Share News

‘ముంపు’ టెన్షన్‌

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:23 AM

చింతూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): వరదల కాలం వచ్చింది. దీంతో ముంపు ప్రాంతా ల్లో టెన్షన్‌ ప్రారంభమైంది. నదీ పరి వాహక ప్రాంతంలో ఎడ తెరి పి లేని వర్షం కురవగా అక్కడి లో తట్టు ప్రాంతాలు మంపునకు గు రవడం సహజం. ఐతే విలీన మం డలాల పరిస్థితి అందుకు భిన్నం. మన రాష్ట్రంతో పాటు ఒడిస్సా, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ, మహారాష్ట్ర లో ఎడతెరిపి లేకుండా వర్షం కురి సినా, వరదలు సంభవించినా ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది. ఇది ప్రతి ఏటా జరిగే తంతే.

‘ముంపు’ టెన్షన్‌
వరరామచంద్రపురంలో లోతట్టు ప్రాంత వాసులు ఏర్పాటు చేసుకుంటున్న వలస పాకలు

భద్రాచలం వద్ద క్రమంగా పెరుగుతోన్న గోదావరి

లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఆందోళన ప్రారంభం

వలస పాకల ఏర్పాట్లలో నిమగ్నం

చింతూరు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): వరదల కాలం వచ్చింది. దీంతో ముంపు ప్రాంతా ల్లో టెన్షన్‌ ప్రారంభమైంది. నదీ పరి వాహక ప్రాంతంలో ఎడ తెరి పి లేని వర్షం కురవగా అక్కడి లో తట్టు ప్రాంతాలు మంపునకు గు రవడం సహజం. ఐతే విలీన మం డలాల పరిస్థితి అందుకు భిన్నం. మన రాష్ట్రంతో పాటు ఒడిస్సా, ఛత్తీస్‌గడ్‌, తెలంగాణ, మహారాష్ట్ర లో ఎడతెరిపి లేకుండా వర్షం కురి సినా, వరదలు సంభవించినా ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది. ఇది ప్రతి ఏటా జరిగే తంతే. వీటికి తోడు ఇప్పుడు పోలవరం బ్యాక్‌ వాటర్‌ తోడైంది. దీంతో వర్షాకాలం వచ్చిందంటే చాలు లోతట్టు వాసులకు కంటిమీద కునుకు కరువే. శబరి, సీలేరు, గోదావరి నదుల ఉధృతే దీనం తటకీ కారణం. ప్రతి ఏటా జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు ఇది తప్పని దుస్థితి. కొన్నేళ్లుగా జూలై లోనే గోదావరి ఉగ్రరూపం దాల్చిన సందర్భాలున్నాయి. దీంతో ఈనెల ఎట్టా ఉంటుందో నన్న ఆందోళన అలముకుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతోంది. గురువారం సాయంత్రం 3 గంటలకు భద్రాచలంలో 24.10 అడుగులకు గోదావరి చేరు కుంది. గతేడాది జూలై 27న భద్రాచలం వద్ద గోదావరి 53.6 అడుగుల గరిష్ఠ ప్రవాహం నమోదైంది. దీంతో లోతట్టు గ్రామా లు నీట మునగడమే కాకుండా రాకపోకలు నిలిచిపోయాయి.

ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం..

గడచిన ఆరున్నర దశాబ్దాల కాలంలో జూలై నెలలో గోదా వరి వరద ఉధృతిని పరిగణలోకి తీసుకుంటే 14 సార్లు తొలి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహించింది. అదే దశలో ఆరు పర్యాయాలు తుది ప్రమాద హెచ్చరిక (53 అడుగులు) దాటి ప్రవహించింది. వరుసగా 1972 జూలై 6న 44.3 అడుగుల నీటిమట్టం నమోదైంది. 1976 జూలై 22న 63.9 అడుగులు, 1988 జూలై 24న 56.7, 2003 జూలై 27న 45.8, 2008 జూలై 6న 47.3, 2013 జూలై 19న 47, 2016 జూలై 12న 52.4, 2022 జూలై 16న 71.3 అడుగులు, 2023 జూలై 30న 56.1, 2024 జూలై 27న 53.6 అడుగులకు చేరుకుని ప్రవహిం చింది. వీటిలో 2022 జూలై 16న రికార్డుస్థాయిలో 71.3 అడుగుల మేర గోదావరి ప్రవాహం నమోదైంది. దీంతో చింతూరు డివిజనులోని లోత ట్టు గ్రామాలు ఛిద్రమయ్యాయి. ఇళ్లు కూలిపోయి బురదలో కూరుకపోయా యి. ఇక రహదారులు సరేసరి. భద్రాచలంలో గోదావరి నది 59 అడుగుల నుంచి 63 అడుగుల వరకు ప్రవ హించిన క్రమంలో చింతూరు డివిజనులోని 180 గ్రామాలపై ఆ ప్రభావం పడనుంది. ఆపై ప్రవాహం ఉంటే మునక మరిం త పెరుగుతూ ఉంటుంది.

సమీక్షలు...

ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమా ర్‌ ఒక పర్యాయం, చింతూరు ఐటీడీఏ పీవో అపూర్వ భరత్‌ మండలాల వారీగా వరద సమీక్షలు నిర్వహించారు. ఆ మేరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలు, అధికారులకు స్పష్టం చేశా రు. భద్రాచలం వద్ద గోదావరి క్రమంగా పెరుగుతుండడం, రానున్న రెండు రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో లోతట్టు వాసులు సురక్షిత ప్రాంతాలలో వలస పాకల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అదే దశలో సామగ్రిని కూడా సురక్షిత ప్రదేశాలలో భద్రపర్చుకుంటున్నారు.

Updated Date - Jul 11 , 2025 | 01:23 AM