పుష్కలంగా నిధులు.. పుష్కరానికి పనులయ్యేనా!
ABN , Publish Date - May 26 , 2025 | 12:58 AM
అఖండ గోదావరి ప్రాజెక్టుకు పుష్కలంగా నిధులు వచ్చినా.. పనులు ఆరంభించడంలో అధికారులు జాప్యం చేస్తుండడం చర్చనీయా ంశమవుతోంది.
రూ.94 కోట్లు నిధులు విడుదల
పుష్కరఘాట్‌కు టెండర్ ఖరారు
అభివృద్ధికి ఎదురుచూపులు
అయినా ఆరంభంకాని పనులు
అఖండ గోదావరి ప్రాజెక్టు జాప్యం
పట్టించుకోని అధికారులు
(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)
అఖండ గోదావరి ప్రాజెక్టుకు పుష్కలంగా నిధులు వచ్చినా.. పనులు ఆరంభించడంలో అధికారులు జాప్యం చేస్తుండడం చర్చనీయా ంశమవుతోంది. గత పుష్కరాల సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా బోటు మీద గోదావరి నదిలో పయ నించి పర్యాటరంగానికి ఇది చాలా అనువైన ప్రాంతమని భావించారు. వెంటనే అఖండ గోదావరి ప్రాజెక్టు పేరిట రూ.100 కోట్లు మం జూరు చేస్తున్నామని ప్రకటించారు. అఖండ గోదావరి టూరిజానికి సంబంధించిన ప్రధాన కార్యాలయం కూడా ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.ఈ మేరకు అనుకున్నదే తడ వుగా రీజినల్ కార్యాలయం పెట్టారు. అధికా రినీ నియమించారు. ఉభయగోదావరి జిల్లాల్లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయ డానికి , హేవలాక్ బ్రిడ్జిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడా నికి ఉపక్రమించారు. కానీ తర్వాత ప్రభుత్వం మారడంతో అఖండ గోదావరి ప్రాజెక్టుతో పా టు, కార్యాలయం ఎత్తేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయంతో నారా చంద్ర బాబు నాయకత్వంలో కూటమి విజయం సా ధించడం,ఆయన ముఖ్యమంత్రి కావడం తెలి సిందే.ఈ నేపథ్యంలో మళ్లీ అఖండ గోదావరికి ప్రాణం పోశారు. పైగా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రిగా రాజమహేంద్రవరానికి చెందిన కం దుల దుర్గేష్ ఉన్న సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ సాసాతో రూ.94 కోట్లు శాంక్ష న్ చేశారు. నిధులు వచ్చేశాయి.ఈ ప్రాజెక్టు కింద రాజమహేంద్రవరం పుష్కరఘాట్‌ను ఆధ్యాత్మికంగా, పర్యాటక కళ ఉట్టిపడేలా తీర్చి దిద్దనున్నారు.డిజైన్లు సిద్ధమైనట్టు సమాచారం. ఇటీవల టెండర్లు ఖరారు చేశారు. ఇక్కడ మ్యూజిక్ టవర్, నక్షత్ర స్థంభం, ఓం సింబల్, నదిలో నీళ్లు తాగున్నట్టు ఏనుగు విగ్రహాలు.. పలు అభివృద్ధి పనులు చేయనున్నారు. నిధు లున్నా ఇంకా పనులు ఆరంభించలేదు. వచ్చేది వర్షాకాలం, వరదల సమయం కావడంతో పు ష్కరఘాట్‌లో పనులకు ఆటంకం కలుగు తుం ది. అఖండ గోదావరి ప్రాజెక్టు కింద హేవలాక్ బ్రిడ్జిని పర్యాటక కట్ట డంగా అభివృద్ధి చేయ డం, కడియం నర్సరీల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం, కడియపులంక కాలువలో బోట్ షికారు,నిడదవోలు కోట సత్తెమ్మ గుడి వద్ద భక్తుల వసతి భవనం,శెట్టిపేట వద్ద కా లువలో బోట్ షికారు వంటి పనులు ఉన్నా యి.ఇంకా టెండర్లు పిలవలేదు.పనులైతే పుష్కరాల నాటికి ప్రభుత్వం యోచించినట్టుగా ఈ ప్రాం తం అభివృద్ధి చెందుతుంది.