Share News

గోదావరి ఉధృతం

ABN , Publish Date - Aug 18 , 2025 | 12:32 AM

ధవళేశ్వరం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఎగు వు నుంచి వస్తున్న వర ద నీటితో గోదావరి ఉధృ తంగా ప్రవహిస్తుంది. తెలంగాణ పరివాహకంలోని కడెం, శ్రీపాదయల్లె ంపల్లి ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద నీటితో కాళేశ్వరం, పేరూ రు వద్ద నీటి మట్టం పెరుగుతూ గోదావరికి చేరుతుంది. దీంతో తూర్పుగోదావ

గోదావరి ఉధృతం
రాజమహేంద్రవరం పుష్కర్‌ఘాట్‌ వద్ద గోదావరి ప్రవాహం

ధవళేశ్వరం వద్ద పెరుగుతున్న నీటి మట్టం

4,84,214 క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల

ధవళేశ్వరం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఎగు వు నుంచి వస్తున్న వర ద నీటితో గోదావరి ఉధృ తంగా ప్రవహిస్తుంది. తెలంగాణ పరివాహకంలోని కడెం, శ్రీపాదయల్లె ంపల్లి ప్రాజెక్టుల నుంచి విడుదల చేసిన వరద నీటితో కాళేశ్వరం, పేరూ రు వద్ద నీటి మట్టం పెరుగుతూ గోదావరికి చేరుతుంది. దీంతో తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువ ను ంచి వస్తున్న వరద నీటిని అంచనా వేస్తూ ధవళేశ్వ రం వద్ద కాటన్‌ బ్యారేజ్‌ గేట్లను మరింత పైకి ఎత్తి వరద ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తూ గోదావరి బేసిన్‌ను ఖాళీ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రానికి బ్యారేజ్‌ 175 గేట్లను 1.5మీటర్ల మేర పైకి ఎత్తి 4,84,214 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలివేస్తున్నారు. దీంతో గోదావరి నీటి మట్టం 9.80 అడుగులుగా న మోదైంది. డెల్టా పరిధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాల వల్ల వ్యవసాయ అవసరాలకు నీటి విడుదలను మరిం త తగ్గించారు. తూర్పుడెల్టా కాలువకు 1500 క్యూసెక్కు లు, మధ్యడెల్టా కాలువకు 200 క్యూసెక్కులు, పశ్చిమడెల్టా కాలువకు 500క్యూసెక్కులు చొప్పున 2200క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఎగువున భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం ఆదివారం సాయంత్రానికి 33.70 అడుగులకు చేరుకుంది. నీటి మట్టం మరో 5 అడుగులకు పెరగవచ్చని అధికారుల అంచనా.

Updated Date - Aug 18 , 2025 | 12:32 AM