Share News

వర్రీ.. తీరినట్టే!

ABN , Publish Date - May 06 , 2025 | 01:08 AM

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టంచేశారు. కాకినాడ కలెక్టరేట్‌ వివేకానంద సమావేశ హాలులో సోమవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్‌, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, రైస్‌మిల్లర్లు, జేసీలతో సమావేశమయ్యారు.

వర్రీ.. తీరినట్టే!
కొనుగోళ్లపై సమీక్షలో మాట్లాడుతున్న పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌

  • రైతుల సమస్యకు.. మూడు పరిష్కారాలు

  • ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం పెంపు

  • జిల్లాలో మరో 2 లక్షల టన్నులు

  • తేమశాతం 22 ఉన్నా కొనాలి

  • మిల్లర్లకు బ్యాంక్‌ గ్యారెంటీ 1:2

  • అధికారుల తీరుపై అసహనం

  • వాడివేడిగా మంత్రి నాదెండ్ల సమీక్ష

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ స్పష్టంచేశారు. కాకినాడ కలెక్టరేట్‌ వివేకానంద సమావేశ హాలులో సోమవారం సాయంత్రం మంత్రి నాదెండ్ల మనోహర్‌, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల ప్రజాప్రతినిధులు, రైస్‌మిల్లర్లు, జేసీలతో సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల నేపథ్యంలో మూడు జిల్లాల్లో సీఎంఆర్‌ టార్గెట్‌ని అదనంగా పెంచా మని తెలిపారు. కాకినాడ జిల్లాకు 50 వేల ట న్నులు, కోనసీమ జిల్లాకు లక్ష టన్నులు, తూ ర్పుగోదావరి జిల్లాకు ఇప్పటికే పెంచిన 30 వేల టన్నులకు అదనంగా మరో 50 వేల టన్నులు పెంచామన్నారు. గత 9 నెలల్లో 49.45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొను గోలు చేసి రూ.11,400 కోట్లు వారి ఖాతాల్లో జ మ చేశామన్నారు. అకాల వర్షాల వల్ల రైతులు నష్టపోకుండా తడిచిన ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ధాన్యం తేమ 22 శా తం వరకూ ఉన్నా కొనుగోళ్లు జరపాలని అధి కారులను ఆదేశించారు. కోనసీమలో మిల్లర్లకు బ్యాంకు గ్యారెంటీని 1:1 ఇవ్వడంపై మంత్రి అ టు జేసీ, ఇటు సివిల్‌ సప్లయిస్‌ అధికారుల వివరణ కోరారు. ఎమ్మెల్యేల సూచన, మిల్లర్ల కోరిక మేరకు బ్యాంకు గ్యారెంటీ 1:2 ఇవ్వాలని సూచించారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలు మళ్లీ జరగకూడదు. ఎన్ని కల ముందు చంద్రబాబు ఇచ్చిన స్పష్టమైన హామీలు కచ్చితంగా అమలు చేయాలన్నారు.

అధికారుల తీరుపై ఆగ్రహం...

ధాన్యం కొనుగోలు విషయమై మంత్రి మనో హర్‌ వద్ద అనపర్తి, జగ్గంటపే, మండపేట, కొత్తపేట ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, జ్యోతుల నెహ్రూ, వేగుళ్ల జోగేశ్వరరావు, బం డారు సత్యానందరావు గోడు వెళ్లబోసుకున్నారు. ఈ మేరకు కాకినాడ,తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల అధికారులపై పౌరసరఫరాలశాఖ మం త్రి మనోహర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కోనసీమ జేసీ ధాన్యం సేకరణపై ఇచ్చిన వివరణలపై మంత్రి మనోహర్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ధాన్యం కొనుగోలు అంశంపై మంత్రి నాదెండ్ల మనోహ ర్‌ అడిగిన ప్రశ్నలకు జేసీ చినరాముడు సరిగా స్పందించకపోవడంతోపాటు ఎమ్మెల్యే నెహ్రూ చెప్పిన విషయాలపైనా ఆయన పొంతన లేని సమాధానాలు ఇవ్వడంతో మంత్రి అసహనం వ్యక్తంచేశారు. ఒక దశలో జేసీని ప్రత్యేకంగా కలవాలని సూచించారు. అటు సివిల్‌ సప్లయిస్‌ డీఎంపైనా తనదైనశైలిలో మండిపడ్డారు. పదే పదే తమకు ఎమ్మెల్యేలతో ఫోన్లు చేయించడమేంటని.. క్షేత్రస్థాయిలో తిరగాలని సూచించా రు. ఆదివారం కురిసిన వర్షాల వల్ల ధాన్యం తడిసి రైతులు ఆందోళన చెందుతున్న అంశా లను కాకినాడ కలెక్టర్‌ షాన్‌మోహన్‌ మంత్రికి వివరించారు. అనంతరం మూడు జిల్లాల జేసీ లు ఇప్పటివరకు తమ జిల్లాల్లో రబీ ధాన్యం సేకరణ ప్రగతిని వివరించారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులు, మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. వర్షాల వల్ల దెబ్బతిన్న ధాన్యానికి మద్దతు ధర ప్రకారం పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. రైతు సేవా కేంద్రాల టార్గెట్‌ పెంచాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు. జిల్లాలో కొనుగోళ్ల పెండింగ్‌ రూ.16.75 లక్షల కమీషన్‌ చెల్లింపు చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు. తూర్పుగోదావరి జిల్లాలో 40 శా తం ధాన్యం రోడ్డుపైనే ఉందని అనపర్తి ఎమ్మె ల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. కార్యక్ర మంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీని వాస్‌, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం, ఎమ్మె ల్యేలు పంతం నానాజీ, బుచ్చిబాబు, వన మాడి కొండబాబు, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ చైర్మ న్‌ తోట సుధీర్‌, కుడా చైర్మన్‌ తుమ్మల రామ స్వామి, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల జేసీ లు చినరాముడు, టి.నిషాంతి, మూడు జిల్లాల రైస్‌మిల్లర్ల సంఘం అధ్యక్షులు నున్న రామకృష్ణ (కాకినాడ), కర్రి వెంకటరెడ్డి (తూర్పు గోదా వరి), చౌదరి (కోనసీమ) పాల్గొన్నారు.

ప్రతి గింజనూ కొంటాం : దుర్గేష్‌

రాజమహేంద్రవరం: ధాన్యం సేకరణ విషయంలో వైసీపీ అసత్య ప్రచారాన్ని నమ్మవ ద్దని, రైతులు పండించిన ప్రతి గింజను ప్రభు త్వం కొంటుందని మంత్రి కందుల దుర్గేష్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రైతులు ధాన్యం అ మ్మకాల విషయంలో ఎదుర్కొంటున్న సమస్య లను మంత్రి నాదెండ్ల మనోహర్‌ దృష్టికి తీసు కెళ్లానన్నారు. దీంతో మరో 50 వేల టన్నుల సేకరణకు అనుమతి లభించిందని చెప్పారు.

Updated Date - May 06 , 2025 | 01:08 AM