయిన్ లాండ్, అంతర్వేది పల్లిపాలెం నుంచి నర్సాపుర్ వెస్ట్, నర్సాపురం నుంచి సఖి నేటిపల్లి, రాజోలు మండలం సోంపల్లి నుంచి అబ్బిరాజుపాలెం, కోటిపల్లి నుంచి ముక్తేశ్వరం వరకు మొత్తం పది రూట్ల లో గోదావరిలో కార్గో రవాణాకు వీలుగా రహదారులను అభివృద్ధి చేయబోతున్నారు. ఈ మేరకు వాటర్‌వేస్ అథారిటీ ఇటీవల టెండర్లు పిలిచింది. ఈ పది రూట్లను స్ట్రాటజిక్ మార్గాలుగా అభివృద్ధి చేసి పరిశ్రమల క్టస్టర్లు, మల్టీమోడల్ కనెక్టివిటీ పాయింట్స్‌ను గుర్తించాలని పలు కంపెనీలను ఆహ్వానించింది. గోదావరిపై గుర్తిం చిన పది రహదారులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఒకప్పుడు కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు ఉన్న కాలువ ద్వారా ఏటా 11 మిలియన్ టన్నుల కార్గో రవాణాకు అవకాశం ఉందని కొంతకాలం కిందట వాప్కోస్ అనే సంస్థ అధ్యయనంలో తేల్చింది. ఇందులో 30శాతం కార్గో రవాణా కాకినాడ- రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం- భద్రాచలం, రాజమహేంద్రవరం-విజయవాడ జలమార్గాల్లో జరిగే అవకాశం ఉందని విశ్లేషించింది.