Share News

గోదారి గట్టుంది.. గట్టు మీన సెట్టుందీ!

ABN , Publish Date - Jun 14 , 2025 | 01:19 AM

రాజమహేంద్రవరం మారబోతోంది. మరింత సుందరంగా కనిపిం చబోతోంది. నగరానికి మరో ఆహ్లాదం. మరో మోదం గోదావరి రివర్‌ ఫ్రంట్‌.రోడ్డు పార్కు కలిసి వస్తుంది.

గోదారి గట్టుంది.. గట్టు మీన సెట్టుందీ!
గోదావరి రివర్‌ ఫ్రంట్‌ మారనుందిలా..

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

రాజమహేంద్రవరం మారబోతోంది. మరింత సుందరంగా కనిపిం చబోతోంది. నగరానికి మరో ఆహ్లాదం. మరో మోదం గోదావరి రివర్‌ ఫ్రంట్‌.రోడ్డు పార్కు కలిసి వస్తుంది.హైదరాబాద్‌ ట్యాంక్‌ బండ్‌.. వైజా గ్‌ బీచ్‌ రోడ్డును తలపించేలా.. గోదావరి రివర్‌ ఫ్రంట్‌ మారబోతోంది. గోదావరి నీటి గలగలలు, చల్లటి గాలి, నీటి ప్రవాహం ఒయ్యారం చూస్తూ రివర్‌ ఫ్రంట్‌లో కూర్చుంటే తనివి తీరా ఆహ్లాదమే. ఇక్కడ అధికారులు రూపొందించిన డిజైన్లు చూడముచ్చటగా ఉన్నాయి. పివి నరసింహారావు పార్కు నుంచి గౌతమి నందనవనం వరకూ 550 మీటర్ల పొడవున ఈ రివర్‌ ఫ్రంట్‌ నిర్మించనున్నారు.దీనికి మొత్తం రూ.22 కోట్ల వ్యయ అంచనా వేశారు. దీనిని అప్పర్‌, లోయర్‌ విభాగాలుగా విభజించారు. మొదటి ప్యాకేజీని రూ.14 కోట్లతో చేస్తు న్నారు.అందులో పద్మావతి ఘాట్‌ వద్ద బ్రిడ్జి, రివర్‌ ఫ్రంట్‌ భాగం నిర్మిస్తారు. ఇక్కడ గ్రీనరీ, సీటర్స్‌, లైటింగ్‌, ప్లాజా ప్లేసెస్‌ (కూర్చో వడానికి వీలుగా),రోడ్డు వైపు ఓపెన్‌గా ఉండేటట్టు నిర్మించనున్నారు. పద్మావతి ఘాట్‌ వద్ద గ్యాప్‌లో 83 మీటర్ల బ్రిడ్జిని నిర్మిస్తారు. నదిలో 35 అడుగుల లోతులో ఫైల్‌ ఫౌండేషన్‌ వేస్తున్నారు. ప్రస్తుతం బ్రిడ్జి టెస్ట్‌ పైల్‌ నిర్మిస్తున్నారు. దీనిని 9 నెలలో పూర్తి చేయాల్సి ఉంది. కానీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ ఆరు నెలలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఇక్కడ పిండ ప్రదానాల రేవు, ప్రము ఖల విగ్రహాల విషయమై అఖిలపక్షంతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఇప్ప టికే చర్చించిన సంగతి తెలిసిందే. రివర్‌ వైపు లోయర్‌ ప్రాంతంలో మిగతా సొమ్ముతో పనులు చేయనున్నారు. ప్రస్తుతం ఇరిగేషన్‌ శాఖ డిజైన్లను రూపొందిస్తుంది.త్వరలో టెండర్లు పిలవనున్నారు.

Updated Date - Jun 14 , 2025 | 01:19 AM