గో..దారేది!
ABN , Publish Date - Oct 08 , 2025 | 01:10 AM
గోదావరి వరద తగ్గింది.. అయినా నేటికీ ఘాట్లు తెరుచుకోలేదు.. బంద్ చేసే ఉన్నాయి.. దీంతో భక్తులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమా దం జరిగిందని 10 రోజుల కిందట గోదావరి పరీవాహక ప్రాంతంలోని అన్ని ఘాట్లు మూసేశారు.. ఎవరినీలోనికి అడుగుపెట్టనీయడం లేదు.
వరద తగ్గినా.. తెరుచుకోని ఘాట్లు
రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద తగ్గింది.. అయినా నేటికీ ఘాట్లు తెరుచుకోలేదు.. బంద్ చేసే ఉన్నాయి.. దీంతో భక్తులు, సందర్శకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమా దం జరిగిందని 10 రోజుల కిందట గోదావరి పరీవాహక ప్రాంతంలోని అన్ని ఘాట్లు మూసేశారు.. ఎవరినీలోనికి అడుగుపెట్టనీయడం లేదు. అయితే ఘాట్ల వద్ద రక్షణ చర్యలు మాత్రం చేపట్టడంలేదు.. మళ్లీ వరదొస్తే మళ్లీ మూసేయడం తప్ప శాశ్వత పరిష్కా రంపై దృష్టి పెట్టడంలేదు. ఇటు రాజమహేంద్రవరం, అటు కొవ్వూరు వైపు అంతే. ప్రస్తుతం అయ్యప్ప, భవానీ, వెంకటేశ్వరస్వామి మాలధారులు గోదావరి స్నానానికి ఎక్కువగావస్తుం టారు. ఘాట్లు మూసి వేసి ఉండడంలో నిట్టూర్చుతున్నారు. మరో వైపు మెట్లపై మట్టి పేరుకు పోయింది. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. విజయ వాడ కృష్ణానదిలో మెట్ల వద్ద సిమెంట్ మెస్ అడ్డుగా ఉంటుంది. దీంతో అక్కడ నీట మునిగిన ప్రమాదాలు చాలా అరుదు. ఆ దిశగా గదావరి మన ఘాట్ల వద్ద కూడా అలా ఏర్పాటు చేస్తే వరదొచ్చినా ఇబ్బంది ఉండదని భక్తులు అంటున్నారు.. ఆ దిశగా అధికారులు ఆలోచించాల్సి ఉంది.